Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంతవారమయ్యాము అంటుంటారు కదా… ఎంతవారని..? అదెంతని..?

October 10, 2021 by M S R

Bharadwaja Rangavajhala………….   ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత రికార్డు విడుద‌ల కార్య‌క్ర‌మం ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..

ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ..
బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము అన్నారు.
ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ ….
నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే ఇంత వాడినైతిన‌ని చెప్పినాడు.
ఆ ఇంత ఎంతో నాకు తెలియ‌దు.
ఆ ఇంత‌లో నాకు మ‌రొక‌రు అన‌గా ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర్రావుతో వాటా పెట్టినారు.
మరి వారి వారి వాటా ఎంతయో తెల్పితిరి కారు.
అంతియే కాక నాకు తెలియ‌ని విష‌య‌ము మ‌రొక‌టి క‌ల‌దు..
అస‌లు వారెంతైనారో … కూడా నాకు తెలియ‌దు.
ఆ తెలియ‌ని అంత‌లో ..
ఇంత అన‌నెంతో నాకు అంత‌కంటే తెలియ‌దు.
ఆ ఇంత‌లో నేను చేసినాన‌ని ఆయ‌న చెప్పుచున్న‌దెంతో తెలియ‌దు.

 

Ads

viswanatha
అది అట్లుండ‌నిండు .
ఇక నాకు భగవద్గీత అంటూ ఈ గ్రామ‌ఫోను ప్లేటు ఒక‌టిచ్చినారు.
దీనిని ఆడించు యంత్ర‌ము మా ఇంట లేదు.
పోనీ దీనిని ఏ ప‌చ్చ‌డి జాడీ మీదో మూత‌గా వాడుకొమ్మ‌ని మా ఆవిడ‌కు ఇవ్వ‌వ‌చ్చున‌నుకొంటిని …
అట్ల‌నుకొన‌గా దీనికి మ‌ధ్య‌లో రంధ్ర‌ము క‌ల‌దు.
ఇది ఒక పెను ఇబ్బంది.
అది జాడీ మీద మూత‌గా వాడిన‌ప్పుడు ఈ రంధ్ర‌ములోంచీ ఏవైనా లోనికి ప్ర‌వేశించి ప‌చ్చ‌డి పాడు అగును.
ఏడాది పొడుగూతా వాడుకోవాల్సి ఉన్న ఊర‌గాయ పాడుకావ‌డానికి నేను కార‌ణ‌భూతుడ్న‌వ‌డం చేత ఆవిడ మ‌న‌సులోనైనా నా అమాయ‌క‌త్వ‌మునూ … తెలివిలేని త‌న‌మును గురించి ఏమైనా అనుకునే అవ‌కాశ‌మూ క‌ల‌దు.
ఏ విధ‌ముగా చూసిన‌నూ ఇది నాకు శ్రేయ‌స్క‌ర‌ము అయితే కాదు…
ఇదియునూ అట్లుండ‌నిమ్ము ..
అని ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత మీద‌కు సాగిపోయార‌ట విశ్వ‌నాథ వారు.
ఈ ఉప‌న్యాస‌ము ముగించే స‌రికి హెచ్ఎమ్వీ వారు ఓ రికార్టు ప్లేయ‌రును తెచ్చి విశ్వ‌నాథ వారికి స‌మ‌ర్పించుకున్నార‌ట..
ఆయ‌నే అన్న‌ట్టు అది వేరు విష‌య‌ము… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions