Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘సింహస్వప్నం’… పేరుకు జగపతిబాబు హీరో… కృష్ణంరాజుదే హవా…

January 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. జగపతిబాబు హీరోగా , అదీ ద్విపాత్రాభినయంతో , నటించిన మొదటి సినిమా 1989 లో వచ్చిన ఈ సింహస్వప్నం . జగపతి ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై వి బి రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మాతృక ఖతరోం కే ఖిలాడీ .

ఆ హిందీ సినిమాకు కూడా నిర్మాత వి బి రాజేంద్రప్రసాదే . హిందీలో ధర్మేంద్ర , సంజయ్ దత్ , మాధురీ దీక్షిత్ , నీలం  తదితరులు నటించారు .

Ads

కధ మామూలు రివెంజ్ తీసుకునేదే . అయితే ఆ రివెంజ్ వ్యవస్థ మీద కూడా . ట్రక్ డ్రైవరుగా పనిచేసే కృష్ణంరాజు తమ్ముడిని ట్రక్కుల ఓనర్లు రంగనాథ్ , ఆహుతి ప్రసాదులు చంపేసి ఆ కేసుని కృష్ణంరాజు మీద తోసేస్తారు . జైల్లో నుంచి పారిపోయి విలన్ల కాలూ చేయి ఇరగకొట్టి చట్టం నుండి తప్పించుకునే బడా బాబులను లేపేసే సింహస్వప్నంగా రూపాంతరం చెందుతాడు కృష్ణంరాజు .

అతని భార్య జయసుధ ఇద్దరు కవలలకు జన్మను ఇస్తుంది . ఆమెను కాపాడిన గిరిబాబు , అనితలకు ఒక బిడ్డను ఇస్తుంది . మరొక బిడ్డను తాను పెంచుతుంది . దురదృష్టవశాత్తు ఓ ప్రమాదంలో ఆమె గత స్మృతులను మరచిపోతుంది .

గిరిబాబు వద్ద పెరిగిన జగపతిబాబు ప్రైవేట్ డిటెక్టివ్ అయి పోలీసులకు సహాయపడుతుంటాడు . జయసుధ వద్ద పెరిగిన జగపతిబాబు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు . ఇద్దరు ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతారు . క్లైమాక్సులో తండ్రి కొడుకులు విలన్లందరినీ లేపేస్తారు . తండ్రి చట్టానికి లొంగిపోవటంతో సినిమా ముగుస్తుంది .

జగపతిబాబు ద్విపాత్రాభినయం ప్రేక్షకులకు కొంత కన్ఫ్యూజన్ కలగచేస్తుంది . ఇద్దరి ఆహార్యంలో తేడాలు ప్రస్ఫుటంగా ఉంటే ప్రేక్షకులు కంఫర్టబుల్ గా జగపతిబాబు ద్విపాత్రాభినయాన్ని ఎంజాయ్ చేసి ఉండేవారేమో ! పైగా తనకు నటన కొత్త కొత్త…

నటనపరంగా కృష్ణంరాజు , జయసుధ గురించి చెప్పేదేముంది ! ఇద్దరికీ కొట్టిన పిండే . ఏంగ్రీ రెబల్ వ్యక్తిగా కృష్ణంరాజు అదరగొట్టేసారు . జగపతిబాబుకు హీరోగా మొదటి చాన్సే అయినా కష్టపడ్డాడు . ఇంక గ్లామర్ స్పేసులో వాణీ విశ్వనాధ్ , శాంతిప్రియ చక్కగా ఇమిడిపోయారు .

ఇతర ప్రధాన పాత్రల్లో రంగనాధ్ , ఆహుతి ప్రసాద్ , గొల్లపూడి , నర్రా , చలపతిరావు , ప్రదీప్ శక్తి , త్యాగరాజు , గుమ్మడి , రమణమూర్తి , సారధి  తదితరులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలనన్నీ ఆత్రేయే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ బాగా పాడారు . ముఖ్యంగా కళ్ళలోన నీవే గుండెలోన నీవే అనే పాట రెండు సన్నివేశాలలో వస్తుంది . శ్రావ్యంగా ఉంటుంది . మిగిలిన డ్యూయెట్లు అన్నీ జగపతిబాబు , వాణీ విశ్వనాధ్ , శాంతిప్రియ మీద ఉంటాయి . బాగా చిత్రీకరించారు . నృత్య దర్శకుడు ప్రకాషుని మెచ్చుకోవలసిందే .‌

సినిమాలో స్కేటింగ్ ఫైట్లను సాహుల్ బాగా కంపోజ్ చేసాడు . డైలాగులను డి ప్రభాకర్ వ్రాసాడు . ఈయన గురించి నాకు తెలియదు . బాగానే వ్రాసాడు . సినిమా యూట్యూబులో ఉంది . జగపతిబాబు అభిమానులు ట్రై చేయవచ్చు .‌

నేను పరిచయం చేస్తున్న 1232 వ సినిమా , #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సింహస్వప్నం’… పేరుకు జగపతిబాబు హీరో… కృష్ణంరాజుదే హవా…
  • చేదు వాస్తవం- నిష్ఠుర నిజం… కేసీయార్ పాలన తీరుతోనే ‘సింగరేణి చీకట్లు’…
  • ట్రంపు ఎంత గోకుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే..?
  • ఒక అచ్యుతానందన్… ఒక శిబూ సోరెన్… పద్మాల్లో మోదీ మార్క్ పరిణతి..!
  • దర్శకుడు మారుతికి కొత్త తలనొప్పి… ఫ్యాన్స్ నుంచి కొత్త నిరసన…
  • ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…
  • 120 రోజులు సముద్ర గర్భంలో… సెయిలర్ కాదు, ఏరోస్పేస్ ఇంజనీర్…
  • అత్యంత సంక్లిష్టత..! విదేశీ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్న పోలవరం..!!
  • నిర్మూలన..! కనుమరుగు కానున్న హిస్టారికల్ పాంబన్ రైల్వే బ్రిడ్జి..!!
  • సిన్నర్స్..! ఆస్కార్ నామినేషన్లలో అదిరిపోయే రికార్డు..! మనమెక్కడ..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions