Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దురంధరుడి అవార్డుల వేట షురూ… ‘బెస్ట్ ఫిలిమ్’ మాత్రం కాదట..!

April 7, 2026 by M S R

.

ఊహించిందే… దురంధర్ వసూళ్లలో రికార్డు వేట మాత్రమే కాదు… అవార్డుల వేట కూడా స్టార్టయింది… 2025 స్క్రీన్ అవార్డుల జాబితా గమనిస్తే ఏకంగా 14 అవార్డులతో దాదాపు క్లీన్ స్వీప్… కానీ బెస్ట్ ఫిలిమ్ అవార్డు మాత్రం దురంధర్ సినిమాకు కాదు…! ఆశ్చర్యంగా ఉందా..? ఈసారి పలు సినిమాలు అవార్డులకు బలంగా పోటీపడ్డాయి… పదండి వివరాల్లోకి వెళ్దాం…

ఈసారి విశేషం ప్రధానంగా దురంధర్ దర్శకుడు ఆదిత్య థర్, ఆయన భార్య యామీ గౌతమ్ ఇద్దరూ అవార్డులు కొట్టేయడం..! ఇటు దురంధర్, అటు హక్ అవార్డులను కొల్లగొట్టాయి… ఈ సంవత్సరం ఇద్దరికీ బాగా గుర్తుండిపోతుంది…

Ads



ఈ ఏడాది స్క్రీన్ అవార్డుల వేదికపై ‘దురంధర్’ (ఫస్ట్ పార్ట్) సినిమా అవార్డుల పంట పండించింది… కేవలం కమర్షియల్ సక్సెస్‌ మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా ఈ చిత్రానికే దక్కాయి…

దురంధర్… అవార్డుల వేటలో నంబర్ వన్!

రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమా ఈసారి అవార్డుల వేడుకను పూర్తిగా తన వైపు తిప్పుకుంది… ఈ చిత్రం సాధించిన ప్రధాన అవార్డులు…

  • ‘దురంధర్’ కేవలం కొన్ని విభాగాలకే పరిమితం కాకుండా, సాంకేతిక విభాగాల్లో (Technical categories) క్లీన్ స్వీప్ చేస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది…

    14 అవార్డుల వివరాలు క్లుప్తంగా…

    1. ఉత్తమ నటుడు (Male): రణవీర్ సింగ్

    2. ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్

    3. ఉత్తమ సహాయ నటుడు (Male): అక్షయ్ ఖన్నా

    4. ఉత్తమ యాక్షన్

    5. ఉత్తమ నేపథ్య సంగీతం (Background Score)

    6. ఉత్తమ సినిమాటోగ్రఫీ

    7. ఉత్తమ ఎడిటింగ్

    8. ఉత్తమ సంభాషణలు (Dialogues)

    9. ఉత్తమ సౌండ్ డిజైన్

    10. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

    11. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్

    12. ఉత్తమ హెయిర్‌స్టైలింగ్ & మేకప్

    13. ఉత్తమ కొరియోగ్రఫీ (శరారత్ పాట)

    14. ఉత్తమ కాస్ట్యూమ్స్ (‘ఛావా’ తో సంయుక్త విజేత)

‘హక్’తో యామీ గౌతమ్ మెరుపులు…

ఒకవైపు భర్త ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా నిలిస్తే, మరోవైపు యామీ గౌతమ్ ధర్ తన అద్భుత నటనతో ‘హక్’ (Haq) చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది… ఈ జంట బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కపుల్‌గా మరోసారి నిరూపించుకుంది… అంతేకాకుండా ‘హక్’ సినిమా బెస్ట్ ఫిల్మ్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ అవార్డును కూడా గెలుచుకోవడం గమనార్హం…

హోమ్‌బౌండ్.. ‘బెస్ట్ ఫిల్మ్’గా విజేత…

అవార్డుల రేసులో ‘దురంధర్’కు గట్టి పోటీ ఇచ్చిన చిత్రం ‘హోమ్‌బౌండ్’... కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం (Best Film) కేటగిరీలో విజేతగా నిలిచింది… దీంతో పాటు బెస్ట్ స్క్రీన్ ప్లే, శాలినీ వత్సకు ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి…

సయ్యారా, ఇతర చిత్రాల హవా:

  • సయ్యారా (Saiyaara)..: ఈ సినిమా సంగీత విభాగంలో సత్తా చాటింది… బెస్ట్ సాంగ్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్స్ (మేల్ & ఫిమేల్) అవార్డులు ఈ చిత్రానికే దక్కాయి… అలాగే కొత్త నటులు అనీత్ పడ్డా, అహాన్ పాండే బ్రేక్‌త్రూ అవార్డులను అందుకున్నారు…

  • ఛావా (Chhaava)…: దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డును గెలుచుకుంది… (నిజానికి ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనకు ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని అనుకున్నారు అందరూ)…

  • ధడక్ 2…: షాజియా ఇక్బాల్ ‘బ్రేక్‌త్రూ డెబ్యూ డైరెక్టర్’గా అవార్డు అందుకున్నారు…


ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రధానంగా… ఈ అవార్డులు దురంధర్ మొదటి పార్ట్‌కు… 2026 చిత్రాల అవార్డులకు వచ్చేసరికి దురంధర్-2 ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలి…


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధరుడి అవార్డుల వేట షురూ… ‘బెస్ట్ ఫిలిమ్’ మాత్రం కాదట..!
  • నకిలీ చమురు కంచికి చేరలేదు… రామర్ పిళ్లై కథకు ముగింపు లేదు…
  • జామురాతిరి జాబిలమ్మా… అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…
  • పింక్ దొర దాస్యం వదిలేస్తే… తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు…
  • చమురు మంటల నేపథ్యంలో… నాటి రామర్ పిళ్లై బాపతు ఓ జ్ఞాపకం…
  • యోగీ, హిమంత ‘బుల్‌డోజర్’ బాటలో… బెంగాలీ సువేందు అధికారి…
  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions