Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది మరోరకం పైత్యం..! ప్రైవేటు కోలాటాల వీడియోలకు రాజకీయ కాలుష్యం…!!

October 6, 2021 by M S R

ముందుగా ఒక పాట చూడండి… వీడియో… పల్లె పడుచులందరూ ఒక్క తీరు బట్టలు కట్టుకున్నరు… జెడల్లో మల్లెపూలు నిండుగా పెట్టుకున్నరు… కళ్లకు గజ్జెలు కట్టుకున్నరు… చేతుల్లో కోలాటం కర్రలున్నయ్… వలయంగా నిలబడి ఓ పాట పాడుతున్నరు… ఆ పాటకు తగ్గట్టుగా కోలల (కర్రల) చప్పట్లు రిథమ్ ప్రకారం వినిపిస్తున్నయ్… డిల్లం బల్లెం అంటూ సాగుతూ… గ్రామదేవతలను కీర్తిస్తున్న డాన్స్… ఒరిజినల్‌గా పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తోంది… దానికి వీళ్లు అందంగా ముస్తాబై, ఆనందంగా ఆడుకుంటున్నారు… ప్యూర్ తెలంగాణ పాట… మంచిగుంది… ఓసారి వీడియో చూడండి… (కోలాటం ఒక్క తెలంగాణ సాంస్క‌ృతిక రూపం మాత్రమే కాదు.., ఇది దాదాపు ప్రతి తెలుగు పల్లెకూ తెలిసిన ఆటే, అలవాటైన పాటే…) (ఈ ఒరిజినల్ కోలాటం సాంగ్ ఎక్కడ, ఎవరు పాడారనే వివరాలు దొరకలేదు… దొరికితే అప్‌డేట్ చేద్దాం…)

https://muchata.com/wp-content/uploads/2021/10/ori.mp4

2019లో యూట్యూబులో అప్‌లోడ్ చేయబడిన వీడియో ఇది… మాస్టర్ పెండ్యాల మహేందర్ పేరుతో ఉంటుంది గమనించండి… దాదాపు 23 లక్షల వ్యూస్‌తో బాగా హిట్టయింది…

Ads

బాగుంది కదా… ఒక్క తీరు చీరెలు, జాకెట్లు, అలంకరణ… ఆ ఇరుకిరుకు గల్లీలో కూడా ఆనందంగా నర్తిస్తున్నారు… ప్రత్యేకించి బతుకమ్మల దగ్గర నేటితరం మహిళలు ఆడుతున్న దాండియాలు, సినిమా గెంతుల పోకడల నడుమ ఇలాంటివి చూస్తుంటే నేత్రానందం, చెవులకూ ఇంపు… ఇప్పుడు మరో వీడియో చూడండి… అదే వీడియో… కాకపోతే ఆడియో వేరు… వందల పదాలేల, మీరే చూడండి ఓసారి…

https://muchata.com/wp-content/uploads/2021/10/dup.mp4

చూశారు కదా… కేసీయార్‌ను నిందిస్తూ, కేసీయార్ పాలనను విమర్శిస్తూ సాగిన ఆడియో… చివరలో ఈటల రాజేందర్‌కు వోటు వేయాలని అర్థిస్తుంది పాట… అంటే, ఇది హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం ఎవరో ఉద్దేశపూర్వకంగా మార్చినట్టు అర్థమవుతోంది… ఒక ప్రైవేటు ఒరిజినల్ కోలాటం వీడియోకు కేసీయార్‌ను నిందిస్తూ సాగే ఓ ఆడియోను జతచేశారన్నమాట… అందుకే చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది డూప్లికేట్ వీడియో అని..! ఎందుకీ దరిద్రం..? ఇక్కడ సమస్య కేసీయార్‌ను విమర్శించడమో, తిట్టడమో కాదు… తమ రాజకీయ ధోరణులను బట్టి, తమ అంచనాలను బట్టి రాజకీయ బృందాలో, ఇతరత్రా ఆందోళనకారులో ఇలాంటి పాటల్ని కట్టి పాడుతూనే ఉంటారు… సహజం… కానీ ఇది ఓ ప్రైవేటు వీడియో… ఏదో సందర్భంలోని కోలాటం… దానికి ఈ పొలిటికల్ మార్ఫింగ్ దేనికి..? వాళ్లను అవమానించడం దేనికి..? చేతనైతే ఇలాగే మీ కార్యకర్తలతో కోలాటం ఆడించి రికార్డు చేయించలేరా..? ఇలాంటిదే మరో వీడియో కూడా కనిపించింది, సేమ్, ఎక్కడో మహిళలు బతుకమ్మ ఆడుతుంటే, ఆ వీడియోకు కేసీయార్ పాలనను నిందిస్తూ సాగే ఓ ఆడియోను జతచేసి ప్రచారంలోకి తీసుకొచ్చారు… నిజానికి ఈ ఎన్నిక కోసం ఇరుపక్షాల్లోనూ కోట్లకుకోట్ల ఖర్చు పెడుతున్నారు, ఆఫ్టరాల్ ఇలాంటి సొంత వీడియోలు చేయించుకోలేరా..? ఎహె, టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఫేక్ లేఖల్ని, మార్ఫ్‌డ్ ఫోటోల్ని ప్రచారంలోకి తీసుకురావడం లేదా అని సమర్థించకండి… ఇక మీకూ వాళ్లకూ తేడా ఏమున్నట్టు..?!

అరెరె, ఆగండి ఆగండి… బీజేపీదే దరిద్రపు ఆలోచన అనుకుంటే… వాళ్ల తాతలం మేం అంటారు టీఆర్ఎస్ వాళ్లు… అలాంటి పైత్యాల్లో మేమెవరికీ తీసిపోం తెలుసా అంటారు… సో, వెంటనే అదే వీడియోకు బీజేపీని తిడుతూ, ఈటలకు వోటు వేయొద్దంటూ సాగే మరో ఆడియోను యాడ్ చేసి, సోషల్ మీడియా ప్రచారానికి వదిలారు… నమ్మడం లేదా..? దిగువ ఆ వీడియో కూడా ఉంది చూడండి… అన్నా రేవంతన్నా, మీ వీడియో ఇంకా మార్కెట్‌లోకి రాలేదు, కాస్త త్వరగా రిలీజ్ చేయించు ప్లీజ్…

https://muchata.com/wp-content/uploads/2021/10/dup2.mp4

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions