ఒకే కథ… కానీ వేర్వేరు కథనతీరులు… అన్నట్టుగా… థర్టీన్ లైవ్స్ సినిమా మీద ఆల్‌రెడీ మనం ఓ రివ్యూ రాసుకున్నాం… అదే సినిమా… ఈ రివ్యూ కూడా చదవండి… ఈ రివ్యూ సాగిన తీరు వేరు… నిజానికి అనేకానేక సైట్లలో, మీడియాలో ఒకే తరహా మూస ఫార్మాట్‌లో రివ్యూలు వస్తుంటయ్… అసలు రివ్యూలకు టెంప్లేట్ ఏమిటి..? రివ్యూయర్ కూడా ఓ సగటు ప్రేక్షకుడిలా చూసి, ఫీలై రాయాలి, అప్పుడే అందులో లైఫ్… సరే, ఆ చర్చలోకి వెళ్లకుండా మనం ఈ రివ్యూలోకి వెళ్దాం… మిత్రుడు హరి క్రిష్ణ ఎం. బి….. ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న రివ్యూ ఇది…
Thirteen Lives.. (పదమూడు ప్రాణాలు)…. “మనవాళ్ళు బాగుండాలి అందుకోసం మనము ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవడం” – చాలా మంది చెయ్యగలరు.. “మనకేమీ సంబంధం లేని మనుషులనూ, మిగతా జీవరాశిని కూడా ఒకే దృష్టి తో చూసి అందరూ బాగుండాలి అనుకుని, వాటి కోసం దేనికీ వెనుకాడకుండా ఏదైనా చెయ్యడం” అనేది చాలా కష్టం..
Altruism అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది… మొన్న ఒక podcast విన్నాను.. అసలు సంబంధం లేని వ్యక్తుల కోసం అవయవదానం చేసే గ్రూప్ ఒకటి USA లో. ఒకాయన ఇప్పటికే kidney దానం చేసాడు ఎవరికో, వాళ్ళావిడా కిడ్నీ దానం చేసారు. ఇప్పుడు ఆయన liver కొంచెం దానం చెయ్యడానికి ఇద్దరూ argue చేసుకుంటున్నారు… అలాంటివి విన్నప్పుడు ఒక్క క్షణం అనిపిస్తుంది “మనమూ బతికేస్తున్నాము!” అని… మళ్ళీ మన స్వార్థం గుర్తొచ్చేస్తుంది…
Ads
—
ఇలాంటిదే Thirteen Lives లో కనపడుతుంది.. 2018 లో థాయిలాండ్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారం గా తీసిన సినిమా..
ముక్కూ మొహం తెలియని పదమూడు చిన్న పిల్లల ప్రాణాలకోసం తమ ప్రాణాలు లెక్క చెయ్యకుండా తెగించి వాళ్ళను కాపాడడానికి కొన్ని పదుల, వందల మంది తమ తమ కు తోచింది చెయ్యడం..
—
ఫుట్ బాల్ ప్రాక్టీస్ అయ్యాక కొంతమంది చిన్నపిల్లలు సరదాగా ఏదో గుహ లో కి వెళ్లాలని అనుకుంటారు… పిల్లలే వెళ్తున్నారు అని వాళ్లకు తోడు గా కోచ్ కూడా వెళ్తాడు..
తీరా వీళ్ళు లోపలి వెళ్ళాక వర్షాలు మొదలై, అంతకుముందే కురిసిన వాన కు తోడై, కొండమీది నుంచి గుహ లో కి నీళ్లు ఇంకి గుహ మునిపోతుంది.. పిల్లలు లోపలే ఇరుక్కుపోతారు.. చాలా ఇరుకు గుహ లో దాదాపు 2500 మీటర్లు లోపల వాళ్ళు చిక్కుకుని ఉంటారు..
ఆ గుహ గురించి తెలిసిన ఒక పెద్దాయన వచ్చి పోలీసులకు, మిలిటరీ కి help offer చేస్తాడు..
ఆ ఏరియా గవర్నర్ కి అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా బలవంతం గా ఈ పిల్లల్ని కాపాడే మిషన్ కి incharge గా ఉంటాడు… ఏదైనా తేడా అయితే ఇతన్ని dismiss చెయ్యడానికి రంగం సిద్ధం..
గంటల వ్యవధి లో అక్కడ ఒక యుద్ధ వాతావరణం.. ఎడతెరపి లేని వాన.. గుహ లో కి ఆగకుండా ఇంకే వరద… నేవీ లో పని చేసేవాళ్లకు కూడా అక్కడ ఏమీ అర్థం కాదు.. సముద్రం అంటే అలవాటు.. ఇలా గుహల్లో కొత్త..
అందరూ చనిపోయే ఉంటారు, వాళ్ళ శరీరాలు బయటకు తీసుకువస్తే చాలు అనే అనుకుంటూ ఉంటారు అందరూ.. వాళ్ళ కుటుంబాలూ అదే అడుగుతారు కొన్ని రోజులయ్యాక.
నేవీ వాళ్లకు హెల్ప్ చేసే ఆయనే rescue diver ని పరిచయం చేస్తాడు… ఆయన ఇంకో ఆయన్ని కాంటాక్ట్ చెయ్యడం, వీళ్ళిద్దరూ వాళ్ళ దేశాల నుంచి గుహ దగ్గరికి వస్తారు…
అంతకుముందు మిలిటరీ వాళ్ళు కొంచెం దూరం వెళ్లి అంతకంటే ముందుకు పోవడం వీళ్ళు కాక వెనక్కి వచ్చేస్తారు.. ఈ ఇద్దరూ 2500 మీటర్లు వెళ్లి పిల్లల్ని కలుస్తారు… పిల్లలు బతికే ఉన్నారు అని అప్పుడే తెలుస్తుంది.. అందరూ హ్యాపీ..
కానీ ఆ divers లో ఒకాయన చాలా అసహనం గా ఉంటాడు… ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తూ ఉంటాడు.. కారణం ” వాళ్ళు బతికి అయితే ఉన్నారు.. కానీ వాళ్ళను ప్రాణాలతో బయటకు తీసుకురావడం దాదాపు అసాధ్యం”. ఆ నిజం అందరికీ చెప్పలేడు. చెప్పకుండా ఉండలేడు. ఆ బాధ వర్ణనాతీతం..
అంతసేపు ఆ కష్టమైన గుహ లో dive చెయ్యడం professionals కే కష్టం.. అలాంటిది ఆ పిల్లలు ఎలా చెయ్యగలరు?
panic అయ్యి, మాస్క్ తీసేసినా, భయపడి shock లో కి వెళ్లినా, ఎక్కడైనా దుడుకుగా వెళ్లి రాళ్లమధ్య లో ఇరుక్కుపోయినా!
గుహ లో రెండున్నర కిలోమీటర్లు నడవడమే కష్టం.. అలాంటిది పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని dive చెయ్యడం అంటే..
–
ఈ ఇద్దరికీ ఆ నేవీ వాళ్లకూ ego clash – గవర్నర్ రాజకీయాలు చాలా సహజం గా ఉంటాయి. కొంతమంది పని చెయ్యరు, చేసేవాళ్ళనీ చేయనివ్వరు – మనమూ చూస్తూ ఉంటాము రోజూ…
కానీ ఇక్కడ అందరికీ ఆ పిల్లల్ని కాపాడాలి అనే ఉంటుంది లోపల మాత్రం. ఆ సన్నివేశాలు చాలా బాగా తీశారు..
–
వీళ్లకు సమాంతరం గా కొండల్లోంచి గుహ లో కి నీళ్లు వెళ్లకుండా holes ని మూసేయడం, flood water ని ఇంకో వైపుకి బదలాయించడం అనే ప్రక్రియ ను చేస్తూ ఉంటాడు ఇంకో ఇంజనీర్.. ఆయన కు help గా ఇంకో పెద్దాయన… local గా ఆ కొండల గురించి తెలిసిన ఇంకో పెద్దాయన..
అమెరికా నుంచి Bangkok కి సెలవుల మీద వచ్చి ఈ news చూసి, తనకు తాను గా ఏదో ఉపాయం అలోచించి, వర్క్ చేస్తూ ఉంటాడు. మెల్ల మెల్లగా అతనికి సహాయంగా చాలా మంది వస్తారు.. నీళ్లు divert చేస్తే రైతుల పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.. దానికి ఆ రైతులు ఒప్పుకుంటారు కూడా పాపం..
కారణం : “పిల్లల్ని కాపాడాలి”..
–
divers లో ఒకాయన కు ఇంకో ఉపాయం వస్తుంది.. పిల్లలకు మత్తు మందు ఇచ్చి ఒక్కొక్కరినీ పార్సెల్/bodybag లా చేసి తీసుకువస్తే ఎలా అని… వాళ్లకు ఒక doctor diver గుర్తుకువస్తారు.. ఆయనకు చెప్తే – ఆయన కుదరదు అంటే కుదరదు అంటాడు.. కారణం.. ఆ 2500 మీటర్లు వాళ్ళని బయటకు తీసుకురావాలంటే పట్టే సమయం – ఆరుగంటలకు పైగా… అంతసేపు వాళ్ళను మత్తు గా ఉంచడం చాలా కష్టం..
చాలా మధనం జరిగాక మొత్తానికి అదే ప్లాన్ కి అందరూ ఓకే చెప్తారు.. మీడియా ని దూరం గా పంపిస్తారు గుహ నుంచి.. governor ఆమోదం కావాలి… అంతసేపూ రాజయకీయాలు చేసిన గవర్నర్ అప్పుడు తన నిజమైన నాయకత్వ లక్షణాలు చూపిస్తాడు..
– “ఈ operation success అయితే మంచిది.. ఒకవేళ fail అయితే దానికి పూర్తి బాధ్యత నాదే” అంటాడు.. అలా అనగలిగే నాయకులే గొప్పవాళ్ళు. చాలా తక్కువ ఉంటారు.
ఆయన అలా అన్నప్పుడు కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతాయి.. “ఒప్పు నాది- తప్పు నీది” మార్క్ నాయకులే ఎక్కువ ప్రపంచం లో. వాళ్ళను చూసి చూసి మెదడు మొద్దుబారిపోయింది…
–
ఇంకొంతమంది divers ని వేరే వేరే దేశాల నుంచి తీసుకుని వస్తారు… అందరూ కలిసి ఆ పదమూడు మందిని బయటకు తెస్తారు…
కథ సుఖాంతం అయినా, కథనం మాత్రం ఒళ్ళుని (మెదడు ని) గగుర్పొడుస్తుంది..
ఆ పిల్లలు బయటకు వచ్చాక మూడు రోజుల్లో ఇంకా ఎక్కువ వరద వచ్చి ఆ గుహ ఎనిమిది నెలలు నీళ్లలో నే ఉందట తర్వాత… వాళ్లకు సమాధి అయ్యి ఉండేవారు అక్కడే ఆ time bound saving అవ్వకుండా ఉంటే…
–
మొత్తం operation లో 5000 మంది దాకా పాల్గొన్నారు… కొన్ని వందల ఎకరాల పంట పోయింది. ఇద్దరు నేవీ వాళ్ళు కూడా చనిపోయారు ఈ ప్రక్రియ లో.. కానీ ఆ పిల్ల ప్రాణాలు కాపాడగలిగారు..
17 దేశాల ప్రాతినిధ్యం ఉంది ఈ operation లో.. అందరూ ఏ స్వార్థం లేకుండా పిల్లలని కాపాడాలి అని పనిచేసిన వారే…
—
1. మీరు వెళ్ళండి నేను రాను అని కోచ్ అన్నా!
2. నాకెందుకు వర్షం లో బజ్జీలు తినకుండా అని ఆ పెద్దాయన అనుకున్నా!
3. సెలవుల్లో ఇంటికి వచ్చాను.. హాయిగా అమెరికా కి పోకుండా ఈ కొండల్లో నేనెందుకు అని ఇంజనీర్ అనుకున్నా!
4. మాకెందుకు ఎవరో పిల్లలు అని ఆ divers, వాళ్ళ friends అనుకుని ఉన్నా!
5. మత్తు మందు ఇవ్వడానికి ఆ doctor ఒప్పుకోకపోయినా!
6. మా పొలాలు మునిగిపోతే ఎలా అని రైతులు అడ్డంపడినా!
7.. ఆ operation కి బాధ్యత మొత్తం ఆ governor తీసుకుని వాళ్లకు ధైర్యం చెప్పకున్నా!
ఏ ఒక్కటి జరక్కపోయినా ఫలితం వేరుగా ఉండేది..
choice matters – వీళ్లంతా ఏదో ఒక ఛాయస్ తీసుకున్నారు.. దానికి అనుగుణంగా పని చేసారు.. ఎవరూ అదృష్టాన్ని నమ్ముకోలేదు.. fate అంటూ వదిలెయ్యలేదు..
–
మన చుట్టూ జరిగే చాలా విషయాల వెనుక పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉంటాయి.. కేవలం మనకు తెలియదు అంతే… ఎన్నో సంఘటనల యాదృచ్చిక కలయికే జీవితం..
–
కొంచెం పెద్ద సినిమా నే.. కానీ చాలా gripping గా ఉంటుంది.. ఇంకొంచెం డ్రామా పండించి ఉండొచ్చు.. కానీ to the point తీశారు…
చిన్నపిల్ల ల కాళ్ళ సందులో ఖాళీ water bottle పెడితే కాళ్ళు తేలుతూ Body Bag ని లాక్కు పోవడం easy గా ఉంటుంది అనే చిన్న point కూడా బాగా చూపించారు..
కొండ మీది నుంచి వచ్చే నీళ్లు divert చెయ్యడానికి పైపులు అయిపోతే, bamboo sticks ని cut చేసి pipes గా వాడతారు.. ఇవన్నీ వాళ్ళ కు spot లో వచ్చే ఐడియాస్.. వాటి మీద group discussions ఉండవు… ఇలాంటి life skills నేర్చుకోవాలి పెద్దలూ, పిల్లలూ…
crisis లో నే బుర్ర sharp గా పని చేస్తుంది.. చెయ్యాలి.. అది training తో నే సాధ్యం… panic అయితే ఏమీ కాదు..
–
చాలా sensitive సినిమా… చాలా mind-wrenching కూడా… మొదలుపెట్టినప్పుడు మా పిల్లలకు అసలు ఇష్టం లేదు… కానీ మొదలయ్యాక ఆపకుండా చూసారు… “మనమే గుహ లో ఉన్నట్టు ఉంది కదా” అన్నాడు మా వాడైతే. అది చాలు.
–
నేను ఏ సినిమా అయినా అలానే చూస్తాను… ఆ సినిమా లో విషయం ఉండాలి అంతే..
సినిమా అనేది కల్పితం అయినా అది కల్పితం అనే ఊహ దాన్ని చూసినంతసేపూ రాకుండా చెయ్యగలిగితే చాలు..
—
తప్పక చూడండి.. మంచి sound system ఉంటే నే ఇంట్లో చూడండి… అది చాలా ముఖ్యం సినిమాకు.. సరైన సౌండ్ లేకుండా దృశ్యానికి విలువ లేదు..
Share this Article