ముఖ్తార్ అన్సారీ… మన దేశంలో మాఫియాలు, క్రిమినల్స్, పొలిటిషియన్స్ కలగలిసిపోయిన తీరుకు ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… అంతేకాదు, మన సిస్టం ఫెయిల్యూర్‌కు కూడా..! హత్య, దోపిడీ కేసులో శిక్ష పడిన ఓ ఖైదీ తను… అనేక క్రిమినల్ కేసుల్లో విచారణ ఖైదీ.,. బాందా జైలులో గుండెపోటుతో మరణించాడు… తను ఎంత క్రూయలో చెప్పడానికి, సమాజ్‌వాదీ పార్టీ అలాంటి క్రిమినల్స్‌కు ఎంత బాసటగా నిలిచేదో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు…
అందులో ఒకటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య… ఈ కేసులోనే తనకు పదేళ్ల జైలు శిక్ష పడింది… ఈ హత్య జరిగింది 2005 నవంబరులో… ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే ఓ బీభత్సమైన, దారుణమైన హత్య అది… ఘాజిపూర్‌లో ఏకే-47 గన్నులతో దాదాపు 500 రౌండ్ల కాల్పులు జరిగాయి… అందులో బీజేపీ ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు అక్కడికక్కడే మరణించారు… ప్రపంచంలో మిలిటరీ, టెర్రరిస్టులు మాత్రమే వాడే ఏకే-47 ను తొలిసారిగా యూపీలో ఓ ఎమ్మెల్యే హత్యకు వాడటం అంటే అన్సారీ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు…
కాల్పులు జరిగిన చోట పోలీసులకు 400 బులెట్ షెల్స్ దొరికాయి… హత్యకు గురైన ఎమ్మెల్యే బాడీలో 21 బుల్లెట్లు దిగాయి… అంతే ఎంత కసిగా, ఏమాత్రం తప్పించుకోరాదనే భావనతో ఆ భారీ కాల్పులు జరిగాయో అర్థమవుతుంది…
Ads
400 bullet shells recovered by police from the crime scene (Source: Hindustan Times)
ముఖ్తార్ అన్సారీ ఆ హత్యకు ప్లాన్ చేసి, అనుచరులను పంపించి, హత్య తరువాత హతుడి పిలకజడను విజయసూచికగా తీసుకురమ్మని చెప్పాడు… ఆ బాధ్యతను మరో నొటోరియస్ క్రిమినల్ రాకేష్ పాండేకు అప్పగించాడు… అలా ముఖ్తార్ ఓ డాన్ అభయ్‌సింగ్‌ను ఆదేశించిన వాయిల్ కాల్ 2020లో వెలుగు చూసింది…
ఈ హత్య జరిగినప్పుడు అన్సారీ జైలులోనే ఉన్నాడు… ఇంకేదో కేసులో… అంటే జైలులో కూర్చుని ఓ ఎమ్మెల్యే హత్యను ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అంటే తనకు అధికార యంత్రాంగంలో, రాజకీయ వ్యవస్థలో ఉన్న పట్టు ఏ రేంజో తెలుసుకోవాలి… ఈ హత్యకు కుట్రదారుల్లో అన్సారీతోపాటు సోదరుడు అఫ్జల్ అన్సారీ కూడా సహనిందితుడే… హత్య టీం లీడ్ చేసింది మరో నొటోరియస్ క్రిమినల్ ప్రేమ్ ప్రకాష్ సింగ్ అలియాస్ మున్నా భజరంగి…
ట్రయిల్ కోర్టులో ముఖ్తార్, అఫ్జల్ నిందితులని ప్రూవయింది… వాళ్లు హైకోర్టుకు వెళ్లారు 2006లో… కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది… 2013లో సదరు మృత ఎమ్మెల్యే భార్య అల్కారాయ్ విజ్ఞప్తి మేరకు విచారణను యూపీ బయటకు షిఫ్ట్ చేశారు… ఒక్కొక్క సాక్షే చనిపోతున్నాడు లేదా వాళ్లకు అనుకూలంగా మారిపోతున్నాడు… దాంతో యూపీలో నాకు న్యాయం జరగదని అల్కా రాయ్ ఆ విజ్ఞప్తి చేసింది… సాక్ష్యాలు సరిగ్గా లేవనే కారణంతో సీబీఐ కోర్టు ఆ ఇద్దరు అన్సారీ బ్రదర్స్‌ను వదిలేసింది… ఎమ్మెల్యే కొడుకు ఈ న్యాయపోరాటాన్ని హైకోర్టుకు తీసుకెళ్లాడు…
సుదీర్ఘమైన న్యాయపోరాటం తరువాత 2023 ఏప్రిల్‌లో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అన్సారీని దోషిగా ప్రకటించి పదేళ్ల జైలుశిక్ష విధించింది… ఇదీ ఆ కేసు నేపథ్యం… ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… ముఖ్తార్ ఆ బీజేపీ ఎమ్మెల్యే హత్య మీద ఎంత కీన్‌గా ఉన్నాడంటే ఎమ్మెల్యే ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి కూడా బుల్లెట్లు దూసుకుపోగల అత్యాధునిక ఆయుధాల కోసం ప్రయత్నించాడు… 2004లోనే కోటి రూపాయలతో ఓ మెషిన్ గన్ సమకూర్చుకోవడానికి ప్రయత్నించిన ఆధారంగా ఓ వాయిస్ కాల్ ను పోలీసులు దొరకబట్టుకున్నారు…
ఓ సోదాలో డీఎస్పీ శైలేంద్ర సింగ్ ఈ అన్సారీ మరో స్థావరంలో లైట్ మెషిన్ గన్, 200 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాడు, పోటా కింద బుక్ చేయాలని రిపోర్ట్ చేశాడు… ఈ విధినిర్వహణకు ఆయన్ని ములాయంసింగ్ నేతృత్వంలోని ఎస్పీ పార్టీ నానారకాలుగా వేధించింది… ఎస్పీ నాయకులంతా అన్సారీలే కదా… ములాయంసింగ్ ప్రభుత్వం ఓ తప్పుడు కేసులో కూడా ఇరికించింది ఈ డీఎస్పీని… మొన్న అన్సారీ మరణం తరువాత సదరు మాజీ డీఎస్పీ వెల్లడించాడు ఈ వివరాల్ని…
లెక్కలేనన్ని ఆరోపణలతో ఆ డీఎస్పీని వేధించింది ఆ ప్రభుత్వం… యోగీ ప్రభుత్వం వచ్చేవరకూ తన మొరను వినిపించుకున్నవాళ్లు లేరు… తరువాత ఈ తప్పుడు కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్టు యోగీ ప్రభుత్వం కోర్టుల్లో దరఖాస్తు చేసింది, కోర్టు నాలుగేళ్ల తరువాత అంగీకరించింది… అంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం, రాజకీయం, నేరం, మాఫియా కలగలిస్తే చివరకు పోలీసు అధికారులు కూడా ఎలా సఫరవుతారో చెప్పడానికి ఇదంతా ఓ ఉదాహరణ…
హత్యకు గురైన ఎమ్మెల్యే కొడుకు పేరు పీయూష్ రాయ్… మొన్న అన్సారీ మరణవార్త బయటికి రాగానే తన నివాసంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నాడు..!!
Share this Article