Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా పట్టుకోలేకపోయిన పదిహేనేళ్ల రహస్య ప్రణయ ప్రయాణం..!

November 24, 2024 by M S R

.

ఎవరు అతను..? ఆంటోనీ తట్టిల్..! ఏం చేస్తుంటాడు..? అసలు వాళ్ల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..? ఈ ప్రశ్నలకు గూగుల్‌లో సెర్చింగ్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది…

నటి కీర్తి సురేష్ కాబోయే భర్త అతను… ఆమె తండ్రి సురేష్‌కుమార్ అధికారికంగా ‘నా బిడ్డ పెళ్లి తనతో జరుగుతుంది, గోవాలో డెస్టినేషన్ మ్యారేజి… డేట్ ఫిక్స్ కాలేదు, ట్రివేండ్రంలో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం’ అని వెల్లడించాడు…

Ads

దాంతో ఎవరీ ఆంటోనీ అనే సెర్చింగ్… మహానటి, దసరా సినిమాలతో తెలుగు వాళ్ల ఆదరణను బాగా పొందింది… స్వతహాగా మలయాళీ.., కేరళ ఫిలిమ్ ఇండస్ట్రీలో నిర్మాత తన తండ్రి, తల్లి నటి మేనక… అందుకని మలయాళీలు కూడా అభిమానిస్తారు… తమిళ  సినిమాలు ఎక్కువ సంఖ్యలో చేసింది ప్లస్ మహానటి సినిమాతో తమిళుల అభిమానాన్ని కూడా సాధించింది…

ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో హిందీలోకి కూడా అడుగుపెడుతోంది… దాంతో ఇంత సెర్చింగు తన కాబోయే భర్త ఎవరు అని..!

keerti suresh

నిజానికి ఇండస్ట్రీలో ఎవరెవరితోనో జతకలిపి ఏవేవో గాసిప్స్ రాసేస్తుంటారు కదా… కీర్తి సురేష్ ఎప్పట్నుంచో చెబుతూనే ఉంటుంది… తను సింగిల్ కాదు అని… అంటే తనకు ఓ జోడీ ఉన్నాడని..! ఐనాసరే ఆంటోనీ గురించి ఫిలిమ్ మీడియా పెద్దగా ఫోకస్‌లోకి తీసుకురాలేకపోయింది… ఆ ఇద్దరిదీ ఒక్క ఫోటో కూడా పబ్లిష్ చేయలేకపోయింది… అదీ విశేషం…

ఆంటోనీ లోప్రొఫైల్ మనిషి… కీర్తి సురేష్‌తో కలిసి పబ్లిక్‌లో, ఫంక్షన్లకు తిరగడాలు, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టడాలు వంటివేమీ లేవు… పైగా తను ఇండస్ట్రీ మనిషి కూడా కాదు… అందుకేనేమో మీడియా వాళ్ల బంధాన్ని ఫోకస్ చేయలేకపోయింది… వాళ్ల బంధం ఇప్పటిది కాదు… 15 ఏళ్లుగా ఉంది… రెండు కుటుంబాల్లోనూ తెలుసు…

12వ తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరి నడుమ ప్రేమ మొదలై… ఇన్నేళ్లయినా, ఇద్దరూ వేర్వేరు వృత్తుల్లో రాణిస్తున్నా… ఆ ప్రేమ అలాగే పెరిగిపోయింది, ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది… టీన్స్‌లో మొదలైన ప్రేమ 15 ఏళ్లపాటు అలాగే ఉండటం ఒక విశేషమే…

dasara

తను ఓ ఇంజినీర్… ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసి, కొచ్చికి వచ్చి విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ అనే కంపెనీ పెట్టాడు… (ఫోటోలో కనిపిస్తున్న పేరు అదే…) హోటళ్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు…

నిజానికి మంచి ఊపులో కెరీర్ ఉన్నప్పుడు సినిమా తారలు పెళ్లిళ్లను వాయిదా వేస్తుంటారు… అవకాశాలు తగ్గిపోతాయని..! కానీ అది గతం… ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా మంచి పాత్రల్ని, కమర్షియల్ పాత్రల్ని కూడా చేజిక్కించుకుని రాణిస్తున్నారు…

కీర్తిసురేష్

ఆంటోనీతో లవ్వులో ఉండి కూడా… కీర్తి సురేష్ పలు రొమాంటిక్ సినిమాలు కూడా చేసింది… ఆమె ప్రొఫెషనల్… (మహానటిలో బాగా చేసింది, జాతీయ అవార్డు కూడా పొందింది… కానీ దసరాలో ఆమె ఇంకాస్త బాగా చేసినట్టు అనిపించింది… అనేకచోట్ల కనీసం మొహంపై పౌడర్ కూడా లేకుండా డీగ్లామరైజ్డ్ రోల్‌ చేసింది… తన పాత్ర కూడా బాగుంది…)

రీసెంటుగా వరుణ్ ధావన్‌తో బేబీ జాన్ సినిమా కోసం లిప్ లాకులు, బెడ్‌రూం సీన్లలో రెచ్చిపోయిందని వార్తలు ఈమధ్య బాగా కనిపిస్తున్నాయి… ఇది తమిళ సినిమా తెరి హిందీ రీమేక్… మీడియా కూడా వరుణ్ ధావన్‌తో అఫయిర్ ముడిపెట్టి ఏదేదో రాసింది… సీన్ కట్ చేస్తే… తన ఒరిజినల్ ప్రియుడు మీడియా తెర మీదకు వచ్చేశాడు… ఆల్ ది బెస్ట్ కీర్తీ..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions