Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…

June 7, 2026 by M S R

.

ఇంతకుముందు వేరు… ఢిల్లీలో ఖలిస్థానీవాది కేజ్రీవాల్ రాష్ట్ర ప్రభుత్వం… రైతుల పేరిట అరాచక ఆందోళనలకు సిద్దపడేవారికి అన్నిరకాల సాయం… చేష్టలుడిగిన మోడీ ప్రభుత్వం… ఎర్రకోటపై జెండా ఎగరేయడం నుంచి, ఢిల్లీ వీథుల్లో కలకలాన్ని, కలవరాన్ని క్రియేట్ చేసి, అసలు ప్రభుత్వం అంటూ ఉందా అనే సందేహాలు తలెత్తిన స్థితి…

కానీ ఇప్పుడు ఛేంజ్ కనిపిస్తోంది… సీజేపీ పేరిట మొదలైన ఓ డిజిటల్ భ్రమాత్మక ఉద్యమంపై అన్ని కోణాల్లో నిఘా మొదలైంది… అసలు ఆ జంతర్ మంతర్ ధర్నాకు అనుమతి ఇవ్వడమే ఓ పర్పస్ కోసం… ఎవరెవరు ఈ బ్యానర్‌ను వాడుకుంటున్నారో గుర్తించడానికి..! ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ ఈసారి దాదాపు 150-200 ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను మొహరించాడు…

Ads

తను విదేశాంగ శాఖ ఉన్నతాధికారి (ఐఎఫ్ఎస్) గతంలో, యూఎస్‌లో కూడా రాయబారిగా పనిచేశాడు, టఫ్ కేరక్టర్… పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీది… ముఖ్యమంత్రి రేఖా గుప్తా… ఈ నిఘా ఎందుకంటే..? ‘ప్రొఫెషనల్ ఆందోళనకారుల్ని’… అంటే ఢిల్లీలో ఎవరు ఏ విషయంపై ఆందోళన తలపెట్టినా వచ్చిపడే తుక్‌డే గ్యాంగుల్లో ఎవరెవరు కీలకమో గుర్తించడం… ప్రొఫైల్స్ ప్రిపేర్ చేయడం…

జేఎన్‌యూ పైత్యకారుల దగ్గర నుంచి… అడ్డా ఆందోళన కూలీల దాకా… ఫైల్స్ ప్రిపేర్ చేస్తున్నారు… వేల ఫోటోలు, వీడియోలు… ఎఐ సహకారం, పాత ఆందోళనల ఫోటోలతో కూడిన విశ్లేషణ… ఇదీ జరుగుతున్న పని… సో, మరక మంచిదే, సీజేపీ ధర్నా కూడా మంచికే అన్నమాట…

ఇక్కడ మరొకటీ అంది… ఏళ్ల చరిత్ర, పార్టీ నిర్మాణం ఉన్న సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు, దారితప్పిన ఆప్ ఈ సీజేపీ బ్యానర్ కింద ఆందోళనలకు దిగడం… వాళ్లకు కేంద్రంతో, అధికారపక్షంతో పోరాటం చేతకాక, ఉద్యమాల్ని నిర్మించడానికి ఎవరూ రాక… చివరకు ఈ డిజిటల్ ముఠాల వెనుక చేరి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు…

ఏయే గ్రూపులు ఏయే నినాదాలు ఇస్తున్నాయో (అసలు ధర్మేంద్ర ప్రధాన్ విషయం పక్కకుపోయి, ఎవడికి ఇష్టమైన ఎజెండాతో వాడు ఈ ధర్నాలో పాల్గొన్నాడు) రికార్డు చేసి, ప్రొఫెషనల్ యాజిటేషన్ గ్యాంగుల మీద ఫైల్స్ ప్రిపేర్ చేస్తున్నారు… ఆ నెట్‌వర్క్ మ్యాపింగ్ ఇంట్రస్టింగు…

అంతా బాగుంది కానీ… అసలు సదరు కళంకిత, వైఫల్య మంత్రిని ఎప్పుడో తప్పించాల్సింది మోడీ… చేయలేదు… మళ్లీ ఏదో ‘ఆందోళన’ ఢిల్లీని కల్లోలితం చేయకముందే… నొటోరియస్ కేరక్టర్లను ఇప్పటి నుంచే వేటాడాలి… లేకపోతే మోడీ ఇంటర్నల్ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ చేసినా అదుపులోకి రాదు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Sorry Vijay, You Failed – టీవీకే పార్టీ బ్లాక్ బస్టర్… జననాయకన్ డిజాస్టర్..!
  • రెండు చిత్రాలు – రెండు అపురూప జ్ఞాపకాలు… కాలం రాసిన కథలు…
  • తన్నీరు – పన్నీరు ! ఓ బోఫోర్స్ – ఓ రాఫెల్ – ఓ బ్రహ్మోస్ – ఓ తేజస్ !!
  • N E E T – అసలు ఏమిటి ఈ పరీక్ష ! ఎందుకింత ప్రాధాన్యం !?
  • అవును, పాటలు, సీన్లు, ట్రెయిలర్లు చెప్పేది అదే… ‘టాక్సిక్’ అని..!!
  • ఫాఫం పూజా హెగ్డే ! ‘జననాయకుడి’ కథలో ఎడాపెడా కట్ కట్ !!
  • మిస్టర్ పవన్ కల్యాణ్… కోడి చెరువు కబ్జాపై మాట మీద నిలబడతావా…
  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?
  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions