82 రోజులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు ఆ సివిల్ సర్వెంట్.. చివరకు సస్పెండయ్యాడు!
తన కింద ఉద్యోగస్వామ్యాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వాడు.. కానీ, తానే ప్రభుత్వానికి చెప్పాపెట్టకుండా ఏకంగా 82 రోజులు కనిపించకుండా పోయాడు. విధులకు డుమ్మా కొట్టాడు. అతను ఏ సెక్యూరిటీ గార్డో.. లేక, క్లర్క్ పోస్ట్ లో ఉన్నవాడో కాదు.. ఏకంగా తన దగ్గర పనిచేసే వారందరినీ పట్టి నడిపించాల్సిన ఐఏఎస్. అంత రెక్లెస్ అయిన ఆ ఐఏఎస్ ఎవరు..?
అభిషేక్ సింగ్.. యూపీ కేడర్ కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కనీసం సమాచారం కూడా తన హై అఫీషియల్స్ కు ఇవ్వకుండానే.. విధులకు డుమ్మా కొట్టిన సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. అభిషేక్ సింగ్ బాధ్యతారాహిత్యానికి 2023, ఫిబ్రవరిలోనే సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు తన రాజీనామానూ కేంద్రం ఆమోదించింది. గత ఏడాది నవంబర్ లో గుజరాత్ ఎన్నికల సమయంలో అభిషేక్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు కూడా వివాదాస్పదంగా మారగా.. అప్పుడూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెండయ్యాడు అభిషేక్.
Ads
అయితే, మొట్టమొదటి ప్రయత్నంలోనే అభిషేక్ యూపీఎస్సీ సాధించిన ఐఏఎస్ గా గుర్తింపు పొందాడు. కానీ, నేను డాక్టర్ కావాలనుకుని యాక్టరనయ్యాననుకునేవారిని చూస్తామే… అలాంటి ఆశలే అభిషేక్ ప్రవర్తనకు లోపాలుగా మారాయి. అభిషేక్ యాక్టర్ కావాలనుకుని ఐఏఎస్ అయినవాడు. చిన్నప్పట్నుంచీ నటన అంటే ఉన్న ఆసక్తితో… ఓవైపు చదువుల్లో రాణిస్తున్నా.. సినిమాలు, టీవీ, నాటక ప్రపంచంపైనే దృష్టి.
అయితే, ట్విస్ట్ ఏంటంటే… ఇప్పుడు ఏకంగా ఈ ఐఏఎస్ దృష్టి మళ్లీ రాజకీయాల వైపు మళ్లింది. జాన్ పూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ కోసం యత్నిస్తున్న అభిషేక్.. బీజేపీ టిక్కెటైతే బెటరని భావిస్తున్నారట. మొదట్లో నటుడు కావాలన్న తపన మెండుగా కల్గిన అభిషేక్.. ఇప్పుడు సినిమా ప్రపంచంలోకీ ప్రవేశించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఊపులూపిన ఢిల్లీ క్రైమ్ లోనూ తన పాత్రతో గుర్తింపు పొందాడు అభిషేక్. అంతేనా, చార్ పంద్రా, దిల్ తోడ్ కే వంటి షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించిన అభిషేక్.. సన్నీలియోన్ తో కలిసి థర్డ్ పార్టీలోనూ మెరిశాడు. అదే సన్నీలియోన్ తో వారణాసిలో గంగాహారతికి హాజరై కూడా అందరినీ ఆశ్చర్యపర్చాడు.
ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ కు చెందిన అభిషేక్ జర్నీ కాస్తా విచిత్రంగానే సాగింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ సాధించిన అధికారిగా.. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా… ఆఫీసర్ గా ఉండి 82 రోజుల పాటు కనీసం ఎవ్వరికీ సమాచారమివ్వకుండా వెళ్లిపోయే విషయంలోనూ.. యాక్టర్ కావాలనుకుని ఐఏఎస్ అయి.. తన ప్రవర్తనతో సస్పెండై.. మళ్లీ సినిమాలు, వెబ్ సీరీస్ అంటూ తిరుగుతున్న అభిషేక్ భార్య కూడా ఐఏఎస్ ఆఫీసరే కావడం మరో విశేషం.
అభిషేక్ భార్య దుర్గా శక్తి నాగ్ పాల్ ది చత్తీస్ గడ్. ఆమె ప్రస్తుతం యూపీలోని బాందా జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తుండగా.. బీటెక్ చదివిన ఆమె యూపీఎస్సీలో 20వ ర్యాంక్ సాధించిన టాపర్. అభిషేక్ దీ అదేస్థాయి తెలివితేటలే అయినా.. బాధ్యతారాహిత్యంతో ఓవైపు.. నటుడిగా మరోవైపు అభిషేక్ అనే ఐఏఎస్ జర్నీ ఒకింత వివాదం.. మరింత ఆసక్తికరం…… By, రమణ కొంటికర్ల
Share this Article