మొన్నొకరోజు టీవీలో రకరకాల చానెళ్లు ట్యూన్ చేస్తుంటే… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ తగిలింది… కొద్దిసేపే… ఒకామె జూనియర్‌ను తెగపొగిడేస్తోంది… అసలు క్విజ్ షోకన్నా ఈ భజనే ఎక్కువ అనిపించింది… చానెల్ వెంటనే మార్చేలా చేసింది ఖచ్చితంగా షో నిర్వాహకులే..! జూనియర్, సినిమాల్లో అయితే ఏదో ఓ పాటలోనో, రెండుమూడు పంచ్ డైలాగుల్లోనో వంశకీర్తనలు, స్వకుచ స్తుతులు పర్లేదు, కానీ ఇది టీవీ షో, అదీ విజ్ఞానాన్ని పంచాల్సిన షో… ఇక్కడా అదేనా..? జూనియర్ వైఖరి మీద జాలి కూడా వేయలేదు… మంచి ప్రజెంటర్ ఇలా తయారయ్యాడేమిటి అనిపించింది… ఫాఫం, జెమిని టీవీ వాడు భారీగా ఆశలు పెట్టుకున్నాడు కదా, ఈసారి బార్క్ రేటింగుల్లో ఈ షో ఎక్కడుందో చూద్దామని చెక్ చేస్తే షాకింగ్… 4.29… 4.16… 3.77… 3.14… హైదరాబాద్ తాజా బార్క్ రేటింగ్స్ ఇవీ… గతంలో చిరంజీవి చేసిన తప్పే ఇప్పుడు జూనియర్ చేస్తున్నాడు… పోనీలెండి… ఇదే అలా ఉంటే… తమన్నా చేస్తున్న మాస్టర్ చెఫ్ మరీ ఘోరం… అట్టర్ ఫ్లాప్… మాడిపోయిన ఆమ్లెట్టు… శుక్రవారం 8.30 గంటలు, మంచి ప్రైమ్ టైమ్,.. పదో తారీఖు… రేటింగ్ తెలుసా..? 1.96… ఖర్చు పెట్టడం కాదు, దాన్ని వాడుకోవడం తెలియాలి… జెమిని క్రియేటివ్ టీం, మార్కెటింగ్ టీం అట్టర్ ఫెయిల్యూర్…
పోనీ, సినిమాలేమైనా ఈ చానెల్‌ను ఉద్దరిస్తున్నాయా..? అదీ దిక్కులేదు… ఏ1 ఎక్స్‌ప్రెస్ అని మొన్నామధ్య మార్చిలో ఓ సినిమా వచ్చింది కదా… సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ ఎట్సెట్రా ఉన్నారు… దాన్ని మొన్న అయిదో తేదీ, ఆదివారం జెమినిలో ప్రసారం చేశారు… అదీ అంతే… ఫట్… 3.74 దాని రేటింగ్… ఈసారి బార్క్‌లో కొన్ని ఇంట్రస్టింగ్ విశేషాలున్నయ్…
Ads
- రష్మి-సుధీర్ ప్రేమకథ తొమ్మిదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసిన ఊరిలో వినాయకుడు స్పెషల్ షో ఝామ్మని దూసుకుపోయింది… జబర్దస్త్, ఈటీవీ న్యూస్ గట్రా దాటేసి ఏకంగా 9.49 రేటింగ్స్ కొట్టింది… దీనికి పోటీగా స్టార్ మాటీవీ వాడు ఆ ఫ్లాప్ కామెడీ స్టార్స్ గ్యాంగుతో చేయించిన పండుగే పండుగ 7.26 దగ్గర చతికిలపడిపోయింది…
- శ్రీదేవి డ్రామా కంపెనీ పుంజుకోగా, కామెడీ స్టార్స్ ఇక ఇప్పట్లో లేచే పరిస్థితి కనిపించడం లేదు… ఖర్చెక్కువ, రిజల్ట్ తక్కువ…
- జీ వాడు మెల్లిమెల్లిగా రాధమ్మ కూతురును ప్రమోట్ చేస్తున్నాడు… తరువాత నంబర్ వన్ కోడలు… ఇంతకుముందు నంబర్ వన్ (జీ చానెల్ సీరియళ్లలో) ప్లేసులో ఉన్న త్రినయని కిందకు పడిపోయింది… ఇక శ్రీరాం తెగ విసిగించేస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇంకా కిందకు జారిపోయింది… హుందాగా, గంభీరంగా కనిపించడం కూడా ఎలాగో తెలియని శ్రీరాం లీడ్ రోల్ ఏమిటో… తలాతోకా లేని కథనంతో, పాత్రల దిక్కుమాలిన కేరక్టరైజేషన్‌తో ప్రేక్షకుల్ని మరీ వెర్రివాళ్లుగా ట్రీట్ చేస్తున్న ఆ దర్శకుడు ఎవరో…
- అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌కు మాటీవీ వాడు నాలుగున్నర గంటలపాటు కష్టపడితే… 10.12 రేటింగ్స్ వచ్చింది… మస్తు రేటింగ్, సూపర్ అని ఇంకా మాటీవీ వాడు ప్రచారం స్టార్ట్ చేసుకోలేదు ఎందుకో మరి..? ఆ టీవీ రీచ్‌కు ఆ రేటింగ్స్ తక్కువే… ముందే చెప్పుకున్నాం కదా… బిగ్‌బాస్ షో మీద ఈసారి జనంలో పెద్దగా ఇంట్రస్ట్ లేదు అని… కంటెస్టెంట్లలో కూడా కొందరు మరీ జంతువుల్లాగే వ్యవహరిస్తున్నారు…!!
Share this Article