ఆయన వేణుస్వామి… ఆయన అంతే… అసలు ఆ జంట పెళ్లి పీటలే ఎక్కలేదు… ప్రేమాయణం మీద గాసిప్స్ మాత్రమే వస్తున్నాయి… అప్పుడే పోస్ట్ మార్టం చేసి, అంటే అయిదేళ్ల క్రితమే… ఈ జంటకు పెళ్లవుతుంది, కానీ నిలవదు అని యూట్యబ్ వీడియోలో కుండబద్దలు కొట్టేశాడు… పాపం, చూడముచ్చటైన జంట అది, కాస్త శుభం పలకవయ్యా స్వామీ, పెళ్లికి ముందే పెటాకుల ముచ్చట చెబుతావేమిటి అంటే… అదంతే… వాళ్లకు కుదరదు, నా విద్య చెప్పింది అదే, నేను చెబుతున్నదీ అదే అని కర్కశంగా బదులిచ్చాడు… నిజంగా ఆరోజు ఆయనేమన్నాడు అని ఓసారి యూట్యూబ్ చెక్ చేస్తే ఓ వీడియో దొరికింది… అది చూస్తే మరింత షాకింగ్‌గా ఉంది… ఆయన ఏకంగా సంసారసుఖం, సంతానభాగ్యం దాకా వెళ్లిపోయాడు… ఓసారి చూడండి…
Ads
విషయమేందయ్యా అంటే… చైతూకు కాలసర్పదోషం ఉంది, సమంతతో నో పిల్లలు… సమంతకు కుజదోషం ఉంది, నో సంసార సుఖం అంటాడు ఈ స్వామి… అందుకే ఈ పెళ్లి నాలుగు రోజులు నిలవదు, విభేదాలు, విడాకులు ఖాయం అని అప్పుడే వాళ్లకు ముందస్తు విడాకులు మంజూరు చేసేశాడు… అవున్నిజమేనా సమంతా..? ఈయన చెప్పినవన్నీ నిజాలేనా..? పెళ్లయ్యాక కూడా ఆమె సినిమాలు చేస్తుంది, కానీ అవకాశాలు తగ్గుతాయి అన్నాడు… మరంతే కదా… పెళ్లయ్యాక హీరోయిన్లను ఎవరు పట్టించుకుంటారు, మన ఇండస్ట్రీయే అలాంటిది కదా… పెళ్లయ్యేవరకే గిరాకీ… పైగా పేరున్న పెద్ద కుటుంబంలో చేరాక ఇతర హీరోల పక్కన రొమాన్స్, గంతులు, కౌగిలింతలు అంటే ఎలా కుదురుతుంది..? ఇజ్జత్ సమస్య ఉంటుంది కదా… ఐనా మనకెందుకు లెండి… వాళ్ల జీవితాలు వాళ్లిష్టం… ఏదో పెళ్లయినప్పుడు నాలుగురోజులు, విడిపోయినప్పుడు రెండు రోజులు చెప్పుకుంటాం, అంతే కదా…!! కానీ ఏమాటకామాట… పెళ్లిచేసుకోవడమే కాదు, విడిపోవడం మీద కూడా వాళ్లది ఒకేమాట… వాళ్లిద్దరి విడాకుల అధికారిక ప్రకటన చూశారు కదా… ఒకే కంటెంటు, జస్ట్, పేర్లు ఛేంజ్ అంతే…!!
Share this Article