.
కపూర్ వంశం.. రామాయణ బంధం: 92 ఏళ్ల తర్వాత రణబీర్ రూపంలో పునరావృతమవుతున్న చరిత్ర! ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచం మొత్తం ఒకే పేరుతో మారుమోగిపోతోంది… అదే ‘రామాయణం’… నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు… అయితే, ఈ సినిమా వెనుక కేవలం భారీ బడ్జెట్ లేదా గ్రాఫిక్స్ మాత్రమే లేవు, ఒక అద్భుతమైన చారిత్రక వారసత్వం కూడా ఉంది…
రణబీర్ కపూర్ ‘మర్యాద పురుషోత్తముడి’ పాత్రను పోషించడం కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, అది ఆయన విధిరాత (Destiny) అనిపిస్తోంది… ఎందుకంటే, కపూర్ కుటుంబంలో ఈ పవిత్ర పాత్రను పోషించిన ఏకైక నటుడు రణబీర్ మాత్రమే కాదు!
Ads
అంతర్జాతీయ వేదికపై ఆ రోజే రామాయణం! మనం తొంభై ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే.. 1934లో దర్శకురాలు దేబాకి బోస్ ‘సీత’ అనే చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ బెంగాలీ టాకీ ఒక సంచలనం… ఎందుకంటే, వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం ఇదే… అక్కడ ‘గౌరవ డిప్లొమా’ను సంపాదించి, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తాను చాటిన మైలురాయి ఈ ‘సీత’…

ముత్తాత బాటలో మునిమనుమడు… ఈ చారిత్రక చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషించింది మరెవరో కాదు… కపూర్ సినీ సామ్రాజ్య స్థాపకుడు, రణబీర్ కపూర్ ముత్తాత అయిన పృథ్వీరాజ్ కపూర్... ఆ చిత్రంలో దుర్గా ఖోటే సీతమ్మగా నటించగా, గుల్ హమీద్, త్రిలోక్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు…
ఒక రకంగా చెప్పాలంటే, కపూర్ కుటుంబం వెండితెరపై ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి తరం నుంచే శ్రీరాముడితో ఒక విడదీయరాని బంధం ఏర్పడింది… ఇప్పుడు దాదాపు ఒక శతాబ్దం (92 ఏళ్లు) తర్వాత, అదే వంశానికి చెందిన నాలుగో తరం నటుడు రణబీర్ కపూర్, మళ్ళీ అదే ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు…

ఏడేళ్ల కష్టం.. రెండు భాగాల విజువల్ ట్రీట్! … ఈ రామాయణం ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నితేష్ తివారీ బృందం దాదాపు 7 సంవత్సరాల పాటు శ్రమించింది… అయోధ్య వైభవాన్ని, లంక నేపథ్యాన్ని ఇప్పటి తరం ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేయబోతున్నారు… నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది…
-
మొదటి భాగం: 2026 దీపావళి కానుకగా…
-
రెండవ భాగం: 2027 దీపావళికి…
తాతల నాటి పవిత్ర వారసత్వాన్ని అందిపుచ్చుకుని, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి… 1934లో పృథ్వీరాజ్ కపూర్ సృష్టించిన ఆ మ్యాజిక్‌ను, 2026లో రణబీర్ మళ్ళీ రిపీట్ చేయడం అనేది నిజంగానే సినీ ప్రేమికులకు ఒక Full Circle Moment…..
Share this Article