Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

October 22, 2021 by M S R

………… By….. పార్ధసారధి పోట్లూరి…………..   Mossad Vs ISI…. రెండు అత్యంత ప్రమాదకర గూఢచార సంస్థల మధ్య జరిగిన సమరంలో పాకిస్థాన్ కి చెందిన ఐఎస్ఐ పైచేయి సాధించింది..! మొదటిది ఇజ్రాయెల్ కి చెందిన MOSSAD అయితే రెండవది పాకిస్థాన్ ISI… ఈ కధనం పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి. దానికి సంబంధించిన వ్యక్తి పేరు AQ ఖాన్ గురించి. ఈ నెల 17 వ తేదీన తన 85 వ ఏట చనిపోయాడు aq ఖాన్ ! నిజానికి మొస్సాద్ చేతిలో చావాల్సిన వాడు వయసు మీరి సాధారణ మరణం పొందాడు. AQ ఖాన్ అనేవాడు పెద్ద దొంగ. పేరుకే శాస్త్రవేత్త కానీ వీడు పెద్ద దొంగ ! ఇవి నా మాటలు కాదు. ప్రపంచవ్యాప్తంగా AQ ఖాన్ కి ఉన్న పేరు. పాకిస్థాన్ అణు కార్యక్రమం మీద ఇజ్రాయెల్ కి అనుమానం ఉంది మొదటి నుండి. ఏ మాత్రం ఆధారం దొరికినా ఆ కార్యక్రమాన్నిఆపేస్తుంది ఇజ్రాయెల్. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా గుర్తించలేదు. పాకిస్థాన్ పాస్పోర్ట్ తో ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు లేవు పాకిస్థాన్ కి. పాకిస్థాన్ కనుక అణు బాంబు నిర్మిస్తే అది పరోక్షంగా తనకి చేటు తెస్తుందని ఇజ్రాయెల్ కి తెలుసు. మొస్సాద్ మొదటి నుండి పాకిస్థాన్ మీద నిశితంగా దృష్టి పెట్టింది. అలాంటిది AQ ఖాన్ ఆధ్వర్యంలో మొదటిసారి 1998 లో అణు పరీక్ష చేసినప్పుడు మొదట నిర్ఘాంత పోయింది మాత్రం మోస్సాద్ !

aqkhan

AQ ఖాన్ చనిపోయిన తరువాత మాజీ గూఢచారి [మొస్సాద్ ] బయటికి వెల్లడించిన విషయాలని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అప్పటి మొస్సాద్ చీఫ్ షబ్తయ్ షవిట్ [Shabtai Shavit] ఒక టీంని పంపించి ఉండేవాడు aqఖాన్ ని చంపించడానికి ! కానీ AQ ఖాన్ ఉద్దేశ్యం ఏమిటో సరిగా అంచనా వేయలేక పోయింది మొస్సాద్ ! ఇజ్రాయెల్ కి చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ యోస్సి మేల్మన్ [Yossi Melman] కధనం ప్రకారం… AQ ఖాన్ అణు రియాక్టర్ కి సంబంధించి బ్లూ ప్రింట్స్ దొంగతనం చేశాడు. అక్కడితో ఆగక వాటిని ఇరాన్, లిబియా దేశాలకి అమ్మాడు. అయితే AQ ఖాన్ బ్లూ ప్రింట్స్ ఎక్కడి నుండి దొంగతనం చేశాడో తెలపలేదు కానీ ఉత్తర కొరియా నుండి దొంగిలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా మొస్సాద్ పసిగట్టలేకపోవడం వెనుక ISI సీక్రెట్ ఆపరేషన్స్ ఉన్నాయి కనుకనే ఎవరికీ అనుమానం రాకుండా ఉండిపోయింది పాకిస్థాన్ అణు కార్యక్రమం…

Ads

“How Pakistan’s AQ Khan, Father of the ‘Muslim Bomb,’ Escaped Mossad Assassination”, అనే వ్యాసంలో యోస్సీ మేల్మన్ అప్పట్లో AQ ఖాన్ మిడిల్ ఈస్ట్ లో చాలా బిజీ బిజీగా తిరిగేవాడు. కానీ ఆ పర్యటనల వెనక ఉద్దేశ్యం ఏమిటో మొస్సాద్ కి అంతు చిక్కలేదు. అలా అని మొస్సాద్ ఊరికే చూస్తూ ఉండిపోలేదు. చాలామంది గూఢచారులని నియమించింది ఖాన్ చర్యల మీద కానీ అనుమానం కలిగించే ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయారు గూఢచారులు.

అయితే 1998 లో పాక్ మొదటి అణు పరీక్ష జరపగానే అప్పట్లో కొన్ని అంతర్జాతీయ పత్రికలో కొందరు జర్నలిస్టులు మాత్రం ఇజ్రాయెల్ గూఢచారులని ISI భారీ మొత్తంలో డాలర్లు ఆశ చూపి వాళ్ళని డబుల్ ఏజంట్స్ గా మార్చేసిందని వ్రాసారు. అయితే మొస్సాద్ గూఢచారులకి అంత పెద్ద మొత్తంలో ఇచ్చేంత డబ్బు అదీ డాలర్లు ఎక్కడినుండి వచ్చాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఆ అనుమానాలని పటా పంచలు చేస్తూ సమాచారం బయటపడింది. అప్పటి లిబియా అధ్యక్షుడు మొహ్మద్ గడాఫీకి అణు రియాక్టర్ నిర్మించడానికి సహాయం చేస్తామని చెప్పి, పెద్ద మొత్తంలో డాలర్లు వసూలు చేసి, వాటిని మొస్సాద్ గూఢచారులకి ఇచ్చింది ISI. ఎప్పుడయితే AQ ఖాన్ లిబియాకి అణు రియాక్టర్ నిర్మాణంలో సహాయం చేస్తానని ఒప్పందం చేసుకున్నాడో అప్పటి నుండి మహమ్మద్ గడాఫీ కాశ్మీర్ మీద తన వైఖరిని మార్చుకున్నాడు. ఆఫకోర్స్ ఈ విషయాలన్నీ అప్పట్లో పాకిస్థాన్ లో తిష్ట వేసిన CIA ఆపరేటివ్స్ తెలుసు కానీ అప్పట్లో అమెరికాకి పాకిస్థాన్ అవసరం ఉంది. కానీ లిబియాకి అణు రియాక్టర్ పరిజ్ఞానం దక్కడం అమెరికాకి ఇష్టం లేదు అదే సమయంలో ఇరాన్ కి కూడా అణు టెక్నాలజీ AQ ఖాన్ ద్వారా వెళ్ళింది అనే విషయం బయటపడేసరికి CIA కళ్ళు తెరిచింది. కానీ అప్పటికే ఇరాన్ కి యురేనియం శుద్ధి చేసే విధానం చేరిపోయింది. ఆ తరువాతే మొస్సాద్ ఈ విషయం పసిగట్టగలిగింది కానీ అప్పటికే AQ ఖాన్ పటిష్టమయిన ISI రక్షణలో ఉండిపోవడంతో మొస్సాద్ ఏమీ చేయలేకపోయింది. చివరికి కోవిడ్ వల్ల చనిపోయాడు AQ ఖాన్.

ఇక AQ ఖాన్ ద్వారా ఇరాన్ సమకూర్చుకున్న [ తాను రిటైర్ అయిపోయిన తరువాత స్వంత ఆఫీస్ ఓపెన్ చేశాడు AQ ఖాన్. పదవిలో ఉన్నప్పుడు ఇరాన్ కి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు ] సెంట్రిఫ్యూజ్ [P1,P2 ] లకి ఇరాన్ IRN-1,IRN-2 లుగా పేర్లు పెట్టింది. ఇవి AQ ఖాన్ కి నేరుగా డబ్బు చెల్లించి మరీ కొన్నది. కానీ ఖాన్ మాత్రం తాను అమ్ముకున్న డిజైన్స్ వల్ల వచ్చిన డబ్బుని తన దగ్గరే ఉంచుకున్నాడు. వెనుక ఉండి నడిపించిన ISI కి చిల్లీ గవ్వ కూడా ఇవ్వలేదు. AQ ఖాన్ దగ్గర నుండి సెంట్రిఫ్యూజ్ డిజైన్ బ్లూ ప్రింట్స్ తీసుకున్నది ఇరాన్ అణు కార్యక్రమ శాస్త్రవేత్త Dr. Mohsen Fakhrizadeh ని మాత్రం విజయవంతంగా హత్య చేయించింది మొస్సాద్.

2003 లో అమెరికా ఇరాక్ మీద దాడి చేసినప్పుడు మాత్రం మొహమ్మద్ గడాఫీ కి అర్ధం అయింది తరువాతి టార్గెట్ తానే అని… దాంతో CIA తో పాటు బ్రిటన్ కి చెందిన గూఢచార సంస్థ M-16 ఆపరేటివ్స్ ని పిలిచి వాళ్ళతో చర్చలు చేశాడు. తనకి అణు రియాక్టర్ కి సంబంధించి డాక్యుమెంట్స్ ఇచ్చింది AQ ఖాన్ అని వెల్లడించాడు. తమ దేశం మీద అమెరికా దాడి చేయకుండా ఉండాలి అంటే AQ ఖాన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాను, అలాగే నేను అణు రియాక్టర్ నిర్మాణం చేయను అని ప్రతిపాదించాడు గడాఫీ. అదే సమయంలో ఇరాన్ కూడా AQ ఖాన్ నుండి రియాక్టర్ టెక్నాలజీ ఎంతకీ కొన్నది చెప్పాడు. ఈ డబ్బంతా ఖాన్ స్వంత ఖాతాలలో వెళ్ళిపోయింది. వివిధ దేశాలలో ఉన్న బినామీ అకౌంట్ల లోకి… అణు కార్యక్రమాన్ని అమ్మడం అనేది ఒక వ్యాపారంగా మార్చేశాడు ఖాన్…

1998 లో మొదటి అణు పరీక్ష జరపక ముందు దాదాపు 15 ఏళ్లు మొస్సాద్ ఖాన్ మీద నిఘా పెడుతూ వచ్చింది కానీ అతను ఎందుకు తరుచూ మధ్య ప్రాచ్య దేశాలలో ప్రయాణిస్తున్నాడు అనే దాని మీద మాత్రం తెలుసుకోలేక పోయింది. మొస్సాద్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు ఉన్నా పాక్ అణు కార్యక్రమం మీద మాత్రం తన ఆపరేషన్స్ విషయంలో తీవ్రంగా విఫలం అయ్యింది. లిబియాలో ముందు ఒక్క కోళ్ళ ఫారం నిర్మించి, అందులో నుండి ఒక రహస్య మార్గం ద్వారా భూమిలోకి వెళ్ళి అక్కడ రియాక్టర్ నిర్మాణ మొదటి దశ ప్రారంభించాలి అనే ప్లాన్ ఖాన్ ఇచ్చాడు లిబియాకి. అతి పెద్ద కోళ్ళ ఫారం కూడా నిర్మాణం జరిగింది. అందులో వేల సంఖ్యలో కోళ్ళు ఉన్నాయి కానీ భూగర్భ సొరంగం తవ్వే సమయానికి బయట పడిపోయి లిబియా అణు కార్యక్రమం ఆగిపోయింది. ఇక ఇరాన్ మాత్రం విజయవంతంగా సెంట్రిఫ్యూజ్ స్థాయి వరకు వెళ్ళింది కానీ రియాక్టర్ నిర్మాణాన్ని ఇజ్రాయెల్ బాంబు దాడుల ద్వారా నాశనం చేసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions