మొన్నటి ప్రియ-రవి-లహరి వివాదంలో బాధితురాలు ఎవరు..? లహరి..! మరి నిందితుడు ఎవరు..? రవి..! మధ్యలో మంటపెట్టింది ఎవరు..? ప్రియ..! మరి అంతటి నాగార్జునుడే వీడియోలు చూపి, ఏయ్, రవీ, నీ వ్యాఖ్యలు తప్పు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, పైగా మాట్లాడలేదని బుకాయిస్తావా..? వాటీజ్ దిస్..? అని కస్సుమన్నాడు కదా… లహరి కూడా ఆ వీడియో చూసి, ప్రియ తప్పేమీ లేదని కౌగిలించుకుని సారీ కూడా చెప్పింది కదా… మరి ఇక్కడ శిక్షింపబడాల్సింది ఎవరు..? రవి…! పిచ్చి కూతలు కూసింది తనే… యాంకర్ కావాలని, రవి చుట్టూ తిరుగుతూ, తనకు లైన్ వేస్తూ, తనను లైన్లో పడేస్తున్నదీ అన్నట్టుగా కూశాడు… చివరకు తప్పు తెలుసుకున్నాడు, సారీ అన్నాడు… అంతిమంగా బిగ్‌బాస్ తెలుగు క్రియేటివ్ మెంటల్ టీం ఏం చేసిందంటే..? లహరినే బయటికి పంపించేసింది… అదెలా సమంజసం అని ఎవరూ అడగొద్దు… తెలుగు బిగ్‌బాస్ టీం అంటేనే ఓ మెంటల్ గ్రూప్… ఇదేందయ్యా అంటే ప్రేక్షకులు వోట్లు అలాగే వచ్చాయని సాకు చెబుతారు… ఎవరికెన్ని వోట్లు అనేది ఓ బ్రహ్మరహస్యం కదా… బస్, అక్కడితో కథ ఖతం… నిజానికి లహరి గేమ్‌లో ఉండాల్సిన కేరక్టర్… రవి బిగ్‌బాస్ టీంతో బిగ్ డీల్ చేసుకునే హౌజులోకి వచ్చాడని లోకమంతా కోడై కూస్తున్నది కాబట్టి ఎలాగూ రవిని శిక్షించలేరు… సో, లహరిని గిలెటిన్ చేసి, చేతులు దులుపుకున్నారు…
ఆటలో సరయు ఉంటే మజా ఉండేది, ఆమె నోటి వెంట బూతుల కోసం కాదు… ఆమె టెంపర్మెంట్ ముఖ్యం… షణ్ముఖ్, శ్రీరామచంద్ర, జెస్సీ వంటి డల్ కేరక్టర్లతో థ్రిల్ ఎలా రావాలి..? ఇప్పుడు లహరిని కూడా బలిపెట్టారు… జాగ్రత్తగా గమనిస్తే ఈసారి బిగ్‌బాస్‌లో అస్సలు జోష్ లేదు, హోస్ట్ నాగార్జున తన వ్యక్తిగత సమస్యలతో డల్‌గా కనిపిస్తూ ఉండవచ్చుగాక… కానీ కంటెస్టెంట్లూ అంతే… ప్రతి ఒక్కరూ సూపర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు… దాంతో ప్రేక్షకుల ఆసక్తి కాస్తా చచ్చిపోతోంది… చివరకు నాగార్జున వీకెండ్ షోలు కూడా రొటీన్‌గా, చప్పగా, చప్పిడి కూడుగా మారిపోయింది… వినోదం అనే ప్రధాన సరుకు కాస్తా శూన్యమైపోయింది… హౌజులో 16 మంది కదా… అందులో ఏకంగా సగం మందిని, అంటే ఎనిమిది మందిని ఈసారి ఎలిమినేషన్ జాబితాలో చేర్చేశాడు బిగ్‌బాసోడు… ఇక వాళ్ల సోషల్ మీడియా టీమ్స్ (పెయిర్ ఆర్మీలు) అన్నీ యాక్టివేట్ అయిపోయి, ఆయా కంటెస్టెంట్లకు అనుకూలంగా వోట్లు వేయిస్తూ ఓ హడావుడి క్రియేట్ చేయాలనేమో ఈ పిచ్చి ఆలోచన వెనుక ఉద్దేశం… అలాగైనా బిగ్‌బాస్ షోకు ఊపు వస్తుందేమోనని ఆశ… ఈసారి ఎలిమినేషన్ జాబితాలో చేరిన వాళ్లు ఎవరో తెలుసా..? లోబో, కాజల్, ఆనీ, సన్నీ, నటరాజ్, ప్రియ, సిరి, రవి… నిజంగా డల్ ప్లేతో విసుగెత్తించే షణ్ముఖ్, జెస్సీ, శ్రీరామచంద్ర, హమీదా వంటి కంటెస్టెంట్లు మాత్రం సేఫ్… ఏం ఆటరా భయ్ ఇది..? అన్నట్టు… ఈసారి పెద్ద రిలీఫ్ ఏమిటంటే..? ఎలిమినేషన్ సమయాల్లో శోకాలు, పెడబొబ్బలు లేవు… జస్ట్, అలా వెళ్లిపోతున్నారు… లహరి, సరయు అయితే ఏదో పనిమీద వచ్చి, వాపస్ వెళ్తున్నంత కాజువల్‌గా వెళ్లిపోయారు… హౌజులో కంటెస్టెంట్లు కూడా ఓవర్ డ్రామాకు దిగలేదు… హమ్మయ్య…!! గత సీజన్లలో తెలుసు కదా, ఎవడైనా ఎలిమినేట్ అయితే చాలు, ఇంట్లో ఎవడో చచ్చాడు అన్నట్టు శోకాలు పెట్టి చిరాకెత్తించారు…!
Ads
Share this Article