Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!

June 20, 2025 by M S R

.

గుంటూరు శేషేంద్ర శర్మ ఓ మహాకవి ఉండేవాడు… అవునా అనేవాళ్లే ఇప్పుడు 99 శాతం… ఉత్తమాభిరుచి… లోతైన భావుకత… సో వాట్..? నిదురించే తోటలోకి పాట రాశాడు… అంతే, తనకూ సినిమా సాహిత్యానికీ గిట్టదు అని సమజైంది… దూరం జరిగాడు…

సరే, నయా జమీందారు కాబట్టి చెల్లింది, ఏ చంద్రబోస్‌వంటి వాడైతే చెల్లుతుందా..? నాటు నాటు అనే ఓ నాటు, నాసిరకం పాటను రాయాల్సి వచ్చేది… అఫ్‌కోర్స్, ఆస్కార్ దాకా నడిపించింది… ఐనంతమాత్రాన అది మంచి పాట కాదు, గొప్ప పాట కాదు… పక్కా నాసిరకం పాట…

Ads

అలాగే బాలమురళీకృష్ణ… పాడనా వాణి కల్యాణిగా అని గొంతెత్తితే.., మాయల దెయ్యానివే అని మనుసును నిందించినా ఒకప్పుడు చెల్లించింది ఆ గొంతులో… ఇప్పుడెవడు వింటాడు..? ఎస్, ఇది చెప్పేది, సినిమా వాణిజ్య చట్రాలకూ అభిరుచులకు నడుమ పొంతన కుదరదు అని చెప్పడానికి… సమన్వయం, శృతి కుదిరితే తప్ప చెల్లుబాటు కాదు అని చెప్పడానికి…

8 వసంతాలు అని ఓ సినిమా తీశాడు ఫణీంద్ర నరిసెట్టి… ఉదాత్తమైన క్రియేటివిటీ ఉన్నవాడే… అప్పట్లో ఏదో షార్ట్ ఫిలిమ్ తీశాడు, క్లికయ్యాడు, తరువాత ఏదో సినిమా చాన్స్ వచ్చింది ఫెయిలయ్యాడు… ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమా తీశాడు… మంచి అభిరుచి… భావుకుడు… కానీ తన భావాల్ని రక్తికట్టేలా తెరమీదకు తీసుకురాలేకపోయాడు…

మరీ తనలాగా విజువల్ పొయెట్రీని ప్రేమించేవాళ్లు తప్ప ఇంకెవరికీ ఈ సుదీర్ఘ, సాగదీత కథనం ఎక్కదు… ఆకట్టుకోదు… అక్కడే ఉంది ట్రిక్కు… భావుకత వేరు, ఉన్నతాభిరుచి వేరు, ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే ప్రజెంటేషన్, సరుకు వేరు… అక్కడే సదరు దర్శకుడు ఫెయిలయ్యాడు… ఇవి మేఘసందేశం రోజులు కావు బ్రదర్…

ananthika

కానీ ఓ విషయం చెప్పుకోవాలి… ఓ ప్రేమకథను మహిళ కోణంలో బాగా చెప్పడానికి ప్రయత్నించాడు… డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నాడు… ఎంత లోతైనవీ అంటే…

”మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు.. భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప”… ”పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్లం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?”…    ”మనం ఇక్కడికి ఉండటానికి వచ్చాం ఉండిపోవడానికి కాదు”…    ”పిల్లలు తల్లితండ్రుల సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి”…    ”అనాథ అంటే అమ్మానాన్న లేనోడు కాదు ఆశయం లేనోడు”…   ”ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే అదే దిశ కాదు”….

….. ఆహా… పదునైన డైలాగ్స్… కానీ ఏమాటకామాట… మంచి రచయిత వేరు, మంచి దర్శకుడు వేరు… ఐమీన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వేరు అని… బట్ వోకే… 8 వసంతాలు (8 ఏళ్లు)… అనే సినిమాలో మరీ మరీ చెప్పుకోవాల్సిన కేరక్టర్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్…

ananthika

ఈ సినిమాలో కథానాయిక మార్షల్ ఆర్ట్స్ ప్రవీణురాలు… మొదట ఓ ప్రత్యర్థి, పోటీ, గెలుపు, ప్రేమ… తరువాత హఠాత్తుగా బ్రేకప్, గురువు మరణం.,. తరువాత మరొకడు తన జీవితంలోకి ఎంట్రీ, వాడూ రచయితే… ఇలాంటి పాత్రకు దర్శకుడు సరిగ్గా ఎంపిక చేసుకున్నాడు ఆమెను…

నిజం చెప్పాలంటే… ఏ దిగ్దర్శకుడో మంచి పాత్ర రచించి అప్పగిస్తే… ఆమె దున్నేస్తుంది… సూపర్… అందం, అభినయం మాత్రమే కాదు, బహుముఖ ప్రతిభ… మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్… కలరియపట్టు నిపుణురాలు… మూడు రకాల శాస్త్రీయ నృత్యం తెలుసు… లా చదువుతోంది… చిన్న వయస్సులోనే ఎంతటి ప్రతిభ… ప్రిరిలీజ్ వేదిక మీద ఆమె విన్యాసాలు చూస్తూ పెద్ద తలకాయలన్నీ కళ్లప్పగించి, నోళ్లు తెరిచి చూస్తుండిపోయారు…

బాగా చేసింది… ఆమే సినిమాకు హైలైట్… కథ ప్రకారమైనా, నటన ప్రకారమైనా మిగతావాళ్లు కనిపించరు… అది తెలిసే నిర్మాతలు ఆమె ముఖచిత్రంతోనే ప్రచారం చేసుకున్నారు… కానీ ముందే చెప్పినట్టు ఇవి మేఘసందేశం రోజులు కావు… బట్ వోకే… దర్శకుడి టేస్టు బాగుంది, హీరోయిన్ మరీ బాగుంది… సినిమా గురించి అంటారా..? అందరికీ కవిత్వం నచ్చదు.,. భావకవిత్వం మరీనూ…!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…
  • నో…! మెగా క్యాంపుకీ బన్నీకి నడుమ గ్యాప్ అలాగే ఉందన్నమాట..!!
  • విధిలేదు… సొంత భర్త ప్రాణాలే తీసేసింది… ఈమె కథ ఇప్పుడెందుకంటే..?
  • కొత్త సెన్సార్ రూల్స్..! నిర్మాతల గుండెల్లో కొత్త గుబులు..!!
  • చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…
  • శుష్క రాజకీయ మూసీ వ్యూహాలకు… అసలు నిజాల వెల్లడితో సీఎం అడ్డుకట్ట…
  • శృంగేరీ పీఠం ఉత్తరాధికారి నకిలీ శంకరాచార్యుడా..? ఏంటీ రచ్చ..?!
  • శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదా..? దాంట్లో బుల్లెట్లు లేవా మాజీ కామ్రేడ్ దేవ్‌జీ..?
  • ఎంజీఆర్‌పై ఉచ్చ భాష… మన తెలుగుతనంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది…
  • శెట్టి గ్యాంగ్… ఎనిమిదేళ్లు దాటినా రష్మికపై అదే కక్ష… అదే వేధింపులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions