….. By……. పార్ధసారధి పోట్లూరి……. రెండు అగ్ర రాజ్యాల భద్రతా సలహాదారులు భారత దేశ భద్రతా సలహాదారు ని కలిశారు ఒకే రోజు తేడాతో ! అమెరికన్ భద్రతా సలహాదారు,రష్యన్ సలహాదారు భారత భద్రతా సలహాదారుని కలిశారు అంటే భారత దేశానికి ప్రాముఖ్యం ఇస్తున్నట్లా ? లేదా భారత్ రష్యా వైపో లేదా అమెరికా వైపో మొగ్గు చూపుకుండా ఆపె చర్యలో భాగమా ? అమెరికన్ CIA చీఫ్ విలియం బర్న్స్ [William Burns] మంగళవారం న్యూ ఢిల్లీ వచ్చి భారత జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారిని కలిశారు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల మీద చర్చ జరిగింది కానీ వివరాలు పెద్దగా బయటికి రాలేదు. గత అయిదేళ్ళలో భారత గూఢచార సంస్థ ‘RAW’ తన నెట్వర్క్ ని ఆఫ్ఘన్ నలు దిశలా నెలకొల్పింది. అయితే ముఖ్యమయిన సమాచారాన్ని CIA తో కలిసి పంచుకుంది RAW. కొన్ని ప్రాజెక్టులు CIA, RAW లు కలిసి సంయుక్తంగా నడిపాయి గత అయిదేళ్లలో…. నిజానికి ఏదన్నా ఉంటే ఫోన్ లో [Secured Line ] మాట్లాడుకోవచ్చు కానీ న్యూ ఢిల్లీ దాకా CIA చీఫ్ రావడం వెనుక అసలు కధ వేరే ఉంది కానీ కేవలం ఆఫ్ఘన్ లో తాలిబన్లు ప్రకటించిన ప్రభుత్వ మంత్రుల వివరాల మీద చర్చించడానికి వచ్చినట్లు బిల్డ్అప్ ఇచ్చారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో FBI హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం మంత్రి పదవులలో ఉండడం పెద్దగా ఆశ్చర్యపరిచే విషయం కాదు అటు CIA, FBI లకి అయినా భారత ప్రభుత్వానికి అయినా…
1. గత 20 ఏళ్లలో అమెరికన్ CIA కి ఇటు భారత RAW కి సహకరించిన ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులు , ప్రజలు, డాక్టర్లు, ఇంజినీర్ల డాటా తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. CIA చీఫ్ న్యూ ఢిల్లీ రాక కి కారణం ఇదే.
2. సౌత్ చైనా సముద్రం మీద పట్టు కోసం తహ తహ లాడుతున్న అమెరికా మారిటైమ్ [సముద్ర మీద ] ఇంటెలిజెన్స్ ని పంచుకొని వ్యూహ రచనకి ముసాయిదా సిద్ధం చేసుకొని వెళ్ళడానికి.
Ads
3. CIA చీఫ్ న్యూ ఢిల్లీలో ఉన్నప్పుడే అమెరికన్ నావీకి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ USS బెన్ఫోల్డ్ [The guided-missile destroyer USS Benfold] సౌత్ చైనా సీ లో చైనా కొత్తగా నిర్మించిన ఎయిర్ బేస్ [SPARTLY ISLANDS] కి దగ్గరలో ఉన్న మీస్చీఫ్ రీఫ్స్ [Mischief Reef] కి దగ్గరగా ప్రయాణించడం మీద తీవ్ర అభ్యంతరం తెలిపింది చైనా. CIA చీఫ్ న్యూ ఢిల్లీ పర్యటనకి వచ్చినప్పుడే ఈ ఘటన జరగడం మీద అనేక అనుమాలు ఉన్నాయి. మరో పక్క అదే సమయంలో సౌత్ చైనా సముద్రంలోని తన ఎయిర్ బేస్ ని అప్రమత్తం చేసిన చైనా తన జెట్ ఫైటర్స్ తో గాల్లో విన్యాసాలు జరిపింది. ఇది పరోక్షంగా తమ జలాలలోకి US నావీ ప్రవేశించడం మీద తీసుకున్న చర్య మాత్రమే. అజిత్ దోవల్ తో సమావేశం ముగియగానే విలియం అటునుండి అటే ఇస్లామాబాద్ వెళ్ళిపోయాడు. ఎందుకు ?
4. అదే రోజున రష్యన్ NSA నికోలాయ్ పట్రుషేవ్ [Nikolay Patrushev] అజిత్ దోవల్ గారితో సమావేశం అయ్యారు. ఇదో పనికిమాలిన వ్యవహారం .. ఎందుకంటే మూడు వారాల క్రితం రష్యా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ‘TROIKA’ [మూడు దేశాల కూటమి ] ఎటూ కాకుండా పోయింది. అటు అమెరికా కానీ , ఇటు పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ లు కానీ రష్యా అనేది ఒకటుంది అనే విషయం లెక్కలోకి తీసుకోలేదు సరికదా అసలు ఏం జరగబోతున్నదో అనే విషయం కూడా రష్యాకి ఏమాత్రం తెలియకుండా ఆట నడిపించింది చైనా. దాంతో గతి లేని స్థితిలో మళ్ళీ భారత్ పంచన చేరి మంతనాలు చేస్తున్నది. ఇది టీ, కాఫీల సమావేశం తప్పితే రష్యా ఏ మాత్రం ధైర్యం చేసే స్థితిలో లేదు. అత్యవసరం అయితే భారత్ అన్నా సర్జికల్ స్ట్రైక్ చేస్తుందేమో కానీ రష్యా అంత ధైర్యం చేయలేదు. కానీ ఏదో వార్త చెరవేయడానికే అని అనుకోవాలి. పేరుకి సమావేశం తరువాత ఆఫ్ఘన్ నుండి డ్రగ్స్ రవాణా మీద ఎలాంటి చర్య తీసుకోవాలో చర్చ జరిగింది. అఫ్కోర్స్ తాలిబాన్ల ప్రధాన ఆదాయ వనరు అయిన ఓపియం అక్రమ రవాణా మీద దృష్టి పెడితే మాత్రం అంతో కొంత ఫలితం ఉంటుంది అనడంలో సందేహం లేదు.
5. అయితే భారత్ ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల వద్ద ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని వాటి మీద వైమానిక దాడులు చేయవచ్చనే ముందస్తు చర్యగా ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద ఉన్న ఇప్పటివరకు చేతనంగా ఉంచిన అన్నీ ఎయిర్ బేస్ లని మళ్ళీ యాక్టివేట్ చేసింది. రష్యన్ NSA భారత్ రాకముందే ఒక రోజు ముందు పాకిస్థాన్ ఎయిర్ బేస్ లని యాక్టివేట్ చేయడం అనేది ఖర్చుతో కూడిన పని అది కానీ యాక్టివేట్ చేసింది అంటే సమాచారం మన వైపు నుండి లీక్ అయ్యిందా ?
6. ఇప్పటివరకు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ రెండూ కూడా ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నిశ్శబ్దంగా జరిగినవే కాబట్టి ఎందుకయినా మంచిది అని ముందు జాగ్రత్తగా పాకిస్థాన్ తీసుకున్న చర్య అనుకోవాలా ? ప్రస్తుతం రష్యా NSA అజిత్ దోవల్ సమావేశం పంజషీర్ కి ఎయిర్ సపోర్ట్ విషయం కూడా ప్రస్తావనకి వచ్చి ఉండవచ్చు… అదే జరిగితే ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్ ఎయిర్ బేస్ లు పంజ్ షీర్ కి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తాలిబాన్ల కి సహాయంగా ఉంటుంది అనే రెండో ఉద్దేశ్యం కూడా నిజం కావొచ్చు. నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్ జెట్ ఫైటర్స్ , ఎటాక్ హెలికాప్టర్స్ తాలిబాన్ల కి మద్దతుగా పంజ్ షీర్ మీద దాడి చేశాయి.
ఏదయినా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎవరి వ్యూహాలు వారివే ! ఎవరూ ఎవరినీ నమ్మడానికి వీలులేని స్థితి. న్యూఢిల్లీలో రహస్య మంతనాలు చేసి CIA విలియమ్స్ నేరుగా ఇస్లామాబాద్ వెళ్ళడం మీద డబుల్ గేమ్ ఆలోచన రాకుండా ఆపలేదు. అన్నీ విని, చూసి భారత్ తన నిర్ణయం తాను తీసుకోవడమే ఉత్తమం! ఈ సమయంలో అజిత్ దోవల్ గారు తీసుకునే చర్య చాలా కీలకం అవుతుంది… అందుకే ఒకేసారి రెండు అగ్రరాజ్య ప్రతినిధుల మంతనాల కోసం న్యూఢిల్లీ వచ్చింది ! పరిస్థితులు తమకి ఎదురు తిరుగున్న కొద్దీ భారత్ వైపు చూపులు చూడడం అనేది ఉంది చూశారూ అది పెద్ద మార్పు ! ‘శక్తి ఉన్న చోట తేజస్సు ఉండడం ప్రకృతి సహజం ‘…
Share this Article