సరిగ్గా నాలుగేళ్ల క్రితం… సమంత పెళ్లయ్యింది… బొచ్చెడు ఫోటోలు… అందులో ఒక్క ఫోటో బాగా కనెక్టయింది… ఆమె ఓ పాపులర్ సినిమా స్టార్, ఆమెకు ఈ ఫోటో షూట్లు, వీడియో షూట్లు పెద్ద సమస్యేముంది..? నటి, ఎలాగంటే అలా ఫోజులు పెట్టగలదు… కానీ పెళ్లి నటన కాదు, ఒరిజినల్, పర్సనల్, తన లైఫ్‌ను తిప్పేది, నిర్దేశించేది… ఏమనుకున్నదో ఏమో గానీ… ఒక్కసారిగా ఆమెలోని అసలైన అమ్మాయి బయటపడిపోయింది… కన్నీళ్లు పెట్టుకుంది… అవి కళ్ల నుంచి మాత్రమే రాలిన కృత్రిమమైన నీటిచుక్కలు కాదు, కడుపులో నుంచి పెల్లుబికిన ఫీలింగ్స్… అవి ఓ పెద్ద కుటుంబంలోకి పోతున్నందుకా..? అప్పటికే ఓ ప్రేమ భగ్నమై, ఈ ప్రేమ ఫలించినందుకా..? తను చెప్పిన షరతులన్నీ పాటించి పెళ్లికి ఒప్పుకున్న మొగడు, మామ, అత్త దొరికినందుకా..? ఎందుకో గానీ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది ఒక్కసారిగా… ఆ ఉద్వేగానికి సరైన బాష్యాలు చెప్పలేం నిజానికి… ఇది నాటి ఫోటోతో కూడిన సోషల్ పోస్ట్…
నాలుగేళ్లు ఎంతసేపని.. ? గిర్రున తిరిగిపోయాయ్… విడిపోయారు… అంత భావోద్వేగానికి గురైన సమంత తన బంధాన్ని ఎందుకు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు..? ఈ పెటాకుల కథలో తప్పు ఆమెదేనా..? మగడి, మగాడి తప్పేమీ లేదా..? మీడియాలో బోలెడంత చర్చ, రచ్చ… అన్నీ బాగుంటే ఆమె ఎందుకు వదులుకుంటుంది..? అనే పాయింట్ దగ్గరికి మాత్రం ఎవరూ వెళ్లలేదు… సరే, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె ఇష్టం, ఇయ్యాల్రేపు పెళ్లిళ్లు, పెటాకులు, లవ్వులు, బ్రేకప్పులు పెద్ద ఇష్యూసే కాదు నిజానికి… రోజూ లెక్కలేనన్ని విడాకుల కేసులు వస్తూనే ఉన్నయ్… కానీ ఆమె సెలబ్రిటీ కాబట్టే ఈ రేంజులో మీడియా గద్దల దాడి… కానీ ఒక్కసారిగా ఆమె ఈ రచ్చ నుంచి అనుకోకుండా బయటపడినట్టే… పరమ నిష్ప్రయోజనకరమైన ‘మా’ ఎన్నికల మీద పడిపోయింది మీడియా… అదొక బురద, అందులోపడి ‘మా’ పెద్దలతోపాటు మీడియా కూడా పొర్లుతోంది… సమంతకు రిలీఫ్… చైతూకు రిలీఫ్… పైగా చైతూనో, సమంతనో వెక్కిరిస్తూ, గేలి చేస్తూ, నవ్వుతూ కనిపించే ట్వీట్లకు వాళ్ల ఫ్యాన్స్ కూడా దీటైన సమాధానాలు ఇస్తున్నారు… దాంతో సిద్ధార్థ్ వంటి హీరోలు కూడా మళ్లీ కిమ్మనడం లేదు… ఇది చూడండి…
Ads
‘‘మంచిగైంది… మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు, చిన్నప్పటి నుంచీ నాకు తెలిసిన పాఠం అది… నువ్వూ అంతే కదా’’ అంటూ పరోక్షంగా సమంత విడాకులను ఉద్దేశించి కసికసిగా ట్వీటాడు… అక్కడికి తనేదే సీతారాముడు అయినట్టు… సమంత మోసగత్తె అయినట్టు… చాలామంది సెలబ్రిటీలు ఏవేవో ట్వీట్లు పెట్టవచ్చుగాక, కానీ సిద్ధార్థ్ ట్వీట్‌కు ఓ ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే..? తను ఆమె మొదటి బహిరంగప్రియుడు కాబట్టి…! ఈ ట్వీట్ చూడగానే ఒకామె భలేగా తిప్పికొట్టింది… ‘‘చాల్లేవోయ్ చెప్పొచ్చావు, మోసగాళ్లు బాగుపడరు అని నీ మాజీ భార్య మేఘన కూడా అనుకుని ఉంటుంది కదా… సోహా అలీ ఖాన్ కోసమేగా ఆమెను వదిలేసినవ్… శృతిహాసన్ కోసం సోహాను కూడా వదిలేశావు కదా, అప్పుడామె కూడా సేమ్ ఫీలై ఉంటుంది కదా… సమంత కోసం శృతిని వదిలేసినప్పుడు ఆమె కూడా సేమ్ ఫీలై ఉంటుంది…’’ అంటూ సిద్ధార్థ్ పాత కథలన్నీ నాలుగు ముక్కల్లో చెప్పేసింది… ఇక మాట్లాడటానికి, రిప్లయ్ ఇవ్వడానికి ఏముంది..? ఎవరు చీటర్స్..? బంధాలు కలుస్తుంటయ్, విడిపోతుంటయ్, ఈరోజు ఇవన్నీ కామన్… సమంత నిర్ణయం మంచిదో చెడ్డదో కాలం చెబుతుంది ఆమెకు, కానీ చివరకు సిద్ధార్థ్ కూడా వెక్కిరిస్తే ఎలా..? ఈ జవాబు మొహం తన పగిలిపోయేలా ఉంది కదా..! అందుకే సోషల్ మీడియాలో ఏదిపడితే అది పోస్ట్ చేయకూడదు, నిశ్శబ్దం మన అజ్ఞానాన్ని, మన తప్పుల్ని కవర్ చేస్తూ ఉంటుంది… సిద్ధార్థ్, వింటున్నావా..?!
Share this Article