Chalasani Srinivas……….. ఇది చాలా ప్రాముఖ్యత గల వార్త
శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తిరిగి దేవాలయానికి అందజేయడం. కానీ తెలంగాణలో కొన్నిపత్రికల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నాలుగు పత్రికల్లో ఈ వార్త నాకు కనపడలేదు, బహుశా ఏ మూలన్నా ఇరికించారేమో తెలియదు. టీవీలు సాధారణంగా నేను చూడను గనుక వేశారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క పోస్టూ లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టిందని, మంత్రుల గ్రూపు దీనిపై తగు చర్యలు తీసుకుని, వెంటనే దేవస్థానానికి దఖలుపరచమని చెప్పిందని, అగ్రిమెంట్ చేసి, వెంటనే కేంద్రానికి ఆ సమాచారం పంపమని కూడా వార్తలు వచ్చాయి. ఆస్తి విలువ ₹ 2000 కోట్లు ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. కానీ ఆస్తి కాదు అదొక బాధ్యతగా దేవస్థానం, భక్తులు భావించాలి.
Ads
ఈ బాధ్యత తీసుకున్న తర్వాత దేవస్థానం చెట్లు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరుతున్నాను. శ్రీశైలం దారిలో చాలా చోట్ల పేరుకి అడివే గానీ కొట్టేసిన చెట్లు, మొండి కొండలు కనబడుతున్నాయి. అక్కడ కూడా మొక్కల్ని పెంచాల్సిన బాధ్యత దేవస్థానం చేపట్టాలి, దానికి భక్తులు సాయం చేయాలి. పర్యావరణాన్ని కాపాడటం కూడా ఈ భూమాతకి, మానవాళికి మనం చేసే సేవ కింద వస్తుంది. మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా
2022లో నేను శ్రీశైలం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి వెళ్లే దారిలో ఆ ఘాట్లో, దేవాలయం దారిలో ఇతర మతాల సింబల్స్ గానీ, లేదంటే స్లోగన్స్ గానీ చూశాను. ఒక వాటికన్, మక్కా లేదంటే ఇంకో మత పవిత్ర స్థలాలుగా భావించే దగ్గర, తిరుమల, ఇలాంటి చోట్ల నడుస్తుందా? ఒక మత పవిత్ర స్థలాల దగ్గర ఇతర మతాలను పొగుడుతూ రాస్తే అది ప్రజాస్వామ్యం అనుకోవచ్చు గానీ నైతికంగా సరికాదు. ఆయా ప్రదేశాల్లో మా మతం ఒక్కటే అసలైన మతం అని ఎవరైనా రాస్తే అది కూడా ఇతర మతాలను కించ పరిచినట్లే.
కాస్త హేతువాద దృక్పథం కలిగి, మతాల్లోని మూఢనమ్మకాలను నిరసిస్తూ, అదే సమయంలో దురాచారాలు ఉండని ఒక గొప్ప జీవన విధానంగా హిందూ మతం భాసిల్లాలని, అదే సమయంలో ఏ ఇతర మతాలని అగౌరవపరచని నాపై ఇది రాసినందుకు ఒక బ్యాచ్ ట్రోలింగ్ చేయొచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకోవాలి. మతాన్ని దేవుడు సృష్టించాడా మనిషే మతాన్ని దేవుడిని సృష్టించాడా అనే విషయంలో సైన్స్ అనేది అంతిమం… అయితే ఆధ్యాత్మికత, మనిషి సన్మార్గంలో వెళ్లడానికి కోసం మంచిని ప్రబోధించే మతాలు మంచి జీవన విధానాన్ని సూచిస్తూ కూడా ఉండాలని నా అభిప్రాయం…
Share this Article