Hideki wada… ఈయన ఓ Psychiatrist… గత మార్చిలో “80-Year-Old Wall” అని ఓ పుస్తకం రాశాడు… మార్కెట్‌లోకి రిలీజైంది… వేగంగా 5 లక్షల కాపీలు అమ్ముడైపోయాయి… ఈ వేగం ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 లక్షల కాపీల మార్క్ సాధిస్తుంది… అంటే ఈ సంవత్సరం జపాన్‌లో అత్యధికంగా విక్రయించబడే పుస్తకం అన్నమాట…
ఎవరీయన..? వృద్ధుల్లో వచ్చే మానసిక సమస్యలను ట్రీట్ చేసే డాక్టర్… 61 ఏళ్లు… గత 35 ఏళ్లలో 6 వేల మందిని ట్రీట్ చేసి ఉంటాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం 80 ఏళ్ల వయోవృద్ధులకు ఓ కరదీపిక… ప్రత్యేకించి 80 ల్లో ఉన్నవాళ్లు ఆరోగ్యంగా వందేళ్ల వైపు ఎలా ప్రయాణించాలో చెప్పడమే ఈ పుస్తకం…
ప్రస్తుతం జపాన్‌లో ‘సగటు ఆరోగ్య ఆయుష్షు’ (అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆరోగ్యంగా, స్వతంత్రంగా ఉండటం) పురుషుల్లో 72.68 ఏళ్లు, కాగా మహిళల్లో ఇది75.38… కానీ ‘సగటు ఆయుష్షు’ మాత్రం ఎక్కువ… పురుషుల్లో 81.64 ఏళ్లు, మహిళల్లో 87.74 ఏళ్లు… (ప్రపంచంలోకెల్లా అధికం..?)
Ads
ఇక్కడ చిన్న తేడా ఉంది… సగటు ఆరోగ్యకరమైన ఆయుష్షుకూ, సగటు ఆయుష్షకూ నడుమ పురుషుల్లో 9 ఏళ్లు, మహిళల్లో 12 ఏళ్లు తేడా… అంటే ఆ సంవత్సరాలు వీళ్లు వేరేవాళ్లపై ఆధారపడాల్సి వస్తోంది… ఇదుగో, ఈ తేడాను తగ్గించడం, అంటే సగటు ఆరోగ్యవంతమైన ఆయుష్షును పెంచడమే డాక్టర్ వాడా పుస్తకం ఉద్దేశం, సారాంశం, సంకల్పం…
ఈ డాక్టర్ ఉద్దేశంలో… వృద్ధులు నిద్రలేమితో తరచూ స్లీపింగ్ పిల్స్‌ను ఆశ్రయించొద్దు… ఎందుకంటే, సహజంగానే వృద్ధాప్యంలో నిద్రవ్యవధి తక్కువ… ఎవడూ నిద్రలేమిటో మరణించడు… 24 గంటలూ ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు లేవొచ్చు, ఆ సౌలభ్యం ఉన్నది వృద్ధులకు మాత్రమే… ప్రివిలేజ్…
కొలెస్టరాల్ పెరిగిపోయిందనీ బాగా ఆందోళన చెందవద్దు, ఓ నిర్ణీత పరిమితి దాటినా సరే మరీ చింతించొద్దు, ఎందుకంటే మానవశరీరం ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తి చేయాలంటే కొలెస్టరాల్ కావాలి… ఈ సెల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే వృద్ధుల్లో కేన్సర్ వచ్చే ప్రమాదం అంత తక్కువ… అంతేకాదు, పురుష హార్మోన్లకూ అదే కావాలి… అసలు కొలెస్టరాల్ తక్కువ ఉంటేనే వృద్ధుల్లో ఫిజికల్, మెంటల్ హెల్త్ ఒడిదొడుకులకు గురవుతుంది…
సేమ్, బీపీ పెరుగుతుందని ఒకటే చింతించకండి… 50 ఏళ్ల క్రితం 150 దాటి బీపీ ఎక్కువగా ఉంటే, అప్పట్లో పౌష్ఠికాహారం తక్కువ కాబట్టి రక్తనాళాలు చిట్లేవి… ఇప్పుడు ఆ ప్రమాదాలు తక్కువ… ఇప్పుడు 200 ఉన్నవాళ్లు కూడా ప్రమాదరహితంగా బతికేస్తూనే ఉన్నారు… న్యూట్రిషన్ లెవల్స్ ఎక్కువ కాబట్టి… (కొలెస్టరాల్, బీపీలపై డాక్టర్ అభిప్రాయాలతో చాలామంది డాక్టర్లు విభేదిస్తారు…)
డాక్టర్ వాడా ఆ పుస్తకంలోని అంశాలన్నీ క్రోడీకరించి 44 వాక్యాలుగా చెప్పాడు… అఫ్ కోర్స్, చాలామంది వ్యతిరేకించొచ్చు, విభేదించొచ్చు… కానీ కొన్ని మాత్రం అందరూ ఏకీభవిస్తారు…
- వాకింగ్ ఆపకండి, అది మీకు తల్లి వంటిది…
- స్థిమితంగా లేనట్టు అనిపిస్తే శ్వాస లోతుగా తీసుకుంటూ ఉండండి కాసేపు…
- ఓపిక, సత్తువ ఉన్నంతమేరకు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండండి…
- వేసవిలో ఏసీలు బాగా వాడుతున్నవేళ నీళ్లు ఎక్కువ తాగండి…
- ఎటంటే అటు ఎంత సేపైనా వెళ్లడానికి డైపర్స్ వాడితే సౌకర్యం…
- ఎంత ఎక్కువ నమిలితే (ఫుడ్) అది దేహానికీ, బుర్రకూ మంచిది…
- మెమొరీ లాస్ అనేది ఏజ్ వల్లే కాదు… బ్రెయిన్ తరచూ వాడక పోవడం వల్ల కూడా…
- ప్రతి చిన్న సమస్యకూ, ఎక్కువ మెడిసిన్స్ ఎప్పుడూ మంచివి కావు…
- బీపీ, సుగర్ లెవల్స్ తగ్గించడానికి సీరియస్ వార్ ఫుట్ బేసిస్ ఎఫర్ట్స్ వద్దు…
- ఒక్కరే ఉన్నారంటే అది ఒంటరితనం కాదు, రిలాక్స్ అవుతూ టైమ్ ఎంజాయ్ చేయడం…
- బద్ధకంగా ఉండటం, పనిలేకుండా ఉండటం ఈ వయస్సులో సిగ్గుపడే అంశమేమీ కాదు…
- డ్రైవర్ లైసెన్స్ కోసం డబ్బు చెల్లించకండి… (వృద్ధాప్యంలో డ్రైవింగ్ రిస్కే)…
- ఇష్టమైన పనే చేయండి, అసహ్యించుకునే వాటి జోలికి అస్సలు వెళ్లకండి…
- ముసలోళ్లయితేనేం, లైంగిక వాంఛలు ఉండటంలో తప్పేమీ లేదు…
- ఎప్పుడూ ఇంటికే అంటిపెట్టుకుని బతక్కండి…
- మరీ ఫుడ్ మీద రిస్ట్రిక్షన్స్ వద్దు, కాస్త బొద్దుగా ఉన్నా పర్లేదు…
- కానీ ఏ పనిచేసినా కాస్త ఆచితూచి జాగ్రత్తగా చేయడం మేలు…
- మీరెప్పుడూ విభేదించేవాళ్ల జోలికి అస్సలు వెళ్లకండి ఇక…
- ఎప్పుడూ టీవీ చూస్తూ కూర్చోకండి…
- కొన్ని వ్యాధుల మీద పోరాటంకన్నా సహజీవనమే బెటర్…
- కారు పర్వతశిఖరం మీదకు చేరాక ఏదో ఒక మార్గం ఉంటుంది…
- మాంసం వద్దనొద్దు… ప్రత్యేకించి చౌక రెడ్ మీట్…
- పది నిమిషాల్లో స్నానాన్ని ముగించండి…
- నిద్ర కోసం నిర్బంధ ప్రయత్నాలు వద్దు…
- సంతోషకరమైన పనులతో బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది…
- ప్రతి దానికీ ఆందోళన వద్దు, చెప్పాలనుకున్నవి దాచుకోకండి…
- తప్పనిసరిగా ఓ ఫ్యామిలీ డాక్టర్ అవసరం, వెతుక్కొండి…
- టూమచ్ ఓపిక అక్కర్లేదు, ‘చెడ్డ ముసలోడు’ ముద్ర పడ్డా పర్లేదు…
- మాట మార్చడం, స్టాండ్ మార్చుకోవడం తప్పు లేదు…
- డైమెన్షియా అనేది చివరి దశలో దేవుడిచ్చిన వరమే…
- ఇంకా ఏదేదో కొత్తది నేర్చుకోవాలనే తాపత్రయం అక్కర్లేదు…
- ఇంకా ఏదో కావాలనే కోరికలూ వద్దు, ఉన్నవి చాలు…
- తెలియనితనం అనేది వృద్యాప్యంలోని ప్రివిలేజ్…
- ఎక్కువ ఆసక్తి చూపేవి, ఎప్పుడూ ఎక్కువ సమస్యాత్మకాలు…
- సన్ బాత్ ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ…
- ఇతరులకు మంచి చేసే పనులు మన మానసికారోగ్యానికీ మేలు…
- ఈరోజంతా నాకు తీరికే… రోజూ ఇలాగే గడపండి…
- ఎక్కువ రోజులు బతకాలనే కోరిక కూడా ఆయుష్షును పెంచుతుంది…
- ఎప్పుడూ ఆశావాదాన్ని విడనాడవద్దు…
- బరువుగా కాదు, తేలికగా శ్వాస తీసుకొండి…
- మన జీవననియమాలు మన చేతుల్లోనే ఉన్నాయి…
- మనకు దక్కే దేన్నయినా యాక్సెప్ట్ చేయాల్సిందే…
- ఎప్పుడూ ఉల్లాసంగా ఉండండి, అదే మన గ్లామర్…
- చిరునవ్వు మన సంపద, మన అదృష్టం, మన ఆయుష్షు…
ఇవన్నీ జపాన్ వాళ్లకు ఉద్దేశించినవి, పైగా ఒక సైకియాట్రిస్టు సొంత అభిప్రాయాలు… అందరూ ఔననాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి ఇండియన్స్, చైనీస్ గట్రా ఆమోదించాలని అస్సలు లేదు… ఇవన్నీ పాటిస్తే వచ్చేదేమీ లేదనొద్దు… కోల్పోయేది కూడా ఏమీ లేదు…!! (ప్రభాకర్ జైనీ వాల్ మీద కనిపించిన ఇంగ్లిషు పోస్టుకు నా తెలుగు స్వేచ్ఛానువాదం…)
Share this Article