.
గీతామాధురి బుగ్గలు పిండిన థమన్… అని నిన్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను క్రమేపీ ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో చెప్పుకున్నాం కదా…
ఇక్కడే ఇంకొన్ని అంశాలూ చెప్పుకోవాలి తెలుగు సినిమా సంగీత ప్రియులు… ఫస్ట్ రెండు లాంచింగ్ ఎపిసోడ్లు చూశాక ఈసారి కూడా తెలుగు ఇండియన్ ఐడల్‌ను పైత్యం దిశలో తీసుకుపోబోతున్నారని అర్థమైంది… దాన్నలా వదిలేస్తే…
Ads
ఈటీవీ పాడుతా తీయగా తాజా ప్రోమో చూస్తే ఎంత ఆనందం వేసిందో..! అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట పాడాలి అనేది టాస్క్… ఐతే టాస్క్ స్థూలంగా ఏముందిలే అనిపించినా… అబ్బాయిలు పాడింది శివశంకరీ పాట…
అంత ఈజీ పాట కాదు… పెద్ద పెద్ద గాయకులే వేదికల మీద పాడటానికి సాహసించేవాళ్లు కాదు, చివరకు ఆ పాట ఒరిజినల్ సింగర్ ఘంటసాల కూడా..! అలాంటిది వర్ధమాన గాయకులు పక్కాగా సాధన చేసి బ్రహ్మాండంగా రక్తికట్టించారు పాటను… వావ్…
అమ్మాయిల విషయానికొస్తే మీరజాలగలడా సత్యాపతి పాట… అదీ సేమ్ శివశంకరీ పాటకు దీటైనదే… ఆహా, ఎంత బాగా పాడారో గాయనీమణులు… ఈ క్వాలిటీని పాడుతా తీయగా షో కాపాడుకోవాలని ఆశించడమే ఇక… కాకపోతే సునీత బాగా విసిగిస్తోంది… ఆమె జడ్జితనాన్ని చరణ్ తప్పించలేడు, తప్పించుకోలేడు ఫాఫం…
జీతెలుగులో మళ్లీ సరిగమప మొదలైంది… ఆ ప్రోమో చూస్తే ఫాఫం అనిపించింది… ఈసారి లిటిల్ ఛాంప్స్ అని పిల్లల మ్యూజిక్ షో… ఆల్రెడీ సుడిగాలి సుధీర్ హోస్టుగా, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా పిల్లలదే మొన్నమొన్నటిదాకా డ్రామా జూనియర్స్ వచ్చింది కదా…
అది అయిపోయిందో లేదో మళ్లీ అదే కాంబో… అదనంగా నీహారిక, అనంత శ్రీరాం, ఎస్పీ శైలజ కూడా ఉన్నారు… అనిల్, నీహారికకూ సంగీతంతో ఏం లింక్ అని అమాయకంగా అడక్కండి… అసలు ఆ షోను పూర్తి ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫన్ షోగా మార్చేశారు కదా…
అన్ని షోలలాగే మళ్లీ ఇక్కడా సుడిగాలి సుధీర్ మీద పంచులు… ఈసారి పిల్లలతో… నేరుగా పాటలు పాడిస్తూనే, సుధీర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ మరీ… సుడిగాలి సుధీర్ ఇలాంటి షోలలోనైనా ఈ ధోరణికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే చూసీ చూసీ ఇక జనం చూడటం మానేస్తారు సుమీ…
అనంత శ్రీరాం జీతెలుగు షోకు వచ్చాడంటేనే సర్కస్ ఫీట్లు గట్రా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడు కదా… ఇందులోనూ అంతే… ఫాఫం… ఈ షో ప్రోమోలో నచ్చింది ఒకటే… పాపులర్ వయోలినిస్టు కామాక్షి కనిపించడం..!!
Share this Article