‘‘సినిమా షూటింగు కోసం… అవసరమైనప్పుడు క్రౌడ్ చూపించడం కోసం… భారీగా జనాన్ని సమీకరించాలి… ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే, కొంత ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తూనే ఉంటుంది… ఒరిజినాలిటీ ఉండదు… అందుకని కాంతార సినిమా కోసం జనసమీకరణ, డబ్బులిచ్చి జనాన్ని తరలించడం గట్రా చేయలేదు…
అందుకని కంబాలా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడే కంబాలా సీన్లను ఆ జనంలోనే తీసేశాం… షూటింగ్ జరుగుతోందని తెలిస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది… అందుకని ఆ విషయం తెలియకుండా జనాన్ని షూట్ చేశాం… అందుకే మీకు కాంతార సినిమాలో కంబాలా సీన్లలో ఆ ఒరిజినాలిటీ కనిపిస్తుంది… కాకపోతే ఓ చిన్న చిక్కు వచ్చిపడింది… చిన్నదేమీ కాదు, ఓ టాస్క్ అది…
Ads
ఉన్నదున్నట్టు చూపిస్తే పర్లేదు, ఎవరూ పెద్దగా పట్టుకోలేరు, కానీ ఎందుకో నాకే మనసొప్పలేదు… రషెస్ చూస్తుంటే వచ్చిన జనంలో మాస్కులు పెట్టుకున్నవారు, మోడరన్ టీషర్టులు వేసుకున్నవారు, స్మార్ట్ ఫోన్లు చేతుల్లో పట్టుకున్నవారు కనిపించారు… సినిమా కథేమో సెవెన్టీస్ బాపతు… సో, బాగుండదని భావించి స్టెప్ మోషన్‌లో ఒక్కో ఫ్రేమ్ పరిశీలిస్తూ అవన్నీ కవర్ చేయాల్సి వచ్చింది… అదొక పెద్ద టాస్కే, కానీ తప్పలేదు…
జనంలో రియల్ ఉత్సాహం, జోష్, ఉద్వేగాలు కనిపించాలంటే ఈ ఒరిజినల్ షాట్సే బెటర్ అని మా టీం అనుకుంది… సక్సెస్ ఫుల్‌గా చేసింది… రెండో విషయం కూడా అంతే… హీరోకు తల్లిగా, అంటే నాకు తల్లిగా చేసిన మానసి సుధీర్ కూడా సేమ్ నా వయస్సే… మామూలుగా మేకప్‌లో ఎంత కవర్ చేసినా మా వయస్సుల్లో తేడా పెద్దగా కనిపించదు… బాగుండదు…
అందుకని ఏకంగా స్క్రిప్టులో మార్పులు చేయాల్సి వచ్చింది… చేశాం అంతే తప్ప మానసిని తప్పించలేదు, ఆమె మంచి నటి, ఆమె మొహంలో ఫీలింగ్స్ అద్భుతంగా పలుకుతాయి… ఆమెను వదులుకోవడం మాకిష్టం లేదు… అందుకని చిన్నతనంలోనే పెళ్లి జరిగినట్టుగా స్క్రిప్టులో మార్పులు చేసేశాం… కొంతమేరకు అలా కవరైంది… వీలైనంతవరకూ ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసేలా ఉండాలి సీన్లు గానీ, స్క్రిప్టు గానీ… అదీ మా భావన…
చాలామంది తెలియనిది ఏమిటంటే… సినిమాలో ఎక్కువ భాగం మా సొంత ఊరు కుందపురలోనే తీశాం… ఇక్కడే షూటింగ్ చేస్తున్నామని చాలామందికి తెలుసు, కానీ నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడే మా ఊరి గురించి మొత్తం రాసిపెట్టానని ఎవరికీ తెలియదు… ఊరిలో ప్రతి మూల నాకు పరిచయమే… ఏ షాట్ ఎక్కడ తీయాలో, ఎప్పుడు తీయాలో నా మైండ్‌లో ఎప్పుడో ప్లాన్ ప్రిపేరై ఉంది…
ఉదాహరణకు నేను క్రికెట్ ఆడిన గ్రౌండ్ బడమాల్ గద్దె… కాదుబెట్టు గ్రామ పరిధిలోకి వచ్చే కంబాలా గ్రౌండ్ అది… కంబాలా ఎప్పుడు జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టే షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం… సన్ సెట్ కూడా అక్కడే తీశాం… ఏ సీన్‌కు ఏ లొకేషన్ కరెక్టో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు…’’ ఇదీ స్టార్ సువర్ణ చానెల్‌కు రిషబ్ శెట్టి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలోని మూడు ఇంట్రస్టింగు విశేషాలు…
Share this Article