ఎవరో సరయు అట… ఆమె గురించి పెద్దగా తెలియదు… కానీ బోల్డ్‌గా, పచ్చిబూతులతో యూట్యూబ్‌లో రసిక ప్రేక్షకులను అలరిస్తుందని గూగుల్‌లో సెర్చితో ఎవడో సైటు వాడు చెప్పాడు… సరయు రాయ్… తండ్రి బెంగాలీ, తల్లి తెలుగు… నోరు విప్పితే బూతులు… పైగా తెలంగాణ యాక్సెంట్లో వెకిలిగా మాటలు… వామ్మో… డుగ్గు డుగ్గు హ్యాంగోవర్ నుంచి తెలంగాణ యాస ప్రేమికులందరినీ ఒక్కసారిగా నేలమీదకు దింపింది ఈ వెగటు కేరక్టర్ బిగ్‌బాస్ లాంచింగ్ చూడగానే… 19 మంది కంటెస్టంట్లలో ఈ భారీ పరువసుందరి కూడా ఉంది… నాగార్జున భలే సిగ్గులేకుండా అడిగాడు, ధంధం చేస్తవట కదా అని… ఈ ధంధం అంటే ఏమీ లేదు… దేహప్రదర్శనతో వెగటు భాషతో రెచ్చిపోవడం అట… మింగెయ్, మింగుతవా, మింగుడే… వంటి పదాలు స్వేచ్ఛగా వాడేసింది వేదిక మీదే… (ఈ పదాలకు అసలు అర్థాలు తెలుసు కదా…) ఎలాగూ ఈ తెలుగు బిగ్‌బాస్ అంటేనే ఓ పరమదరిద్రమైన టేస్ట్, క్రియేటివిటీ… ఈ మింగుడు మార్మిక భాష దేనికిరా..? ఫర్ అడల్ట్స్ ఓన్లీ అని ప్రకటించి, నేరుగా ఓ బూతు షో ప్రసారం చేస్తే అయిపోయేది కదా… ఎలాగూ రాత్రి పది గంటలకే కాబట్టి మిడ్ నైట్ మసాలా టైపులో చూసేవాళ్లు చూస్తారు… నాగార్జున అద్భుత అభిరుచిని మెచ్చుకుంటూ…!! థూ మీ బ చె… ఎటొచ్చీ ఆమె నోటివెంట ఆ మసాలా భాషతోపాటు తెలంగాణ పదాల్ని వింటుంటే ఓ గగుర్పాటు…
బిగ్‌బాస్-5… మూడుగంటలకు పైగా సాగిన లాంచింగ్ ఎంత నరకమో చెప్పేందుకు ఆ ఒక్క ఉదాహరణ చాలు కదా… అంతా బోల్డ్ అండ్ బ్యూటీల్నే ఎన్నుకున్నాడు బిగ్‌బాస్… లాంచింగే ఇలా మింగి విడిచిపెట్టాడంటే (ఛీ, మనకూ అదే భాష వస్తోంది… ఖర్మ) ఈసారి మాటీవీ వాడి దిక్కుమాలిన క్రియేటివ్ టీం రాను రాను ఇంకెంత కలాపోసన చేయబోతోందో… అంతకుముందు ఎవడైనా ఎలిమినేట్ అయిపోతే, ఎవడో ఇంట్లో చచ్చినట్టుగా శోకాలు పెట్టుకుని ఏడ్చి, శ్రీముఖి, సాఫిత్రి, మోనాల్ తదితరులు బిగ్‌బాస్ షో మీదే వైరాగ్యం పుట్టించారు… క్రియేటెడ్ లవ్ వ్యవహారాలు, పైగా త్రికోణాలు, ప్రేమాయణాలు గట్రా పరిమిత మోతాదులోనే సాగింది నాలుగో సీజన్లో… సరయు తంతు చూడబోతే ఇక ఈ ఫిఫ్త్ సీజన్ ఇంకాస్త శృతిమించబోతోంది అని లెక్క…
Ads
- చూడాలనిపిస్తే టీవీలో చూడండి లేకపోతే చూడకండి, వీసమెత్తు నష్టం లేదు… కానీ హాట్‌స్టార్‌లో మాత్రం చూడకండి… అదొక నరకం… మరీ ఎంత దరిద్రం అంటే, ఆ యాడ్స్ చూస్తే జీవితం మీదే విరక్తి ఖాయం… ఉదాహరణ కావాలా..? మాటీవీలో వచ్చే జానకికలగనలేదు అనే ఓ నాసిరకం సీరియల్ ప్రోమోల్ని ఓచోట వరుసగా ఆరేడుసార్లు కుమ్మేశాడు… ప్రేక్షకులంటేనే వాడికి అంత విపరీతమైన కక్ష…
- గాయకుడు శ్రీరామచంద్రను చూస్తే జాలేసింది పాపం… 9 భాషల్లో 500 వరకూ పాటలు పాడిన ఈ ఇండియన్ ఐడల్ విజేత చివరకు ఈ మందలోకి వచ్చి పడ్డాడు… గతంలో సింగర్ కల్పనను చూస్తే కూడా ఇలాగే జాలేసింది… ఆమెలాగే నాలుగు డబ్బుల కోసం ఈ షో ఒప్పుకుని ఉంటాడు శ్రీరామచంద్ర… ఎందుకోగానీ యానీ మాస్టర్ కూడా ఈ మందలో ఫిట్ అవుతుందని అనిపించడం లేదు…
- శ్రీముఖికి ఈ టీవీషో టీం ముఖ్యులు ఒకరిద్దరు దోస్తులట… తన ద్వారా యాంకర్ రవి ‘ప్రాబబుల్ విజేత’గానే ముందే ఫిక్స్ చేసుకుని మరీ హౌజులోకి వచ్చాడట… రవి ఓవరాక్షన్ మొదటి రోజు నుంచే కనిపిస్తోంది… కానీ ఆ భ్రమల్లో బతికితే వేస్ట్ రవీ… బిగ్‌బాస్ అంటేనే పెద్ద డ్రామా… ఫేక్… నీలాంటోళ్లను చాలామంది చూసింది అది… అంతెందుకు గీతామాధురి, శ్రీముఖి వంటి వాళ్లు చివరకు కళ్లు తేలవేసి, నోళ్లు వెల్లబెట్టారు తెలుసు కదా…
- మరొక పైత్యం ఏమిటంటే… కొందరు కంటెస్టెంట్ల ఏవీల్లో ఏదో కవిత్వం ప్రవహించింది… ఏదో గంభీరంగా, గొప్పగా, మార్మికంగా చెబుతున్నట్టు స్క్రిప్ట్ రైటర్ అనుకుని ఉంటాడు… కానీ పక్కా అబ్సర్డిటీ… పైగా కంటెస్టెంట్లందరికీ కచ్చితంగా డాన్సులు అనే గెంతులు వేయడం తెలియాలి అన్నట్టుగా ఆ పరిచయ ఏవీలతో చంపిన తరువాత కూడా మళ్లీ ఆ కంటెస్టెంట్లతో పిచ్చిగెంతులు వేయించారు… పరమ వికారంగా ఉన్నయ్ ఆ గ్రూప్ డాన్సులు… క్వారంటైన్ పీరియడ్‌లో ఇవే నేర్పించి ఉంటారు వాళ్లకు… ఇక నటరాజ్ మాస్టర్ అట, ఆయన ఎవరో గానీ అయితే తెగవిసిగించేశాడు తన పాటతో…
- ప్రతిసారీ యూట్యూబర్లు, సోషల్ మీడియా స్టార్స్, జర్నలిస్టులు, సింగర్స్, డాన్సర్స్, మోడల్స్ గట్రా రకరకాల రంగాలకు చెందినవాళ్లను తెచ్చిపెట్టేవాళ్లు, ఈసారి కూడా అలాగే వెరయిటీ మిక్సింగ్ అనుకున్నారు గానీ కుదరలేదు, ఎక్కువగా నటీనటులే ఉన్నారు… కాస్త కామెడీ టచ్ కోసం లోబో ఉపయోగపడతాడు, ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నట్టుంది… (ప్రియాంక..?)
- గమనించారో లేదో… ఈసారి కంటెస్టెంట్ల జాబితా గురించి గానీ, లాంచింగ్ మీద గానీ పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు… ఆ హైప్ కూడా లేదు… కారణం, మూడు నాలుగు సీజన్లలో ఈ తెలుగు బిగ్‌బాస్ క్రియేటివ్ టీం ప్రదర్శించిన పైత్యమే… ఆ పాత ధోరణుల్ని బట్టి, ఆల్రెడీ లాంచింగ్ రోజు చూపించిన శాంపిల్ క్వాలిటీని బట్టి… పైత్యప్రదర్శన ఈసారి ఇంకాస్త డోస్ పెరిగే సూచనలే కనిపిస్తున్నయ్…!!
Share this Article