.
భార్యతో అసహజ శృంగారం నేరం కాదు అని చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది తాజాగా… దీని మీద రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి…
ఈమధ్య పలు హైకోర్టులు చిత్రమైన తీర్పులు చెబుతున్నాయి, సొసైటీలో జరగాల్సినంత చర్చ జరగడం లేదు, కనీసం న్యాయపరిజ్ఞానం ఉన్న మాజీ న్యాయమూర్తులైనా డిబేట్ పెట్టాలి కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది…
Ads
కానీ, ఇక్కడ ఇష్యూ వేరు… హైకోర్టు ఓ చట్టాన్ని ప్రస్తావించి… (375 ఐపీసీ సెక్షన్‌కు 2013లో చేసిన సవరణ) దాన్ని బట్టి భార్యతో అసహజ శృంగారం నేరంగా పరిగణించబడదు అని వివరించింది… ఐతే గియితే చట్టానిదే తప్పు, ఆ చట్ట సవరణదే తప్పు…
ఆమధ్య ఏదో సినిమాలో ఓ డైలాగ్ విన్నట్టు గుర్తు… ఆడది నో అంటే నో… అంతే… భర్తయినా, ఎవడైనా… తనకు ఇష్టం లేని రతి ఖచ్చితంగా నేరమే… పైగా ఈ కేసులో ఆ అసహజ శృంగారం వల్ల ఆ భార్య మరణించింది… అంటే ఓ రకమైన క్రూర హత్య అది… కేసులో సీరియస్‌నెస్ ఉంది, భిన్నంగా చూడాల్సి ఉంది… 375 సెక్షన్ సవరణ కోణంలోనే కాదు…
ఇది 2017 నాటి కేసు… ఆమె మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది తన పెయిన్ గురించి… కింది కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది… దాన్ని హైకోర్టు కొట్టేసింది… 375 సవరణ ప్రకారం 15 ఏళ్లు దాటితే చాలు, భర్త ఎలాంటి లైంగిక చర్యకు పాల్పడినా అత్యాచారం కిందకు రాదు, సమ్మతి అనే పదానికే ప్రాధాన్యం లేదు అని వివరణ ఇచ్చింది….
కనీసం ఆ సవరణ భర్తల మొరటు, క్రూర లైంగిక చర్యలకు ఓరకంగా సమర్థన అవుతోందనే అభిప్రాయం వ్యక్తం చేసినా బాగుణ్ను… (తాజా న్యాయసంహిత చట్టాల సెక్షన్లను బట్టి 375 సవరణకు చెల్లుబాటు ఏమిటో కూడా తెలియదు… ఇప్పుడూ అలాగే ఉంటే మోడీ ప్రభుత్వం ఓ దృష్టి పెట్టాల్సిన అంశమే…)
Subramanyam Dogiparthi తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు… ‘‘భార్య ఇష్టం , అనుమతి లేకుండా చేసే శృంగారం శృంగారం ఏంట్రా అయ్యలూ … భార్య ఇష్టంతో పాల్గొనని శృంగారం శృంగారం ఎలా అవుతుందిరా సోదోళ్ళలారా !
అసహజ రతి మీద హిందీలో క్రిమినల్ జస్టిస్ అని ఓ వెబ్ సెరీస్ హాట్ స్టార్లో వచ్చింది . భర్త చాలా పెద్ద లాయర్ . భార్య చంపేస్తుంది . సంచలనం సృష్టిస్తుంది . భార్య తానే హత్య చేసానని అంగీకరిస్తుంది . కేసు మలుపులు తిరిగి చివరకు ఆమెను కోర్ట్ శిక్షించకుండా వదలివేస్తుంది .
కారణం… ఆ లాయరుకి ఏనల్ సంభోగం అలవాటు . భార్యకు ఇష్టం ఉండదు . బలవంతంగా చేస్తూ ఉంటాడు . ఆ నరకాన్ని భరించలేక లాయర్ మొగుడిని లేపేస్తుంది .
కానీ ఇక్కడ తాజా హైకోర్టు తీర్పులో మొగుడు ఎలాంటి రీతిలోనైనా సంభోగం చేయవచ్చు అంటోంది… సరే, దీని మీద అప్పీలుకు వెళతారో చస్తారో అనవసరం . ఇంకా ఎన్నాళ్ళు స్త్రీని ఒక యంత్రం లాగానో , శిల లాగానో , బొమ్మ లాగానో చూస్తాడు మగాడు !?
రాక్షస వివాహాలు , పైశాచిక వివాహాల్లాగా భార్య ఇష్టం లేకుండా జరిపే శృంగారాన్ని కూడా పైశాచిక శృంగారం అనాలి . చట్టాల్ని మార్చాలి . పైశాచిక శృంగారానికి జైలు శిక్ష ఉండాలి .
పెళ్ళానికి , మొగుడికి ఇష్టం లేని కాపురం కాపురం ఏంటి ? ఇష్టం లేని శృంగారం శృంగారం ఏంటి ? నాన్సెన్స్ . అక్కరకు రాని చుట్టము , మొక్కిన వరమీని వేల్పు , మోహరమున దానెక్కిన బాఱని గుర్రము , తననిష్టం పడని మొగుడిని/పెళ్ళాన్ని గ్రక్కున విడువంగవలయు సుమతీ ….
Share this Article