Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

September 9, 2025 by M S R

.

కాదు, సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడం వల్ల మాత్రమే జనం తిరగబడటం లేదు… అది జస్ట్, ఒక వత్తి… అది అంటించారు… జనంలో ఆగ్రహం, అసహనం ఉడికిపోెతున్నాయి చాన్నాళ్లుగా… అదిప్పుడు బయటపడింది… అంతే…

అప్పట్లో 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, ఇప్పుడు 2025లో నేపాల్…. మరీ నేపాల్‌లో అధ్యక్షుడి ఇంటిని తగులబెట్టారు… ఓ మంత్రిని వీథుల్లో ఉరికిస్తూ కొట్టారు.,. అధికార పార్టీ ఆఫీసుకు అగ్గిపెట్టారు.,. ప్రభుత్వ భవనాలు మండిపోతున్నాయి… ప్రధాని రాజీనామా చేసి దుబయ్ పారిపోవడానికి రెడీ అయిపోయాడు… అరాచకం… హింస… ప్రధాని భార్య ఆ మంటల్లో కాలిపోయింది… దారుణం… పార్లమెంటును కూడా తగులబెట్టారు…

Ads

ఆల్రెడీ కాల్పుల్లో 21 మంది మరణించారు… కొందరు గల్లంతు… వందల మందికి గాయాలు… 73 ఏళ్ల ప్రధాని ఓలి ఓ మిలిటరీ హెలికాప్టర్‌లో బతుకు జీవుడా అని పారిపోతున్నాడు… రాజధాని ఓ రణక్షేత్రం… మంత్రుల నివాసాల్లో ఆందోళనకారులు అడుగుపెట్టారు… ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూసేశారు…

…. ఎస్, కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను రద్దు చేసిన ఆగ్రహం కాదు… ఎన్నాళ్లుగా ప్రభుత్వ పనితీరు మీద, నిరుద్యోగం మీద, అవినీతి మీద, అసమర్థత మీద జనంలో పేరుకుపోతున్న కోపం, ఇలా బద్ధలైంది… అందుకే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను తిరిగి స్టార్ట్ చేసినా జనంలో కోపం తగ్గడం లేదు…

అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు జనాన్ని బానిసలుగా చేసుకుని, దేశాల సార్వబౌమత్వాన్నే కూల్చే స్టేజ్‌కు చేరాయి… ఇదొక హెచ్చరిక, అన్ని దేశాలకూ…

అసలు విషయానికి వస్తే… ఈ పాత హిందూదేశంలో మావోయిస్టులు చండప్రచండంగా విప్లవాన్ని లేవదీసి, చివరకు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నారు… కానీ వాళ్లకు పాలన తెలియదు… ఎప్పుడూ స్థిరంగా నాలుగు రోజులు పాలించలేదు… పైగా ఇండియా మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు… చైనా చంకలో చేరారు.,.

హిందూ దేశం అనేది అభివృద్ధికి ఆటకం అన్నారు … మరో రాజ్యాంగం రాసుకున్నారు… గద్దెనెక్కిన ప్రతివాడూ ఇండియాను తూలనాడాడు… కరోనాకాలంలో చైనాకన్నా ఇండియా వైరస్ డేంజర్ అంటూ అవమానించారు… భారత్ భూభాగాలు కొన్ని మావే అన్నారు …

భారత భూభాగాలను కలుపుతూ కొత్త నేపాల్ పటం తయారు చేశారు… రాముడి జన్మభూమి మాదే అన్నారు… ఇండియాలోని అయోధ్య ఓ ఫేక్ అన్నారు… కేపీశర్మ ఓలి అనే ఈ ప్రధాని తెల్లారిలేస్తే ఇండియా ద్వేషం మీదే బతికాడు…

నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏకీకృత గ్రూప్ నేత తను … ఏమైంది..? వద్దూవద్దన్న ఆ పాత రాచరికమే కావాలని జనం వీథుల్లోకి వస్తున్నారు… ఆ పాత హిందూదేశం కావాలన్నారు జనం… ఎస్, ఏ విప్లవమైతే ఈ మావోయిస్టు పాలకులు కోరారో, అదే విప్లవం వాళ్ల మీదే విరుచుకుపడింది… ఇది జెన్-జెడ్ తిరుగుబాటు కాదు, అంతకుమించి…

ఇక రేపటి నుంచి మన దేశ సోకాల్డ్ ప్రగతి విప్లవవాదులు నానా కారణాలనూ విశ్లేషిస్తారు, ఇదీ అమెరికా సామ్రాజ్యవాద కుట్ర అంటారు, ఇండియా పన్నిన పన్నాగం అంటారు… అన్నీ ఫేక్, అసలు నిజం… జనంలో పాలన తీరు మీద ఉడుకుతున్న ఆగ్రహం…

సోషల్ మీడియా యాప్స్ రద్దు అనేది జస్ట్, పైకి కనిపిస్తున్న కారణం మాత్రమే… చైనా మూడు దేశాల్లోనూ ఇండియా వ్యతిరేక మంటలు పెట్టింది, పెట్రోల్ పోసింది… చివరకు ఆ దేశాలే తగులబడుతున్నాయి… ఇండియన్ డెమెక్రటిక్ సెటపే ప్రపంచంలోని ఏ దేశానికైనా అనుసరణీయం, కరెక్టు..!!

మన చుట్టూ మూడు దేశాల్లోనూ ఈ నాలుగేళ్లలో ఈ జనవిప్లవం చూశాం కదా… చైనా మంటపెట్టిన ప్రతి దేశమూ అంతే… తరువాత ఎవరు..? ఇంకెవరు పాకిస్థాన్..? అమెరికా రహస్య దోస్తీ, చైనా స్ట్రెయిట్ దోస్తీ ఏదీ రక్షించదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions