Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనదేశం… NTR తెరంగేట్రం సినిమా… నేటికి 74 సంవత్సరాలు…

November 25, 2023 by M S R

Bharadwaja Rangavajhala….    ఎన్టీఆర్ అనబడే ఒక నటుడు తెరంగేట్రం చేసిన చిత్రం మనదేశం. విడుదలై నేటికి డెబ్బై నాలుగు సంవత్సరములు పూర్తయ్యెను. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రము ఓ బెంగాలీ నవల ఆధారంగా నిర్మితమయ్యెను. అందు పోలీసు అధికారి పాత్రలో నటించిన నటుడు తదనంతర కాలంలో పెద్ద హీరో అయి దరిమిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయ్యెను.

1949 నవంబర్ 24న ఈ చిత్రము … బెజవాడ దుర్గాకళామందిరముననే విడుదల అవుట విశేషము. తదనంతరము ఈ హాలు నందే అత్యధిక ఎన్టీఆర్ చిత్రములు విడుదలై విజయవంతమై శత దినోత్సవములు రజతోత్సవములు జరుపుకున్నవి. దీనికి కారణము ఈ హాలు విజయా వాహినీ వారి లీజులో ఉండుట ఒకటి కాగా … ఎన్టీఆర్ నిర్మాతలు తమ చిత్రములను అధికముగా ఈ పంపిణీ సంస్ధకే అప్పగించెడివారు కావడం మరొకటి.

ఎన్టీఆర్ స్వీయనిర్మాణంలో రూపొందిన చిత్రములు అనేకం విజయా వారే పంపిణీ చేయగా దుర్గాకళామందిరముననే ఆవి విడుదలై ఆడెడివి. ఈ హాలు ఎన్టీఆర్ దే అని కూడా కొందరు అనుకొనుట కద్దు. అయితే … ఈ హాలు నిర్మించినది ఆంధ్రపత్రికాధిపతి మరియు అమృతాంజనము అధిపతి కూడా అయిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు.

Ads

అప్పట్లో మరి ఇట్టి యాడ్ వేసినరో లేదో నాకు తెలియదు. ఆంధ్రపత్రిక చదవండి … అమృతాంజన్ రాసుకోండి అని … అది అట్లుండనిచ్చిన … తదుపరి కాలమున విజయా వారు బెజవాడ ఆఫీసు మూసి వేసిన అనంతరము ఈ థియేటర్ కూడా విడుదలైపోయింది. తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణాన ప్రస్తుతం కోగంటి సత్యం అనబడు ప్రముఖ పారిశ్రామికవేత్త అదుపులో ఉందని చెప్పుకొనుచుండగా వింటిని కానీ నాకు నిజానిజములు ప్రత్యక్షముగా తెలియవు.

May be an image of 1 person, ticket stub, money and text

ఇక ఈ మనదేశం విడుదలైన సినిమా హాళ్ల జాబితాలో తెనాలి సత్యనారాయణ అనే నామము కూడా కలదు. ఆ హాలు ప్రస్తుతం కళ్యాణమండపంగా మారింది. ఇందు నేను ఓ ఏడెనిమిది పర్యాయములు ఏవో పాత చిత్రములు గాంచితిని. ఈ చిత్ర ప్రదర్శనశాల అధిపతి వాసిరెడ్డి నారాయణరావు గారు తెలుగు నాట తొలినాటి కమ్యునిస్టుల్లో ఒకరు.

ఆయనకు కళల పట్ల ఆసక్తి ఉండెడిది. ఆ ఆసక్తితోనే శ్రీశ్రీ తొలి సినిమా పాట రాసిన ఆహుతి డబ్బింగ్ చిత్రమునకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రేమయే జననమరణ లీల అను గీతమది. ఆ తర్వాత రోజుల్లో ఆయన అక్కినేని నాగేశ్వర్రావును నాయకుడుగా నియమించుకుని పి.పుల్లయ్య దర్శకత్వంలో జయభేరి అను చిత్రమును నిర్మించారు.

ఆ చిత్రమునందు నందనారు చరితము శ్రీశ్రీ యే వ్రాసెను. ఈ పాటయందే కాదు .. ఈ చిత్రమునందునూ కొంత కమ్యునిస్టు వాసనలు కనిపించును . కారణము నారాయణరావు గారే అయి ఉందురని మదీయ అభిప్రాయము. ఆ సినిమా తొలి విడుదలలో పెద్ద ఫ్లాపుకాగా … తదుపరి విడుదలలో పెద్ద విజయము సాధించినది.

తెనాలి రంగస్థల కళాకారులు రచయితలు అందరితోనూ సంబంధాలుండెడివి వీరికి. తెనాలి వచ్చిన ప్రముఖుల కు బసలు ఏర్పాటు చేసెడివారు కూడాను. ఇటుల ఈ మనదేశము అను చిత్రము విడుదలై డెబ్బై నాలుగు ఏళ్లు అవడం అనే ఒక కార్యక్రమం మాటున ఎన్ని సంగతులు గుర్తుకు వచ్చినవో కదా … ఉండెదను ..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?
  • రివ్యూ అంటే ఇదీ… క్లైమాక్స్ అంటే ఇదీ… దర్శకత్వం అంటే ఇదీ…
  • ఇది స్మార్ట్ వెలుతురు చీకటి కోణం..! గుండెకే గురిపెడుతోంది..!!
  • ఓ నొటోరియస్ హత్యాచారి..!! వీడింకా బతికే ఉన్నాడు… జైలులో విలాసంగా…!!
  • నాది కవితాగానం కాదు… కాలజ్ఞానం… అందెశ్రీ అంతరంగం ఇదీ…
  • హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!
  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!
  • అందెశ్రీ..! ప్రజా కవి, సహజ కవి, ప్రకృతి కవి… మాయమైపోయాడు..!!
  • శారద పాత్ర ఉంటే చాలు… పరుచూరి బ్రదర్స్ కలాలకు పదును…
  • వయోలినిస్ట్ సుడిగాలి సుధీర్… ఆసక్తికరంగా ఓ టీవీ షో ప్రోమో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions