.
ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ ఏం చెప్పింది..? ‘‘‘ఇండియన్ ఫైటర్లను కూల్చేశాం, మేమే గెలిచాం, ఇండియా వెనక్కి తగ్గింది…’’
ఆ తరువాత కూడా అమెరికా వెళ్లి, మేం కూలిపోయే స్థితి వస్తే సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం, ఇండియా మీద అణుబాంబులు వేస్తాం, సింధు డ్యామ్ కడితే క్షిపణులతో పేల్చేస్తాం, అంబానీ జామ్‌నగర్ రిఫైనరీ కూల్చేస్తాం… వంటి చాలామాటలు మాట్లాడుతోంది పాకిస్థాన్…
Ads
నిజానికి ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది పాకిస్థానీ సైనికులు హతమారిపోయారట… ఉగ్రస్థావరాల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యకు ఇది అదనమో కాదో తెలియదు… ఫ్రీప్రెస్ జర్నల్ కథనం ప్రకారం… పాకిస్థానీ మీడియా హౌజ్ ఒకటి ఇది రిపోర్ట్ చేసింది… తరువాత ఏమైందో గానీ డిలిట్ చేసింది… (సమా టీవీ..?)
కానీ ఆ వార్త స్క్రీన్ షాట్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై వైరల్ అయిపోతున్నయ్… ఇప్పుడు తొలగించబడిన వార్తా కథనంలో పాకిస్తాన్ అధ్యక్షుడు “ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ సమయంలో కనబరిచిన ధైర్యం, అత్యున్నత త్యాగం” పేరిట ప్రదానం చేసిన శౌర్య పురస్కారాల జాబితా కూడా ఉంది… ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ అనేది పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన దాడులకు ప్రతీకార చర్యకు కోడ్ నేమ్…
అందరి పేర్ల తరువాత షహీద్ అని, ఆర్మీ అని కూడా రాశారు… (అమర జవాన్)… ఈ ‘ఇంతియాజీ సనద్’ జాబితాలో 146 పేర్లున్నయ్… మరో 45 మంది ‘తమ్‌గా ఇ బసాలత్’ జాబితాలో ఉన్నారు… మరో నలుగురు తెలియదు… సరే, సహజంగానే దీనిపై పాకిస్థాన్ అధికారికంగా ఏమీ స్పందించడం లేదు… స్పందించదు కూడా…
1999 కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ తన సైనికులు కొందరి మృతదేహాలను వదిలిపెట్టింది… తరువాత, పొరుగు దేశం కొన్ని మృతదేహాలను అంగీకరించింది… ఈ 155 మంది అమర జవాన్ల విషయంపై ఇండియా కూడా ఏమీ స్పందించలేదు… ఎర్రకోట ప్రసంగంలోనే ఓ మాటంటే బాగుండేది అంటారా..? ఏమో..! డిలిట్ చేయబడిన వార్తల ఆధారంగా కామెంట్స్ చేయలేం కదా..!!
ఇదీ చదవండి…
Share this Article