గురువు గారూ, ఇంతకీ ఈ వివాదంలో బకరీగా చూడబడుతున్న ఈ పంజాబీ మహిళ ఎవరు అనడిగాడు ఓ మిత్రుడు..? మనకేమో తెలియదు… చార్మి కాకపోవచ్చు, ఆమె మన అకున్ సభర్వాల్ సాక్షిగా ప్యూర్ చార్మి జగన్నాథ్… తమన్నా భాటియా కూడా కాకపోవచ్చు, ఫాఫం, పవన్ క్యాంపుకి కాస్త దూరదూరంగానే ఉంటోంది… సోనం బజ్వాకు అంత సీన్ లేదు…. మన భానుశ్రీ..? అబ్బే, మరీ టీవీలకే సరిపోవడం లేదు… ఎహె, పూనం కౌర్ కావచ్చు… అవును, అప్పుడప్పుడూ పవన్ కల్యాణ్ విషయంలో ట్వీటుతోంది… ఏడుస్తోంది… రష్యన్లు, జర్మన్లు, అమెరికన్లు గట్రా పడిచచ్చే మన గ్రీకువీరుడు పవన్ ఆఫ్టరాల్ ఈ పిల్ల మీద మనసు పడ్డాడా..? ఏమోలెండి..? ఇంతకీ ఎవరీమె..? పోసాని చెబుతున్న కడుపు, అబార్షన్, కోట్ల సొమ్ము గట్రా ఎవరి గురించి..? పిచ్చి పోసానం… ఏదీ సరిగ్గా చెప్పి ఏడవడు… సగం అర్థమవుతుంది… మిగతా సగం కోసం జుత్తు పీక్కోవాలి మనం…
సరే, ఎలాగూ ప్రస్తావన వస్తోంది కాబట్టి ఈ పూనం కౌర్ గురించి తెలుసుకుందాం అంటే…. అదీ సరిగ్గా తెలిసి చచ్చేలా లేదు… కౌర్ అనగానే ఆమె సిక్కు అని తెలుస్తూనే ఉంది… సిక్కు అంటే పంజాబీ మాత్రమే అయి ఉండాలని ఏమీ లేదు కదా… సిక్కులు విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు… వాళ్లు విశ్వమానవులు… మన తెలంగాణలోనే, మన హైదరాబాదులోనే బొచ్చెడు మంది ఉన్నారు… అవునవును… తరచి తరచి చూస్తుంటే పూనం కూడా ప్యూర్ హైదరాబాదీ, పంజాబీ రూట్స్ అని తెలుస్తోంది… హైదరాబాదులోనే పుట్టింది, పెరిగింది… హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది… కెరీర్ మొదట్లో తేజ సినిమాలతో ట్రై చేసింది… అప్పటికే తేజ భ్రష్టుపట్టిన ఫ్లాప్ డైరెక్టర్ అయిపోయాడు కదా, పాపం, ఆమెకూ ఉపయోగపడలేదు… 2006 నుంచి తన్నుకుంటున్నా సరే, ఈరోజుకూ ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా లేదు ఆమెకు… గాషారం గాం- మారేతో పూనం క్యాకరేగా… మధ్యలో ఈ పవన్ గొడవ ఒకటి… నిజానిజాలు దేవుడికెరుక… ఫీల్డులో వాడుకోవడాలు కామన్ కదా… అలాగని మనం అలా తేల్చేయడం కూడా కరెక్టు కాదు… కాకపోతే ఎవరామె అని తెలుసుకోవడం మీద మాత్రం కాస్త ఇంట్రస్టు ఉంటుంది కదా… ఏ రంగంలోనైనా సరే కొందరు దురదృష్టజాతకులు ఉంటారు… దుష్టగ్రహ పీడితులు, గ్రహచార బాధితులు… ఫాఫం, పూనం కూడా ఓ శాపగ్రస్త…! ఎలా..? ఎవరి వల్ల..? ఎందుచేత..? అనేవి అప్రస్తుతాలు… పోసానిని కదిలిస్తే మళ్లీ బూతుపురాణం మొదలుపెడతాడు… ఇక్కడే వదిలేయడం మన మానసిక ఆరోగ్యానికి మంచిది…!! ఏయ్, ఎవడ్రా అదీ… ఓ హైదరాబాదీకి అన్యాయం జరుగుతుంటే కేసీయార్ ఏం చేస్తున్నాడు అనే పిచ్చి ప్రశ్న అడిగేది… నాన్సెన్స్, నోరు మూసుకో… ఆయ్ఁ….
Ads
Share this Article