ఒక స్కీం… అది వోట్ల కోసం కేసీయార్ ఆలోచించిన స్కీమే… అదీ ఆయనే చెప్పుకున్నాడు… దళితబంధు పేరిట ఒక్కో ఎస్సీ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను, ఎలాగైనా ఖర్చుపెట్టుకో అంటున్నాడు కేసీయార్… జస్ట్, పైలట్ ప్రాజెక్ట్ పేరిట కేవలం ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లో మాత్రమే ప్రారంభిస్తాడు… మళ్లీ మాట మార్చి వాసాలమర్రిలో స్టార్ట్ చేస్తాడు… ఆయన మదికి ఏది తోస్తే అదే స్కీం… ఇది దేశంలోనే సీఎంలందరి కళ్లూ తెరిపించే స్కీం, ప్రపంచానికే మార్గదర్శకం అనే దాకా వెళ్లిపోయింది టీఆర్ఎస్ కేడర్ దీని ప్రచారానికి…! అసలు నిజమేమిటో పొలిటికల్ పార్టీలకు తెలుసు, కానీ బాహాటంగా వ్యతిరేకించలేరు, సెన్సిటివ్, కేసీయార్ తమను ఫిక్స్ చేస్తున్నాడని తెలుసు… బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు తిరగబడి, టీఆర్ఎస్ మీద బాగా వ్యతిరేకతను పెంచుకుంటున్నారనీ తెలుసు… కానీ మాట్లాడలేరు… అలాంటప్పుడు ఆ స్కీం అమలు ఏమిటో, ఆ మార్గదర్శకాలు ఏమిటో, ఫీల్డులో ఏం జరుగుతుందో ఓ నిఘా వేసి ఉంచాలి కదా… కేసీయార్ ఆలోచనల్లోని రాజకీయ స్వార్థం ఏమిటో బయటిపెట్టే ఆధారాల కోసం అన్వేషించాలి కదా… చేతకాలేదు… ఎంతసేపూ భాగ్యలక్ష్మి గుడి భాష ఒకరిది… ప్రగతిభవన్ కూలగొడతాం అనే భాష ఇంకొకరిది… ఫామ్ హౌజ్ స్వాధీనం, దళితులకు పంపిణీ అనే భాష మరొకరిది… కానీ ఈ వార్త చూడండి…
నిజానికి విస్తుపోవాల్సిన వార్త… కాషాయ వెలుగులో ప్రభవించిన వార్త… దళితుల ఖాతాల్లో డబ్బు వేసినట్టే వేసి, ఫ్రీజ్ చేసి, ఒక్క పైసా వాడకుండా చేసి, ఇప్పటికీ ఆ మార్గదర్శకాలు ఏమిటో ఎవరికీ తెలియకుండా చేసి, చివరకు వేసిన డబ్బును కూడా వాపస్ తీసుకుంటున్నారు అనే వార్త… లబ్ధిదారుల వెర్షన్, ఒకటిరెండు ఆధారాలు ఇచ్చారు… నిజానికి బ్లాస్టింగ్… రేవంతుడికీ, సంజయుడికీ దీని పొలిటికల్ ఇంపార్టెన్స్ మీద ఇంకా దృష్టి పడినట్టు లేదు… వార్తలో నిజానిజాలేమిటి అనేది కాదు, ఆ స్కీం ఏమిటో చివరకు ఆ లబ్ధిదారులకే అర్థం కావడం లేదు, గందరగోళంలో పడిపోయారు అనేది ఈ వార్తలో ముఖ్యాంశం… అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై, కేసీయార్ అహానికి, ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ధ్యాసలో ఉన్న ఈటలకు అసలు దళితబంధు అమలు మీద నిఘా వేయాలీ, నిజాలు బయటికి తీయాలి, జనానికి చెప్పాలి అనే సోయి కూడా లేనట్టుంది… ఎందుకంటే..? ఈటలపై కేసీయార్ చాలా ఆశలు పెట్టుకుని ప్రయోగించిన అస్త్రం అది… తనెలాగూ భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా అమలు చేస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు, బీసీల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత కారణంగా అన్ని కులాలకూ వర్తింపజేస్తామనే లీకులు తప్ప కేసీయార్‌కే దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో అర్థం కావడం లేదు… ఈ స్థితిలో నిజానికి ఈ వార్త ఫస్ట్ పేజీలో బొంబాట్ కావాలి… అసలు ప్రతిపక్షాలే నిఘా వేసి, వాళ్లే బయటపెట్టాల్సిన వార్త… ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ కేడర్, సోషల్ దళాలు, నమస్తే దీనికి కౌంటర్లు రచిస్తూ ఉండవచ్చుగాక… అబ్బే, ఈ వార్త అబద్ధం, బీజేపీ వివేక్ కుట్ర అని రంగుపూసి, బురదపూసి రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండవచ్చుగాక… కానీ నిజానికి ఫీల్డులో ఏం జరుగుతోంది..? ఇతర మీడియాకు ఏమైనా సోయి ఉందా..? భలేవారే… ఎంత అత్యాశ… తెలంగాణలో ఒకటీఅరా తప్ప అసలు నిష్పాక్షిక మీడియా ఎక్కడుంది…?! పోనీ, వెలుగు వార్త తప్పు, కుట్ర అని డప్పయినా కొట్టండర్రా…!!
Ads
Share this Article