ప్రిన్స్ మహేశ్ బాబు బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్య అతిథి అంటున్నారు… అంతేకాదు… మునుపెన్నడూ లేనట్టుగా ఈసారి ఫినాలే ఏకంగా మూడు రోజులు ప్రసారం చేస్తారట..! చేయవచ్చు… అసలు ట్రెండ్ కూడా అదే… ఆఫ్టరాల్ ఢీ చాంపియన్స్ వంటి ఫైనల్సే… ఏ ముఖ్య అతిథీ లేకుండా రెండు భాగాలు చేసి మరీ, వారం గ్యాప్‌తో ప్రసారం చేసినప్పుడు… ఇదే బిగ్‌బాస్ వీకెండ్ షోలు రెండేసి రోజులు ప్రసారం చేస్తున్నప్పుడు… గ్రాండ్‌గా ఫినాలే నిర్వహిస్తే, దాన్ని మూడు రోజులు వరుసగా ప్రసారం చేయడం మంచి ఆలోచనే… అసలు ప్లాన్ మరిన్ని యాడ్స్, మరింత రెవిన్యూ, ఇంకా డబ్బు… గలగలగల… కళకళకళ… కానీ అసలే లీకుల స్టూడియో… మూడు రోజుల సీక్రెసీ మెయింటెయిన్ చేయడం మామూలు విషయం కాదు…
గతంలో కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, కుటుంబసభ్యులను పిలిచి వీకెండ్ షో షూట్ చేసేవాళ్లు… కానీ ఇప్పుడు కరోనా పాండెమిక్ కారణంగా అది సాధ్యం కాదు… ప్రేక్షకుల్లేని స్టేడియాల్లో క్రికెట్ ఆడుతూ కృత్రిమంగా ప్రేక్షకుల గోలను వినిపిస్తున్నట్టుగానే… బిగ్‌బాస్ వీకెండ్ షోలు కూడా జస్ట్, ఒక వేదిక… షూట్… అంతే… టీవీల ఎదుట చూడాల్సిందే ఎవరైనా… ఫినాలే తేదీలు ఏమిటనే కదా మీ ప్రశ్న… 18, 19, 20 డిసెంబరు…
Ads
ఇదంతా సరే గానీ… ఈసారి స్టార్ మాటీవీ టీం నాగార్జున నోటి వెంట అనేక అబద్ధాల్ని చెప్పిస్తున్న తీరే సరిగ్గా లేదు… అవినాష్‌తో మాట్లాడీ మాట్లాడీ అవే ఎచ్చులు, అవే ఏతులు అలవాటైపోయినట్టున్నాయి… తన పేరిట విడుదలైన ఓ ప్రకటన ఎన్ని అబద్ధాలను చెబుతున్నదీ అంటే… ముందు ఆ ప్రకటన ఏమిటంటే..?
‘‘ప్రతివారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42 % వాటా (ఎస్డీ+హెచ్డీ)ను పొందింది… 20+ టీవీఆర్‌తో ఇది బిగ్‌బాస్ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచింది. గతవారం ఏపీ, తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనం. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్‌బాస్ సీజన్ 4 వీక్షించారు. ఇది అపూర్వం…’’ ఇదీ ప్రకటనలోని ఓ భాగం…
నిజానికి 20 ప్లస్ టీవీఆర్ అనేది కేవలం లాంచింగ్ రోజు మాత్రమే… తరువాత ఎప్పుడూ రాలేదు ఆ రేటింగ్స్… గత వారం కూడా వీకెండ్ షో రేటింగ్స్ కేవలం 11.7 మాత్రమే… గత వీకెండ్స్ ఇంత కూడా లేదు… వీక్ డేస్‌లో మరీ సగటు 8.4 మాత్రమే… గత వారాల్లో ఇదీ దిక్కులేదు… మరీ కొన్నిరోజులయితే నాలుగైదు రేటింగ్స్ కూడా ఉన్నయ్… ఇదేనా అపూర్వమైన రేటింగ్స్..?
ఒక వారం 4 కోట్ల వీక్షకులు చూశారని చెప్పడం మరో అతిశయోక్తి, ఓ అబద్ధం… బహుశా వీక్షణలు కావచ్చు… అంటే వ్యూస్… నాట్ వ్యూయర్స్… అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని టీవీ సెట్లు ఉన్నాయో ముందుగా తెలుసుకొండి బ్రదర్స్… 12 వారాల్లో 83 శాతం మంది వీక్షకులు ఈ షో చూశారు అనడం మరో జోక్… బిగ్‌బాస్ వీక్షకులు ఒక పరిమిత సెక్షన్ మాత్రమే… మరీ 83 శాతం అనేది నవ్వు పుట్టించడం లేదా..? అసలు తెలిసే రాస్తున్నారా ఈ ప్రకటనలు..? పాపం, నాగార్జునకు ఏమీ తెలియదనే కదా, తనను పిచ్చోడిని చేసి, తన పేరిట ఏమేమో అబద్ధాలు చెప్పిస్తున్నారు… ఈ వీక్షకుల సంఖ్య కూడా పదిన్నర కోట్ల వోట్ల వంటి ఓ భ్రమాత్మక సంఖ్యే కదా…! రియాలిటీ ఏమిటంటే..? గత మూడు సీజన్ల బిగ్‌బాస్ షోలతో పోలిస్తే ఈ సీజన్ ఫ్లాప్ షో… అంగీకరించలేరు కానీ, అబద్ధాలతో కవరింగు దేనికి..?!
Share this Article