కొద్దిరోజులుగా ఈ ఊదరగొట్టుడు ప్రకటనలు లేక హాయిగా ఉండేది… రేడియోలు, టీవీలు, పత్రికలు… సమాచారాన్ని వ్యాప్తి చేసేది ఏదైనా సరే, కార్పొరేటు విద్యాసంస్థల సేవలో తరించిపోయేవి… ఒకటీ ఒకటీ ఒకటీ, రెండు రెండు రెండు… అంటూ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టు ఒకటే హోరు… అసలు వీళ్ల మీద కాలుష్య నియంత్రణ సంస్థ కేసులు పెట్టాలి కదా, పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టాలి కదా, తప్పుడు ప్రకటనలు ఇస్తున్నందుకు ప్రభుత్వం కేసు పెట్టాలి కదా, వాటిని ప్రచారంలోకి తెస్తున్నందుకు టీవీలు, పత్రికల మీద కేసులు పెట్టాలి కదా… అనిపిస్తుంది… కానీ, ఏదీ జరగదు… అన్ని వ్యవస్థలూ వాటి పాదపూజల్లో తరిస్తుంటయ్… ప్రత్యేకించి నారాయణ, శ్రీచైతన్య మళ్లీ తమ వికారాల్ని ప్రదర్శించడం స్టార్టయిపోయింది… తప్పుడు ప్రకటనలు అని ఊరకే స్వీపింగ్ కామెంట్ చేయడం లేదు… ఈ ప్రకటనలు చూడండి…
ఈనాడు పత్రికలో బోలెడు ఫుల్ పేజీ యాడ్స్ వేశారు, మరీ శ్రీచైతన్య వాడివి నాలుగు పేజీలు… ముందుగా ఫస్ట్ ర్యాంకర్ సంగతి తీసుకొండి… మృదుల్ అగర్వాల్, ఆ అబ్బాయి పేరు… మా స్టూడెంటే, మాదే ఫస్ట్ ర్యాంకు అని వేసుకున్నారు, తోడుగా అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఫోటో కూడా పెట్టారు… అక్కడికి బన్నీ కూడా ఈ మృదుల్‌తో కలిసి జాయింటుగా ఫస్ట్ ర్యాంకు సాధించినట్టు..! ఇదేమయ్యా అంటే బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అట ఈ శ్రీచైతన్య వాళ్లకు… వామ్మో… అసలు విద్యాసంస్థలకు సినిమాతారలు బ్రాండ్ అంబాసిడర్లు ఏమిట్రా అయ్యా..? ఇక ఇదే ఈనాడులో నారాయణ వాళ్ల యాడ్ చూడండి… అందులోనూ ఫస్ట్ ర్యాంకు వాళ్లదేనట… పైగా వింత ఏమిటంటే..? అదే మృదుల్ అగర్వాల్ నారాయణ స్టూడెంట్ అట… వాళ్లూ యాడ్స్ కుమ్మేశారు… ఒరే, ఒకే స్టూడెంట్ రెండు కాలేజీలకూ స్టూడెంట్ ఎలా అయ్యాడు అని మీరు అడగొద్దు, ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాసేసుకున్నారు చిన్నగా, కనీకనిపించని అక్షరాలతో… అంటే… సదరు మృదుల్ అగర్వాల్ ఏకకాలంలో శ్రీచైతన్య, నారాయణ ఆన్‌లైన్ క్లాసులతో ఫుల్లు చదివేసి, ఫస్ట్ ర్యాంకు కొట్టేసి, శ్రీచైతన్య వాడికి, నారాయణ వాడికి జాయింటుగా ఆనందాన్ని కలిగించాడని మనం భ్రమపడాలి… కేసీయార్ భాషలో థూమీబచె అని తిట్టాలనిపిస్తున్నదా..? మీ ఇష్టం…
Ads
సంతోష్‌రెడ్డి ఫస్ట్ ర్యాంక్ అట… అదే సంతోష్‌రెడ్డి, జస్ట్, ఫోటో ఛేంజ్… కాదు, అదే పర్సన్ డ్రెస్ ఛేంజ్… నాలుగో ర్యాంకు అట… రోల్ నంబర్ కూడా సేమ్… అదెలా..? ఇలాంటి తప్పులు కోకొల్లలు… ఇదేమిట్రా అంటే… ప్రకటనల్లో తప్పులుంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి అంటూ కనిపించకుండా నానో అక్షరాలతో డిస్‌క్లెయిమర్ కూడా అచ్చేస్తారు, అతి తెలివి కాదు ఇది… అత్యంతాతి తెలివి… నిజానికి ఈ మృదుల్ అగర్వాల్ ఎవరు..? జైపూర్ అబ్బాయి… తను Allen Institute స్టూడెంట్‌ననీ, కరోనా వల్ల ఆన్‌లైన్ క్లాసులను ఫాలో అయ్యానని విలేకరులకు చెప్పాడు స్వయంగా… ఈ కార్పొరేట్ భూతాలు ఇచ్చే ప్రతి ప్రకటనా ఓ అబద్ధం… ఫీజులు ఒక దోపిడీ… మన వ్యవస్థల్లో ఒక్కడంటే ఒక్కడూ ప్రశ్నించని అరాచకం… అటు వైద్య మాఫియా, ఇటు విద్యా మాఫియా… తోడుగా మీడియా మాఫియా… బ్యూరో మాఫియా అని మరొకటుంది లెండి… అందరూ కలిసి కుమ్మేయండి బ్రదర్స్… మీలాంటోళ్లకు మన దేశం ఎలాగూ స్వర్గధామమే కదా…!! చివరికి fitjee వాడు కూడా ఇలాగే తయారయ్యాడు… మా రెగ్యులర్ classroom student అంటున్నాడు…
9 నుంచి 12 దాకా మా రెగ్యులర్ క్లాస్‌రూం స్టూడెంట్ అని కోటాలోని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన ప్రకటన ఇదుగో…
Share this Article