Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమైన ప్రజావైద్యుడు … నీలాంటోళ్లే కదా నిజమైన దేవుళ్లు స్వామీ…

June 13, 2025 by M S R

.

మన దేశంలో అత్యంత పెద్ద వ్యాపారం తెలుసు కదా… వైద్యం..! ఈరోజు వైద్యంలో ప్రతి అడుగూ వ్యాపారమే… ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలో వైద్యం పడకేసిందో, కార్పొరేట్ ప్రపంచం ఓ మాఫియాలా పడగెత్తింది… అందరికీ తెలిసిందే కదా, ఇంకా దాని గురించి పదే పదే రాయలేం…

కన్సల్టేషన్ దశ నుంచి డిశ్చార్జి వరకు… వ్యాధి నిర్ధారణ నుంచి వేక్సిన్ల వరకు… అంబులెన్సుల నుంచి మెడిసిన్స్ కౌంటర్ వరకు… డబ్బు డబ్బు డబ్బు… ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ గురించి చదవాలి, మనసులోనే మొక్కాలి… డాక్టర్ దేవుడు అంటే ఇదుగో ఇలాంటి ఒకటీ అరా ప్రజావైద్యుల గురించి… అవును, ప్రజావైద్యుడు అనే పదం వర్తించేది వీళ్లకే…

Ads

డాక్టర్ టీఏ కనగరత్నం… (కనకరత్నం)… పేరుకు తగ్గట్టే కనకం, రత్నం… ఐదారు రోజుల క్రితం మరణించాడు… వయస్సు 96… ఊరు తమిళనాడులోని పట్టుకొట్టయి… తిరువరూర్ జిల్లాలో 1929లో పుట్టిన ఆయన బాల్యం మొదట్లో బర్మాలో సాగింది… తరువాత పట్టుకొట్టయిలో వాళ్ల కుటుంబం స్థిరపడింది…

మద్రాస్ మెడికల్ కాలేజీలో డాక్టరీ చదివాక సొంతూళ్లో 1950, 60 లలో వైద్యం ప్రారంభించాడు… తరువాత పెరియ తెరు అనే క్లినిక్… ఇన్ని దశాబ్దాలుగా ఆయన పేదజనం ఆరోగ్యం కోసం చేసిన కృషి నిజంగానే అనుపమానం… మొదట్లో రూపాయీ, అర్ధా తీసుకునేవాడు.., తరువాత చాలా ఏళ్లు 2 రూపాయలు తన ఫీజు…

ఒక్కసారి ఊహించండి… జస్ట్ రెండురూపాయలు, ఇవ్వలేకపోతే అదీ వద్దనేవాడు… ఇదేమిటని అడిగితే నేను చేసేది వైద్యం, వ్యాపారం కాదు అనేవాడు నవ్వుతూ… 2000 తరువాత 10 రూపాయలు తీసుకునవాడు… అవీ మందులు కొని, డబ్బుల్లేని రోగులకు ఉచితంగా ఇవ్వడానికి వినియోగించేవాడు…

ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు… క్లినిక్ పక్కనే తనకు ఓ కాంప్లెక్స్… ఆ అద్దెల్లో ఎక్కువ శాతం మెడిసిన్స్  పంపిణీ కోసమే ఉపయోగించేవాడు… పది రూపాయల డాక్టర్ అంటూ పత్రికల్లో బోలెడు కథనాలు, పురస్కారాలు, గౌరవాలు… దాదాపు 50 ఊళ్ల రోగులు వచ్చేవాళ్లు తన దగ్గరకు… ఇన్ని దశాబ్దాలుగా ఆ స్టెతస్కోప్ పేద రోగుల గుండెలయ వింటూనే ఉంది… దాదాపు ఉచితంగా…

doctor

‘డోన్ట్ వర్రీ, బాగవుతుంది’ ఈ మాటే ఎందరికి స్వస్థతను ఇచ్చిందో, ఎంత భరోసాను నింపిందో… ఆయనకు వైద్యం ఓ ప్రొఫెషన్ కాదు, ఓ మిషన్.., ఓ రచయిత రాసినట్టు…


Dr. Kanagaratinam stood like a lighthouse — offering not just medicines, but hope, dignity, and humanity to those who had nothing. His humble clinic was always open to those in need — no appointments, no bills, no barriers. Just care and kindness.

కరోనా సమయంలో వైద్యం ఎంత విశృంఖలంగా నర్తించిందో చూశాం కదా… తను ఫ్రీ సర్వీస్ చేశాడు… తన కాంప్లెక్స్‌లో అద్దెదారుల 9 లక్షల అద్దెల్ని మాఫీ చేశాడు… అలా తన ప్రతి అడుగూ ‘సర్వీస్’… దాదాపు యాభై వేల పేద మహిళల ప్రసవాలు ఉంటాయేమో తన ఖాతాలో అంటున్నాడు తన మీద పుస్తకం రాసిన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్… ధన్యజీవి.. ఆయనకు కదా మొక్కాల్సింది… వీళ్లు కదా నిజమైన హీరోలు… ఛాంపియన్లు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?
  • నీలి శివుడా… పాహిమాం… ఈ దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడం నుంచి…!!
  • ఆమె ప్రేమ వివాహం… బంధుగణం మొత్తానికి శిరోముండనం, శిక్ష…
  • అదీ ఇజ్రాయిల్ ప్లానింగ్, ఆపరేషన్ అంటే… అణు మొక్కను పీకేసింది…
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి నవ్వులపాలు చేసేశాడా?
  • “ఊహలు గుసగుసలాడే… నా హృదయము ఊగిసలాడే…”
  • ఆత్మలు ఆవహించే కేరక్టర్ కాదు… మంత్రగత్తె అసలే కాదు… మహేంద్రజాలిని…!!
  • అసలే మోహన్ బాబుకి ఆవేశం , మొండితనం , కోపం జాస్తి ..!
  • ఈమె 6 నెలల ముందే చెప్పింది విమానప్రమాదం గురించి… ఇంకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions