.
ఆమె పేరు రాజలక్ష్మి కర్… వయస్సు ప్రస్తుతం 54 సంవత్సరాలు… ఓసారి 13 ఏళ్ల వెనక్కి వెళ్దాం… అది భువనేశ్వర్… ఆమె ఎటో వెళ్తోంది…
ఓచోట శిశువు ఏడుపు వినిపిస్తోంది… అటూఇటూ చూసింది… కాస్త దూరంలో రోడ్డు పక్కన పడేయబడిన ఓ శిశువు… అక్కడ ఎవరూ లేరు… ఎవరో ఆమెను కన్నతల్లి వదిలించుకున్న బిడ్డ అని అర్థమైంది…
Ads
తనకూ పిల్లల్లేరు… భర్తను అడిగింది… మనం పెంచుకుందాం అన్నాడు ఆయన… ఆడ పిల్ల… గుండెలకు హత్తకుంది… తనకు దేవుడిచ్చిన బిడ్డే అనుకుంది… ఏడాదికే భర్త మరణించాడు… కారణాలు ఏవైనా గానీ…
తరువాత ఒంటరిగానే ఆ పిల్లను పెంచింది… కేంద్రీయ విద్యాలయంలో చదివించడానికి పర్లాకిమిడికి వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది… సీన్ కట్ చేస్తే…
ఆ పిల్ల టీనేజ్ కూడా దాటలేదు… ఇప్పుడు జస్ట్ ఎనిమిదో తరగతి… ఆలయ పూజారి గణేష్ రథ్, వాడి దోస్త్ దినేష్ సాహూ అని తనకన్నా పెద్దవాళ్లయిన అబ్బాయిలతో అక్రమ సంబంధాలు… పెంపుడు తల్లికి తెలియకుండా బంగారం తీసుకుని వాళ్లకిస్తే కుదువ పెట్టి ఆ డబ్బుతో జల్సాలు…
ఇదంతా రాజలక్ష్మి గ్రహించింది… షాక్‌కు గురైంది… మందలించింది… చదువు మాన్పించి మళ్లీ భువనేశ్వర్ వెళ్లిపోవాలని సంకల్పించింది… కానీ ఆ అమ్మాయి ప్రియుడు రథ్ ఆ తల్లిని చంపేద్దామన్నాడు… తమ బంధానికి అడ్డు ఉండదు ప్లస్ ఆమె ఆస్తి అంతా స్వేచ్ఛగా అనుభవించవచ్చు…
ఈ పిచ్చిది అంగీకరించింది… ఏప్రిల్ 29… ఆ వయస్సు, ఆ రుచి ఆమెను అలా ఒప్పించాయి… ఓరోజు రాత్రి తల్లికి నిద్రమాత్రలు ఇచ్చారు… ఆమె పడుకోగానే దిండ్లతో మొహం మీద గట్టిగా అదిమి ఊపిరాడకెుండా చేశారు… ఏమీ తెలియనట్టు హాస్పిటల్ తీసుకెళ్లారు, అప్పటికే ఆమె మరణించిందని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు, సహజమే కదా…
ఇంటికి శవాన్ని తీసుకొచ్చి బంధువులకు ఫోన్లు చేసింది… రాజలక్ష్మి ఆల్రెడీ గుండె సంబంధ వ్యాధులున్నాయి కదా, అందరూ నమ్మారు… దహనం చేశారు… ఇక్కడికి కథ అయిపోవాలి, కానీ అయిపోలేదు… కట్ చేస్తే…
రాజలక్ష్మికి ఓ సోదరుడున్నాడు, శివప్రసాద్ మిశ్రా… ఆమె మరణించాక రెండు వారాలకు ఎందుకో ఆ అమ్మాయి ఫోన్‌ను చూశాడు… ఇన్‌స్టాలో తన ప్రియులతో జరిపిన సంభాషణలు, హత్యకు కుట్ర పన్నిన తీరు అంతా చదివాడు… చక్కగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు…
పోలీసులు కాస్త ‘మంచి మర్యాద’ చేసేసరికి నిందితులు మొత్తం కథ చెప్పేశారు… వాళ్లను అరెస్టు చేశారు, జైలుకు తరలించారు… ఇదీ క్రైమ్ కహానీ… ఆ పిల్ల వయస్సెంత..? అప్పుడే ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధాలు, రోడ్డు పక్కన పడిఉన్న తనను పెంచి పెద్ద చేస్తే ఆ పిల్ల తీర్చుకున్న రుణం ఇదీ… అందుకెే చెప్పేది… ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది…
తెలియకుండా, తమ కర్మ ఫలాన్ని బట్టి… అనర్హులను నెత్తిన పెట్టుకుని, ప్రాణంగా ప్రేమించినా సరే.,., ఇదుగో ఇలాంటి సర్పాలు తమ జీవితాల్నే కాదు, తమను ప్రేమించిన జీవితాల్ని కూడా కాల్చేస్తారు… ఈ కథలో నీతి అదే…
Share this Article