కొన్నేళ్ల క్రితం… నలుగురు వ్యాపారుల నడుమ ఓ సంభాషణ…. వాడు ఆ ఏసీటీవో గాడు, దొంగ లం-కొ… వాడు అడిగింది ఇచ్చినా సరే, ఇంకా కొర్రీలు పెడతాడు, డబ్బు గుంజుతాడు, ఏవేవో డిమాండ్లు చేస్తాడు, ఐనా పని సరిగ్గా చేసిపెట్టడు… అన్నాడు ఒకడు….. అవునవును, వాడికన్నా వాడి బాస్ ఆ డీసీటీవో చాలా బెటర్, మంచోడు, ఇచ్చింది తీసుకుంటాడు, తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తాడు, వెంటనే పనిచేసి పెడతాడు, మర్యాదస్తుడు అని మెచ్చుకున్నాడు మరొకడు…… ఇక్కడ అవినీతి కామన్, ఇద్దరూ శుద్ధపూసలు కాదు, కాకపోతే ఒకడు ధర్మాత్ముడైన అవినీతిపరుడు, మరొకడు దురాత్ముడైన అవినీతిపరుడు… జాగ్రత్తగా గమనించండి… లంచం అనేది ప్రభుత్వ ఉద్యోగికి కామన్ లక్షణంగా సమాజం అంగీకరించింది… అంగీకరించక చచ్చేదేమీ లేదు.., చెప్పుకోవడానికి ఏముందిలే, భారతీయత- నైతికత- ధర్మం- ఆదర్శం… ఎట్సెట్రా జబ్బలు చరుచుకోవడానికి బాగానే ఉంటుంది… ఒక్కొక్కడూ నిలువెత్తు నల్లటి శుద్ధపూస… (అందరూ కాదు, సంపాదనకు చాన్సున్న కొలువుల్లో తిష్టవేసినవాళ్లు)…
అంతెందుకు, ఫలానా ఫలానా శాఖల్లోని అవినీతిపరులుందరూ వెంటనే మాయమైపోవాలి అని ఎవరైనా శపిస్తే… అదే జరిగితే… కొన్ని శాఖలు ఒక్కడు కూడా కనిపించడు… కాకపోతే అవినీతిపరుల్లోనూ గ్రేడ్లు వేరు… ఉదార అవినీతి, కర్కశ అవినీతి… సో, మన ధర్మం ఎలాగూ దీన్ని అరికట్టలేదు, ప్రభుత్వాలతో అయ్యే పని కాదు, మన సిస్టమ్స్ అవినీతికి తావులేని విధానాల్ని రూపొందించవు… విధానాల్ని రూపొందించేవాళ్లే అవినీతిపరులు కాబట్టి వాళ్లకు అక్కరకొచ్చేలాగే రూపొందిస్తారు… నాయకులు కూడా సేమ్ షేమ్ కాబట్టి, కొందరికి అసలు సబ్జెక్టే తెలియదు కాబట్టి ఆమోదించేస్తుంటారు…
ఈ వార్త చదివారా..? మధ్యప్రదేశ్లోని బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయ్ సింగ్… నిజమేమిటో తెలుసు ఆమెకు… ఫీల్డ్ పరిస్థితి తెలుసు, నిజంగా ఆమెను మెచ్చుకోవాలి… పప్పులో ఉప్పులా, కాస్త పద్దతిగా లంచం తీసుకొండి, పనిచేయండి అని చెబుతోంది… నిజమే, అవినీతికి కూడా ఓ నీతి అవసరం… రీజనబుల్ రేట్లు అవసరం… ఓ కులధ్రువీకరణ సర్టిఫికెట్టు ఇవ్వడానికీ, కబ్జా భూమికి రైట్స్ కట్టబెట్టడానికీ సేమ్ రేట్ అంటే అన్యాయమే కదా… అందుకని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల మంజూరుకు 5-9 వేలు తీసుకోవడం ఏమిటి నాన్సెన్స్, అయిదొందలో, వెయ్యో ఉంచుకుని మిగతావి ఇచ్చేయండి అని అధికారులను సాతువా అనే గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆదేశించింది ఆమె… జనం కూడా భలేభలే బాగుంది అని చప్పట్లు కొట్టారు… ప్రభుత్వ ఉద్యోగి తన సహజలక్షణమైన లంచాన్ని వదిలేయాల్సిన పనిలేదు, అది వాడి ‘హక్కు’… మనకు తెలుసు కదా, బాధితులు స్వయంగా పెట్రోల్ పోసి తగులబెడుతున్నా సరే, అవినీతి ఆగుతోందా..? లేదు కదా…! అలాంటప్పుడు ‘‘సమంజసమైన అవినీతి రేటు’’ అనేది బెటర్ కదా… నాకయితే సదరు ఎమ్మెల్యేను అభినందించాలని ఉంది… ఆమె రియాలిటీలో బతుకుతోంది… ప్రతి వ్యవస్థ అవినీతితో కుళ్లిపోయిందని తెలుసామెకు… మార్చలేమనీ తెలుసు… అందుకే ఆచరణసాధ్యమైన సొల్యూషన్స్, ప్రజల కోణంలో చెబుతోంది…… కాకపోతే, ఎటొచ్చీ ఒక్కటి మాత్రం ఈ దేశంలో మనకు అసాధ్యమైన స్వప్నం…….. నీతిపరుడైన రాజకీయ నాయకుడు…!!!
Ads
Share this Article