Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…

May 5, 2026 by M S R

.

సెక్యులర్ అంటే ముస్లిం సంతుష్టీకరణ… మన పార్టీలకు అర్థమైంది అదే… నిజానికి ఈ ధోరణే బీజేపీకి ఉపయోగపడుతోంది… హిందూ వోటు సంఘటనకు బీజేపీ దీన్ని వాడుకుంటోంది… పక్కా ఉదాహరణ ఏమిటంటే..? నిన్నటి బెంగాల్, అస్సాం ఫలితాలు… కేరళ, తమిళనాడు గురించీ చెప్పుకుందాం, కానీ ముందుగా బెంగాల్…

మమతా బెనర్జీ బంగ్లా అక్రమ వలసదారులకు మద్దతు… వాళ్ల వోట్ల కోసం దేశభద్రతనే పణంగా పెట్టేంత తెంపరి తను… చివరకు ఏం జరిగింది..? గతంలో ఎన్నడూ లేనంతగా హిందూ వోటు కన్సాలిడేట్ అయింది… బీజేపీ ఘన విజయం…

Ads

అస్సాంలో హిమంత విశ్వ శర్మ ఓసారి ఓ మాటన్నాడు… 126 సీట్లకు గాను మేం అసలు 16 స్థానాల్లో పోటీచేయడమే వేస్ట్, డెమోగ్రఫికల్ ఇన్‌బ్యాలెన్స్… మాకు హిందూయేతరులు ఎలాగూ వోట్లు వేయరు అని… అఫ్‌కోర్స్, అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులను నిలిపింది కానీ, తను చెప్పినట్టే ముస్లిం వోట్లు బాగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది…

ఆ పార్టీ తరఫున గెలిచిన 19 మందిలో 11 మందికంటే ఎక్కువ ముస్లిం అభ్యర్థులు… మీరు చదివింది నిజమే… ఇవీ వాళ్ల పేర్లు, స్థానాలు…


తన్జిల్ హుస్సేన్ (Tanzil Hussain) సామగురి (Samaguri)
బేబీ బేగం (Baby Begum) ధుబ్రి (Dhubri)
అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా (Aftab Uddin Mollah) జలేశ్వర్ (Jaleshwar)
వాజెద్ అలీ చౌదరి (Wazed Ali Choudhury) బిర్సింగ్ జారువా (Birsing Jarua)
అబ్దుల్ కలాం రషీద్ ఆలం (Abul Kalam Rasheed Alam) గోల్పారా ఈస్ట్ (Goalpara East)
జకీర్ హుస్సేన్ సిక్దర్ (Jakir Hussain Sikdar) పకాబెట్‌బారి (Pakabetbari)
రెకిబుద్దీన్ అహ్మద్ (Rekibuddin Ahmed) చమారియా (Chamaria)
అబ్దుస్ సోబహాన్ అలీ సర్కార్ (Abdus Sobahan Ali Sarkar) గౌరీపూర్ (Gauripur)
అబ్దుర్ రహీమ్ అహ్మద్ (Abdur Rahim Ahmed) చెంగా (Chenga)
నూరుల్ హుదా (Nurul Huda) రూపాయిహాట్ (Rupahihat)
మొహిబుర్ రెహమాన్ (Mohibur Rohman) మంకాచార్ (Mankachar)

ఫలితాల అనంతరం కూడా హిమంత అదే అన్నాడు… కాంగ్రెస్ కేవలం ముస్లిం మెజారిటీ ఉన్న స్థానాల్లోనే గెలిచింది, హిందూ వోటర్లు మావైపు నిలబడ్డారు అని..!

కేరళలోనూ కాంగ్రెస్ కూటమి ధోరణి అదే… మొత్తం 140 సీట్లకు గాను యూడీఎఫ్ కూటమి గెలిచింది 102 సీట్లు… అందులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 22 సీట్లు గెలుచుకుంది… వాళ్లంతా ముస్లింలే… తమిళనాడులో డీఎంకే కూటమి (సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్)లో కూడా ఐయూఎంఎల్ ప్రధాన భాగస్వామే… గెలిచిన ఇద్దరూ ముస్లింలే…

బెంగాల్‌లో 47 మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది మమతా బెనర్జీ… తన పార్టీ 81 సీట్లతో కుదేలైపోయింది గానీ, ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఇచ్చిన 47 మందిలో ఏకంగా 30 మంది గెలిచారు… ఈసారి కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ (AISF), అజ్మల్ పార్టీలు కూడా ముస్లిం అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ప్రాంతాల్లో టీఎంసీ విజయశాతం తగ్గింది కానీ లేకపోతే 47 సీట్లూ గెలిచేవాళ్లు… సో, సెక్యులర్ మీన్స్ నాన్-హిందూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…
  • ఆ మమతా దిగిపోయింది… ఇక మిగిలింది ఒకేఒక లేడీ సీఎం…
  • మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…
  • మమత పతనం రెండేళ్ల క్రితమే చెప్పింది..! మరో రెండు కీలకం…!
  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…
  • నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…
  • ఆ ‘కార్తీక దీపం’ ఆర్పాలని చూసిన స్టాలిన్… తనే ఆరిపోయాడు…
  • కేసీయార్‌పై మరో పిడుగు..! కరెంటు అక్రమాలపైనా సీబీఐ ఎందుకంటే..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions