రెండేళ్ల క్రితం కావచ్చు… ఓ సినిమా వచ్చింది… డాన్స్ లైక్ దాని పేరు… One Boy and Three Girls, A Funny Cute Love Story అని ప్రచారం కూడా చేసుకున్నారు… ఒరేయ్, ఇదేం క్రియేటివిటీరా బాబూ, అన్నిరకాల ప్రేమ పైత్యాలు అయిపోయాయి, ఇప్పుడిక ముగ్గురు ఆడాళ్లకూ ఒక మగాడికీ నడుమ ఈ ప్రేమ ఏమిట్రోయ్ అని తిట్టేవాళ్లు తిట్టారు… అసలు క్రియేటివిటీ అంటే ఇదే అని మెచ్చుకుని చప్పట్లు కొట్టినవాళ్లు కూడా ఉన్నారు… సమాజం మారుతోంది, పెడపోకడలు పెరుగుతున్నాయి… స్వలింగ, సమూహసంపర్కాలే కాదు, ఇంకా చెప్పలేని నానారకాల వికృతాలూ చూస్తున్నాం… ఆఫ్టరాల్ ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయితో ఏకకాలంలో కలిసి ప్రేమవ్యవహారంలో మునిగిపోవడం పెద్ద తప్పేం ఉందోయ్ అని ఉల్టా ట్రోల్ చేసేవాళ్లూ ఉండొచ్చు… ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి కథే…
సాధారణంగా ఇలాంటి పైత్యాలు ఎక్కువగా ఉత్తరప్రదేశంలోనే కనిపిస్తుంటయ్, వినిపిస్తుంటయ్… ఇద్దరు అమ్మాయిలు ఒక్కడినే లవ్ చేయడం అనేది పాత కథే… ఇది ముగ్గురు అమ్మాయిలు ఒకడినే ప్రేమించిన కథ… రాంపూర్ జిల్లాలోని కథ… అందులోనూ విశేషాలున్నాయండోయ్… అకస్మాత్తుగా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మాయమైపోయారు… ఎటుపోయారో తెలియదు, తల్లిదండ్రులు ప్లస్ బంధువులు ప్లస్ స్నేహితులు ప్లస్ పరిచయస్తులు ఆ చుట్టుపక్కల మొత్తం ఊళ్లు వెతికారు, దొరకలేదు… పోలీసులకు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదు… మాకు కంప్లయింట్ చేయకపోతే మేమెందుకు దర్యాప్తు చేస్తాం అన్నట్టుగా పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు… తీరా అక్కడిక్కడా కాస్త ఆరాలు తీస్తే ఈ ప్రేమ కథ బయటపడింది…
Ads
ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓ అబ్బాయిని జాయింటుగా ప్రేమించారు… పీకల్దాకా ఆ భావనలో మునిగిపోయారు… ముగ్గురికీ తెలియకకాదు, తెలిసే..! మరో విశేషం ఏమిటంటే… అందులో పెద్దక్కకు ఈమధ్యే పెళ్లయింది, అత్తింటికి వెళ్లి నాలుగు రోజులకే వాపస్ వచ్చేసింది.,. నా మొగడు నాకొద్దుపో అంటోంది… ఈలోపు ఈ అబ్బాయి దొరికాడు, పట్టేసింది… తరువాత మరో చెల్లెలు… ఆ తరువాత ఇంకో చెల్లెలు… ఇంకో విశేషం ఏమిటంటే..? చిన్న చెల్లెలు మైనర్, పెళ్లి వయస్సు కూడా రాలేదు… ముగ్గురు ప్లస్ ఆ ప్రేమికుడు కలిసి ఎటో పారిపోయారు… అదీ కథ… ఆ ముగ్గురితో వాడు ఎక్కడ కాపురం పెడతాడు..? అసలు ముగ్గురూ ఒక్కడినే అలా ‘‘ఘాఠ్టిగా ప్రేమించడం’’ ఏమిటి..? అనే ప్రశ్నలు వేయకండి… ప్రేమ అంటేనే గుడ్డిది కదా..!! కాకపోతే మరీ ఇంత గుడ్డితనమా అనేదొక్కటే హాశ్చర్యం…!!
Share this Article