Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చే గువేరా..! ఎందుకిలా ఆరాధిస్తున్నారు..? ఏం సాధించాడు..? ఏమిటీ వెర్రి..?!

October 10, 2021 by M S R

కొందరు విపరీతంగా ఆరాధించే ఒక వ్యక్తి, మరికొందరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు… ఆ మరికొందరి అంచనాలు, విశ్లేషణలు భిన్నంగా ఉండవచ్చు… మనం జాతిపిత అని పిలుచుకునే గాంధీని మెచ్చనివాళ్లు, నచ్చనివాళ్లు బోలెడు మంది లేరా ఏం..? చరిత్రలో ఆరాధనీయులుగా లిఖించబడిన వ్యక్తుల పాజిటివ్ లక్షణాల గురించు గాకుండా, వారిలోని నెగెటివ్ కోణాల్ని కూడా చెప్పుకోవడం, విశ్లేషించుకోవడం పాశ్చాత్య దేశాల్లో గమనించవచ్చు… కానీ ఇండియాలో తక్కువ… మనం పదే పదే చదువుకున్నది నిజం కాకపోవచ్చు, కావచ్చు కూడా…!! చే గువేరా గురించి పత్రికల్లో బోలెడు వ్యాసాలు, కథనాలు, స్మరణలు కనిపిస్తుంటాయ్… పోరగాళ్లు చే బొమ్మలున్న టీషర్టులు వేసుకుంటారు… బైకులకు స్టిక్కర్లు… సోషల్ మీడియాలో డీపీలు… ఐతే, చే గువేరాకు మనం అనుకున్నంత సీనేమీ లేదని అంటున్నాడు మిత్రుడు Jagannadh Goud… అదీ ఓసారి చదువుదాం…


 

ఎవరీ చే గువేరా..? చే గువేరా చచ్చిన రోజు అయితే నాకేంటి..? బంగ్లాదేశ్ లో కుక్క చస్తే నాకేంటి..? చే గువేరా మనకెందుకు..? అక్కడక్కడా కొందరు పోరగాళ్ళు బైక్ లకి చేగువేరా స్టిక్కర్కు, T- షర్ట్స్ కి చేగువేరా బొమ్మలు తెలిసి వేసుకుంటరో, తెలియక వేసుకుంటరో తెలియదు. భగత్ సింగ్, రాజ్ గురూ, సుభాష్ చంద్ర బోస్ స్టిక్కర్స్ వేసుకోండ్రా అయ్యా.., వాడెవడో కోన్ కిస్కా గొట్టం గాడి స్టిక్కర్స్ మనకి అవసరమా అన్నది భారత యువత ఆలోచించాలి. అసలు వాడి పేరు కూడా అది కాదు, వాడు పీకింది కూడా ఏమీ లేదు. అసలు చేగువేరా ఎవరు.? ఏమి చేశాడు..? చేగువేరా అసలు పేరు “గెవేరా” (ఎర్నెస్టో గెవేరా డి లా సెర్నా). దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో పుట్టిన గెవేరా “అర్జెంటీనా” రాజధాని “బ్యూనస్ ఎయిర్స్” లో వైద్య విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. బ్యూనస్ ఎయిర్స్ లో చాలామంది పలకరించేటప్పుడు “చే” అంటారు ఎవర్ని అయినా; దాని అర్ధం Hello Buddy or Hey. అర్జెంటీనా భాషలో గెవేరా కూడా అంతే “చే” అని పలకరించేవాడు. వైద్య విద్య అయ్యాక “గౌటెమాల” దేశంలో సామ్యవాద అనుకూల ప్రభుత్వంలో పనిచేశాడు. అమెరికా సాయంతో జరిగిన కుట్రలో ప్రభుత్వం కూలిపోవటంతో గెవేరా ఆ దేశం నుంచి పారిపోయాడు.

Ads

che
“ఫిడెల్ కాస్ట్రో” అనే విప్లవ యోధుడు క్యూబా దేశంలో అప్పటి నియంత “బాటిస్టా”కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే గెవేరా దానిలో చేరాడు. అర్జెంటీనా భాషలో చే అని క్యూబాలో పలకరించటం వలన వాళ్ళు గెవేరాని వీడు ఎవడ్రా బాబూ మాట మాటకి “చే” అంటున్నాడు అని గెవేరాని “చే” గెవేరా” అని పిలిచేవారు. “ఫిడెల్ కాస్ట్రో” నాయకత్వంలో పోరాటం విజయవంతం అయ్యి క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో అధికారం చేపట్టినప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో. కొన్ని సంవత్సరాల తర్వాత క్యూబా జాతీయ బ్యాంక్ ప్రెసిడెంట్ గా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యూబా ప్రతినిధిగా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో. ఫీడెల్ కాస్ట్రోని కాదని చే గెవేరా ఆఫ్రికా దేశం అయిన కాంగోలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, కొద్దికాలంలోనే ఓడిపోయి దక్షిణ అమెరికా పారిపోతాడు. దక్షిణ అమెరికా లోని బొలీవియా దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి చిక్కి మరణిస్తాడు. ఫిడెల్ కాస్ట్రో నిర్మించిన 83 మంది దళంలోని ఒక సభ్యుడు చే గెవేరా, అంతే….
గెవేరా ఎక్కడ ఉద్యమం చేశాడు..? ఎక్కడ నాయకత్వం వహించి విజయం సాధించాడు..? విప్లవానికి ఎక్కడ ఊపిరి పోశాడు…? ఎక్కడ అసమానతలను చీల్సి చెండాడాడు..? గెవేరా ఏమి చేశాడో ప్రపంచంలో ఆయన గురించి ఉన్న అన్ని పుస్తకాలని జల్లెడ పట్టినా నాకు అయితే అర్దం కాలేదు. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోని చంపటానికి అమెరికా ఎన్నిసార్లు (638) ప్రయత్నించిందో ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఫిడెల్ కాస్ట్రో గొప్పతనాన్ని తగ్గించటానికి అమెరికన్ రచయిత “జాన్ లీ యాండర్సన్” చే గెవేరా గొప్ప విప్లవకారుడు అని Che Guevara: A Revolutionary Life అనే చే గెవేరా బయోగ్రఫీ రాశాడు.
వేసుకోవాలంటే T- షర్ట్ లపై అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, శ్రీనివాస రామానుజన్ బొమ్మలు వేసుకోండి. లేదా, శివాజీ, రాణా ప్రతాప్ లేదా అఖండ భారతాన్ని ఒక గొడుగు కిందకి తెచ్చిన ఔరంగజేబు బొమ్మలు వేసుకోండి. ప్రపంచం అంతా అజ్ఞానంలో ఉన్నప్పుడు విజ్ఞానాన్ని అందించిన దేశం మనది. అవారా గాడి లాంటి చే గెవేరా స్టిక్కర్స్, బొమ్మలు మనకెందుకురా అయ్యా ! శతకోటి లింగాలలో బోడిలింగం గాడి బొమ్మలు మనకి అవసరమా..? సాధారణ నక్సలైట్ కంటే తక్కువ… వీని గురించి మనకి అవసరమా అన్నది యువతే తేల్చుకోవాలి. అమెరికా సైన్యం అంతా తల క్రిందకి, కాళ్ళు పైకి లేపి ప్రయత్నించినా తమకి గిట్టని క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోని ఏమీ చేయలేక.. ఫీడెల్ కాస్ట్రో గొప్పతనాన్ని తగ్గించటానికి ఎందుకూ పనికిరాని ఒక పనికిమాలిన వ్యక్తిని పైకి లేపారు తప్పితే అక్కడ ఏమీ లేదు, PERIOD…

– జగన్ ……. (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions