……. By…… పార్ధసారధి పోట్లూరి ………… మొదటిసారిగా ఒక తెలుగువాడి పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది ! ఆ పేరు ‘సుధాకర్ ‘ కాకినాడ వాసి! కొన్ని వేల కోెట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో విజయవాడతో పాటు కాకినాడ పేరు వార్తలలో ఉంటున్నది!
1. అయిదు రోజుల క్రితం గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ కి ఇరాన్ నుండి వచ్చిన రెండు కంటైనర్స్ ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ [DRI] అధికారులు తనిఖీ చేయగా ఆ రెండు కంటైనర్స్ లలో 3,000 కిలోల హెరాయిన్ పట్టుబడ్డది. దీని విలువ 21,000 కోట్ల రూపాయలు. అహ్మదాబాద్ ఫోరెన్సిక్ లాబ్ పరీక్షించగా హై క్వాలిటీ హెరాయిన్ గా తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ కిలో 7 కోట్ల రూపాయలు. పట్టుబడ్డది 3 వేల కిలోలు…
2. ఆ రెండు కంటైనర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ పట్టణం లో ఉన్న హసన్ హుస్సేని [Hassan Husseni Traders ] పేరు మీద ఉన్నాయి. కంటైనర్స్ టాల్కాం పౌడర్ [ఫేస్ పౌడర్ ] సప్లై చేస్తున్నట్లు ఉన్నాయి. రెండు కంటైనర్స్ లలో సెమీ ప్రాసెసేడ్ టాల్కమ్ పౌడర్ పాకెట్స్ ఉన్నాయి, కానీ చాలా లోపలికి వెళ్ళి చూస్తే పౌడర్ పాకెట్స్ కింద హెరాయిన్ పాకెట్స్ ఉన్నాయి. కంటైనర్స్ రెండూ కూడా కాందహార్ నుండి ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకి వచ్చి, అక్కడ నుండి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి వచ్చాయి. ఈ నెల 13 వ తారీఖున కంటైనర్స్ బందర్ అబ్బాస్ పోర్ట్ లో లోడ్ అయ్యాయి.
Ads
3. మనం నిత్యం వాడే ఫేస్ పౌడర్ ముడి పదార్ధం సుద్ద అంటారు. ఈ సుద్ద అనేది కాందహార్ చుట్టుపక్కల దొరుకుతుంది. దీనిని తవ్వి తీసి అక్కడే పలచటి పౌడర్ గా గ్రైండ్ చేసి ఎగుమతి చేస్తారు. అయితే సుద్ద, సున్నం పౌడర్ గనులు తాలిబన్ల తో పాటు IS-K తీవ్రవాదుల చేతుల్లో ఉన్నాయి. గంజాయి ని ప్రాసెస్ చేసి [గంజాయి ని ప్రాసెస్ చేస్తే తెల్లగా అవుతుంది ] హెరాయిన్ గా చేసి వాటిని సుద్ద పౌడర్ [ఇదీ తెల్లగానే ఉంటుంది ] పాకెట్స్ తో కలిపి ఎగుమతి చేస్తారు తాలిబన్లు…
4. 2015 లో అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం సుద్ధ పౌడర్ ని ఎగుమతి చేయడం మీద నిషేధం విధించింది. దాంతో సుద్ధతో పాటు హెరాయిన్ ని ఎగుమతి చేయడం ఆగిపోయింది. తాలిబన్ల ఆదాయం పడిపోయింది. అయితే పాకిస్థాన్ ISI సహకారంతో సరిహద్దులు దాటించి రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రానికి తరలించి, అక్కడ నుండి భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలోకి స్మగుల్ చేస్తున్నది ISI. వచ్చిన ఆదాయంలో సగం ISI కి, మిగిలింది తాలిబన్ల కి వెళుతుంది.
5. ఇప్పుడు కంటైనర్ల లో పట్టుబడ్డ టాల్కం పౌడర్ తో పాటు హెరాయిన్ విజయవాడ అడ్రస్ పేరు మీద డెలివరీ చేయాల్సి ఉంది. M/s ఆషి ట్రేడర్స్ [AASHI TRADERS], గడియారంవారి పేట, సత్యనారాయణ పురం, విజయవాడ పేరు మీద ఉన్నాయి. GST రిజిస్ట్రేషన్ మాత్రం సుధాకర్ మీద ఉంది. అధికారులు ఆషి ట్రేడర్స్ ఉద్యోగులని ప్రశ్నించగా మేము కేవలం ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే అవి చెన్నై కి వెళ్లాల్సి ఉంది , ఆ కంటైనర్స్ కి మాకు ఏమీ సంబంధం లేదని జవాబు చెప్పారు. GST రిజిస్ట్రేషన్ సందర్భంగా సుధాకర్ ఇచ్చిన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఘటన వెలుగు చూసినప్పటి నుండి.
6. కాకినాడ వాస్తవ్యుడు అయిన సుధాకర్ 8 ఏళ్ల క్రితం చెన్నై వెళ్ళి అక్కడ ఆషి సోలార్ సిస్టమ్స్ అనే సంస్థని నడుపుతున్నాడు. చెన్నైలోని కొలప్పాకంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకి తీసుకొని అక్కడే ఉంటున్నాడు. కానీ హెరాయిన్ కేసు వెలుగులోకి రాగానే ఫ్లాట్ ఖాళీ చేసి పారిపోయాడు. Whatsup నంబర్ మాత్రం ఆషి సోలార్ సిస్టమ్స్ ని చూపిస్తున్నది. సుధాకర్ పట్టుబడితేనే కానీ అసలు ఈ 21 వేల కోట్ల రూపాయల హెరాయిన్ స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరో బయటపడుతుంది.
7. DRI ఇరాన్ నుండి వచ్చిన కంటైనర్స్ కి సంబంధించి ముగ్గురు ఆఫ్ఘన్ జాతీయులని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నది. వీళ్ళు ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ [NCR] లో ఉంటున్నారు. అలాగే గుజరాత్ లోని గాంధీధామ్, అహ్మదాబాద్ లలో కూడా పలువురిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నది DRI.
8. గత నెల తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్న తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు హెరాయిన్ స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది అని భావించి నిఘాని తీవ్రతరం చేశాయి. ఫలితమే మొన్నటి హెరాయిన్ సీజ్.
9. ఇప్పటివరకు భారత్ లో పట్టుబడ్డ డ్రగ్స్ కంటే మొన్న గుజరాత్ ముంద్రా పోర్ట్ లో దొరికిన 3,000 కిలోల హై క్వాలిటీ హెరాయిన్ అతి పెద్ద సీజ్ గా చెప్పుకోవచ్చు.
సరిహద్దుల్లో సైనిక నిఘా ఎక్కువగా ఉండడంతో తాలిబన్లు కంటైనర్లతో సరఫరాకి తెగబడ్డారు. నా గత పోస్ట్ లో కంటైనర్స్ ద్వారా డ్రగ్స్ ఎగుమతి చేస్తారు తాలిబన్లు అని చెప్పాను. అదే నిజమయింది. 21 వేల కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ కనుక భద్రంగా గమ్యానికి చేరుకొని ఉంటే ఆ డబ్బు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయేది. పెద్ద ప్రమాదం తప్పింది. 21 వేల కోట్ల డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పేరు వెలుగులోకి రావడం ఒక ఎత్తయితే మూడు రోజుల క్రితం గుంటూరు కేంద్రంగా సింథటిక్ డ్రగ్స్ ని ఆన్లైన్ లో అమ్మే ముఠాని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేయడం మరో కోణం. ఇక విశాఖపట్నంలో హాష్ ఆయిల్ ని పట్టుకున్నారు పోలీసులు దీని విలువ 1 కోటి 25 లక్షలు. హాష్ ఆయిల్ అంటే అదీ గంజాయి నుండి తయారుచేస్తారు కానీ చాలా గాఢంగా ఉంటుంది. మత్తుని కలిగిస్తుంది. హష్ ఆయిల్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉత్పత్తి చేస్తారు. ఆఫ్కోర్స్ అమెరికా కూడా హాష్ ఆయిల్ ని తయారుచేస్తుంది… So! ఇలా ఆంధ్రప్రదేశ్ కూడా కర్ణాటక , కేరళ లాగా డ్రగ్స్ కి కేంద్రంగా మారబోతున్నదా ? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలా మూడు ప్రధాన నగరాలలో డ్రగ్స్ మీద కేసులు బుక్ అవడం ఎవరి వైఫల్యం ? ఏదో ఒక రాజకీయ అండ లేకుండా ఇలాంటి కార్యకలాపాలు జరగవు… కానీ ఎవరు వాళ్లు..?!!!!
Share this Article