Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…

May 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. A great thought-provoking , brave movie … కొందరు విభేదించవచ్చు, కానీ ఇలాంటి ఆలోచనాత్మక సినిమాలు రావాలి, డిబేట్ జరగాలి… 23- ఇరవై మూడు . టైటిల్ చూడగానే ఏందీ నంబర్ అని అనిపించింది నాకు ముందు .

ఫేస్ బుక్కులో రెండు మూడు రివ్యూస్ చూసాక చుండూరు దళితుల ఊచకోత కేసు , చిలకలూరిపేట బస్ దహనం కేస్ అని అర్ధం అయి , ఆసక్తి ఉత్సుకత కలిగి ఉదయం చూసాను .

Ads

టైటిల్స్ , సినిమా చూసాక మరింత సంతోషం కలిగింది . ఈ సినిమాకు ఇన్పుట్స్ ఇచ్చిన వారిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు . ఒకరు ఆప్తమిత్రులు , నాగార్జున యూనివర్సిటీ నుండి రిటైరయిన లా ప్రొఫెసర్ Amancherla Subrahmanyam , మరొకరు నా ఫేస్ బుక్ ఫ్రెండ్ , చాలామందికి సుపరిచిత ఫిలిం జర్నలిస్ట్ Bharadwaja Rangavajhala .

వీరిద్దరు కాకుండా ఈ సినిమాలో ఉన్న లాయర్ చంద్ర రియల్ స్టోరీలో మానవ హక్కుల ఉద్యమకారుడు లాయర్ చంద్రశేఖర్ . నాకు సామాజిక ఉద్యమాలలో మంచి మిత్రుడు . ఆయన చుండూరు కేసులో కత్తి పద్మారావు వాళ్ళతో పాటు బాగా కష్టపడ్డారు . చంద్రశేఖర్ సంతాపసభలో కూడా నేను పాల్గొన్నాను . ఇంక సినిమా గురించి చూద్దాం .

All are equal, but some are more equal . మనమందరం రోజూ అనుభవించేదే . దర్శకత్వం వహించిన రాజ్ ఆర్ అభినందనీయుడు . 1990s లో జరిగిన మూడు వేర్వేరు సంఘటనలను తీసుకుని , తాను చెప్పదలచుకున్న All are equal , but some are more equal అనే దెప్పుని సూటిగా చెప్పటంలో సఫలీకృతులయ్యాడు .

1991 , 1993 రెండు సంఘటనలు మా గుంటూరు జిల్లావే . 1991లో జరిగిన చుండూరు నరమేధం కేసులో నిందితులు , 1997 లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కారు బాంబు కేసులో నిందితులు ఎలా more equal , 1993 లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఇద్దరు నిందితులు ఎలా equal కాదో సుత్తి లేకుండా , మెత్తగా బ్రహ్మాండంగా చూపారు .

చుండూరు నరమేధంలో శవాలను పోస్ట్ మార్టం చేసిన దళిత డాక్టర్ నిజ జీవితంలో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు . అతని సోదరుల్లో ఒకరు మాజీ మంత్రి , మరొకరు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు . అతని అంత్య కార్యక్రమాలకు కూడా నేను హాజరయ్యాను . వారంతా మా ఫేమిలీ ఫ్రెండ్సే .

డైరెక్టర్ తర్వాత మెచ్చుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్ . పాటలు , BGM రెండూ బాగున్నాయి . హీరోయిన్ సుశీలగా తన్మయి చాలా బాగా , ఆరిందా లాగా నటించింది . ఆమెదే అగ్ర తాంబూలం . సైకాలజీ ప్రొఫెసరుగా ఝాన్సీకి మంచి పాత్ర వచ్చింది . బాగా నటించింది .

ఇంత భారీ సీరియస్ సినిమాలో సాగర్ , సుశీల లవ్ స్టోరీని బాగా ఫిట్ చేసారు . సాగర్ పాత్రధారి తేజ , అతని ఫ్రెండుగా పవన్ రమేష్ , జైల్లో ఖైదీగా తాగుబోతు రమేష్ బాగా నటించారు . ఇతర నటీనటుల పేర్లు నాకు తెలియవు .

కుల వివక్ష , పెత్తందారీ కులాల ఆభిజాత్యం వంటి సామాజిక , ఆర్ధిక , రాజకీయ అంశాల చుట్టూ తీసిన ఈ సినిమా ఆలోచింపచేసే సినిమా . సినిమాలో పెరోల్ మీద బయటకు తెస్తాం కదా అని హోం మంత్రి మాట మనకు డేరా బాబా ప్రహసనం గుర్తుకు తెస్తుంది . He is more equal and 90% Physically Disabled Prof Sai Baba is not equal చక్కగా అర్థం అవుతుంది .

తప్పక చూడండి . పది మందిని చూడమని చెప్పండి . ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకపోతే జనం సినిమాలను తీసే వారే దొరకరు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెడికల్ మాఫియా..! తిండికన్నా మందుల్నే ఎక్కువ తినిపిస్తుంది..!!
  • విధికి ఎదురీత..! మెడికల్ హిస్టరీని మార్చేసిన 6 గంటల అద్భుతం..!
  • 3 పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వేస్ట్ చేశాను… ఇప్పుడు బుద్దొచ్చింది…
  • పెదవి కొరికే పెదవి కొరకే… వేటూరి సుఖాలాపనలు బోలెడు…
  • అప‘జయం’ రవి..! ప్రేమ, పెళ్లి ఓ బూటకం… మనుషుల నాటకం..!!
  • సీఎం జోసెఫ్ విజయ్ టర్కీ టవల్ కథ..! కాస్త థిక్ స్కిన్ అవసరం బాసూ..!!
  • డ్రామా @ బీజింగ్… తిరుగు ప్రయాణంలో చైనా వస్తువులన్నీ చెత్తబుట్టలోకి!
  • పాపం కేటీయార్… తను కూడా ఇలా తయారయ్యాడేంటి..?
  • అన్నా, బండి సంజయ్… ఎక్కడెక్కడ తప్పు జరిగిందీ అంటే..?!
  • రక్తికడుతున్న చివరి మ్యాచులు… కోల్‘కథ’ ముగియలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions