ఎప్పుడైనా వీలయితే ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ వీకెండ్ షోలు చూడండి… రచ్చ రచ్చ… బ్రహ్మాండమైన వినోదం పంచింది ఆ సీజన్… ఎన్టీయార్ టీవీ హోస్టింగు ఫస్ట్ టైమే అయినా చింపేశాడు… మరి ఇప్పుడు..? పదిన్నర కోట్ల ఓట్లు అని గప్పాల్ కొట్టినా సరే…. మరీ ఈ నాలుగో సీజన్ పేలవంగా, మరీ రాంగోపాల్‌వర్మ తీసిన ఆఫీసర్ సినిమాలాగా ఉసూరుమనిపిస్తోంది… నాగార్జున తప్పేమీ కాదు… వర్క్ చేస్తున్న టీం అసమర్థత… ఎంచుకున్న కంటెస్టెంట్లు మరో రీజన్…
సరే, విషయానికొస్తే… ఏ ఉత్సాహమూ, ఊపూ లేకుండానే నాలుగో సీజన్ ముగింపుకొస్తోంది… ఫినాలే మరో రెండువారాలు కూడా లేదు… హౌస్‌లో మిగిలింది ఆరుగురు… మూడు మేల్, మూడు ఫిమేల్… ఎలాగూ అఖిల్ ఫైనలిస్టు అయిపోయాడు కాబట్టి ఇక మిగిలింది అయిదుగురు… ఇకపై కెప్టెన్ ఉండడు అన్నారు గానీ, నామినేషన్లు ఉండవని అనలేదు కదా… టాప్ ఫైవ్ తేలాలంటే మరొకరు ఎలిమినేట్ అయిపోవాల్సిందే కదా… అలా వెళ్లిపోవాల్సింది ఎవరు..?
Ads
సో, ఈరోజు సోమవారం, ఈ నామినేషన్ల తంతు ఒకటి ఉంటుంది కదా… గార్డెన్లో పెట్టిన ఏదో ప్లాస్టిక్ కిరీటం, కంటెస్టెంట్ల పరుగులు కనిపిస్తున్నయ్ ప్రొమోలో… చివరకు ఏమైంది..? ఎవరు నామినేట్ అయ్యారు..? కత్తి వేలాడుతున్నది ఎవరిపైన..?
ట్విస్టు ఏమీ లేదు… అందరూ నామినేట్ అయ్యారట… అంటే అయిదుగురినీ ప్రేక్షకుల తీర్పుకు వదిలేశారన్నమాట… ఎలాగూ అభిజిత్ మళ్లీ టాప్‌లో ఉంటాడు వోట్లలో… తనకు నామినేషన్లు కొత్త కాదు, ఈ వోటింగులు కొత్త కాదు… అంతా పర్ఫెక్ట్ ఆపరేషన్… సొహెయిల్ బాగా పుంజుకున్నాడు కాబట్టి తన వోట్లకూ రంది లేదు… టాప్ ఫైవ్‌లో ఉండాల్సిన కేరక్టరే… ఇక మిగిలింది ముగ్గురు ఆడ లేడీస్… ప్రేక్షకులు, హౌస్ మేట్స్ ప్రేమగా పిలుచుకునే పొట్టి పిల్ల, నార్త్ పిల్ల, బక్క పిల్ల…
వీరిలో మోనాల్ అన్నింటికీ మినహాయింపులు ఉన్న కంటెస్టెంట్… ఆమెకు ఎన్ని తక్కువ వోట్లు వచ్చినా సరే, బిగ్‌బాస్ ఆమెను సేవ్ చేస్తాడు, ఆమె కోసం ఇంకెవరినో బలిపెడతాడు… ఇక్కడ జనం తీర్పుకు చెల్లుబాటు లేదు… అంతే… ప్రేక్షకుల్లో ఎంత బ్యాడ్ అవుతున్నా సరే, బిగ్‌బాస్ టీం ఆడమన్నట్టల్లా ఆడుతూ, ట్రాకులు నడుపుతున్నందుకు కావచ్చు… లేదా తనను చివరిదాకా హౌస్‌లో ఉంచేలా ఆమె ముందే ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు… కారణం ఏమైనా సరే… ఆమెను ఈసారి కూడా వదిలేద్దాం ఈ చర్చ నుంచి…
ఆరియానా… మొదట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎవరికీ ఆమె మీద… కానీ బాగా పికప్ అయింది… ముక్కుసూటిగా మాట్లాడటం, టాస్కుల్లో మంచి పార్టిసిపేషన్, వాదనల్లో లాజిక్కులు గట్రా ఆమె పుంజుకునేలా చేశాయి… అవినాష్‌తో లవ్ ట్రాక్ నటించడం తనకు కొంత మైనస్ అయినా సరే, అదీ ఆటలో భాగమే కాబట్టి పర్లేదు… ఇవే ఆమెను టాప్ ఫైవ్ దాకా తీసుకుపోతాయేమో…
హారిక… దేత్తడి హారిక… నిజానికి తనూ యాక్టివే… కానీ అందరితో పోలిస్తే కొంత వీక్ అనిపిస్తోంది… బహుశా ఈసారి ఆమే టార్గెట్ అవుతుందేమో ప్రేక్షకులకు… తను కూడా మెంటల్‌గా ప్రిపేర్ అవుతున్నట్టుగానే ఉంది, ఆమె మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది… నిజానికి ఫైనలిస్టులకూ, ఈ వారం వెళ్లిపోయే కంటెస్టెంటుకూ మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు… ఒక్కవారం రెమ్యునరేషన్ తేడా… అదీ వాళ్లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి ఉంటుంది… రాహుల్ సిప్లిగంజ్కన్నా శ్రీముఖి ఎక్కువ సంపాదించిందీ అంటే, ముందుగా మాట్లాడుకున్న టారిఫ్‌ను బట్టి ఉంటుంది…
ఒకవేళ ఆరియానా బయటికి వెళ్లిపోతే… ఇక చివరివారం… ఒకవైపు సొహెయిల్, అఖిల్ ముచ్చట్లు… మరోవైపు అభిజిత్, హారిక ముచ్చట్లు… మధ్యలో అటూఇటూ గాకుండా మోనాల్ ఎడ్డిచూపులు…!!
Share this Article