తెలుగు టీవీల్లో బాహుబలి ప్రసారం చేసినంతగా మరే సినిమాను ప్రసారం చేయలేదేమో… ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎన్నిసార్లు వేస్తున్నా సరే, టీఆర్పీలు వస్తూనే ఉన్నయ్, జనం చూస్తూనే ఉన్నారు… అలాగే ఖలేజా, అతడు సినిమాలు కూడా ఎన్నిసార్లు వేశారో ఆ టీవీ వాళ్లకే తెలియదు… ఐనా టీఆర్పీలు వస్తూనే ఉంటయ్… తెలుగు సినిమా చరిత్రలో అనేక రికార్డులపరంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా రెండో స్థానంలో నిలుస్తుంది బాహుబలి తరువాత… కలెక్షన్లు కొల్లగొట్టింది.., పాటల వీడియోలకు యూట్యూబ్ పాపులారిటీ మునుపెన్నడూ ఏ తెలుగు సినిమా పాటలకూ రానంత..! అది ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడో పెట్టేశారు… మొదటిసారి జెమిని టీవీలో వేసినప్పుడు కూడా అన్ని తెలుగు సినిమాలను మించిన టీఆర్పీ సాధించి రికార్డులన్నీ బ్రేక్ చేసింది… మరి ఇప్పుడు..?
ఇప్పుడు కూడా అంతే… గత వారం (29 ఆగస్టు, ఆదివారం) జెమిని టీవీలో మంచి ప్రైమ్ టైమ్‌లో వేశారు… మళ్లీ రేటింగ్స్ దున్నేసుకుంది సినిమా… ఒక్క హైదరాబాద్ బార్క్ పరిధిలోనే 9.63 రేటింగ్స్ కొట్టేసింది… ఓవరాల్ రేటింగ్స్ బహుశా 12, 13 దాటి ఉంటయ్… ఓ సగటు సినిమాతో పోలిస్తే రెండుమూడు సినిమాలు సంపాదించే రేటింగ్స్ ఒకేసారి సంపాదించినట్టు… పైగా ఇదేమీ తొలిసారి ప్రసారం కాదు… రిపీటెడ్ ప్రసారాలకు కూడా ఈ రేంజ్ రేటింగ్స్ రావడం అంటే మజాక్ ఏమీ కాదు, ప్రేక్షకులు సినిమాను బలంగా ఆదరించారని చెప్పటానికి, రిపీటెడ్‌గా కూడా చూడటానికి ఇష్టపడుతున్నారని చెప్పడానికి సూచిక… ఇది అల్లు అర్జున్‌కు అత్యంత భారీ విజయం కాగా, పాత పరాజయాల నుంచి త్రివిక్రమ్‌ను మళ్లీ తలెత్తుకునేలా చేసింది… అందులోని సామజవరగమనా పాటకు సంబంధించి టేస్టున్న శ్రోతలు సిరివెన్నెల సీతారామశాస్త్రిని పెద్ద ఎత్తున వెక్కిరించారు… అయితే ఏముందిలే… పూజా హెగ్డే తొడలు, కాళ్లు కూడా రేటింగ్స్, కలెక్షన్స్ సంపాదిస్తున్నాయా లేదా..?!
Ads
Share this Article