చిన్న వార్త… చదవడానికి చాలా చిన్న వార్త… పత్రికలకు, టీవీలకు అది అసలు వార్తలాగే కనిపించలేదు… అంత చిన్న వార్త… కానీ నచ్చాల్సిన వార్త, మెచ్చాల్సిన వార్త… వాడు మీసం తగ్గించాడు, వీడు గడ్డం పెంచాడు, వాడు కిలోంబావు బరువు పెరిగాడు, వీడి వెంట్రుకల్లో ఒకటి తెల్లగా కనిపించింది వంటివి కూడా మనోళ్లకు వార్తలే… ఖర్మ… కానీ నిజంగా అభినందించాల్సిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఒకప్పటి హీరో, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న పనిమనిషిని సత్కరించింది, పూలగుచ్చం ఇచ్చింది, కేక్ కట్ చేయించింది, బొట్టు పెట్టి గౌరవించింది, ఓ బంగారు చెయిన్ ఇచ్చింది… ఇంటి మనిషిని ఇంట్లో మనిషిగా ఈ రజతోత్సవం చేయడం ఓ విశేష సంస్కారం… ఎందరు చేయగలరు ఈ పని..? ప్రత్యేకించి ఫాల్స్ ఈగోలకు, మితిమీరిన రాచరికపు పోకడలకు ఆలవాలంగా ఉండే సినిమా సెలబ్రిటీల్లో ఎందరికి కనీసం ఈ ఆలోచన వస్తుంది..?
https://twitter.com/PraseedhaU/status/1451105102694019072?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451105102694019072%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fkrishnam-raju-family-celebrates-their-maid-25years-service-1405974
Ads
సినిమా సెలబ్రిటీలు ఏ పనిచేసినా పబ్లిసిటీ కావాలి… ప్రయోజనం కావాలి… కానీ ఈ వార్తలో అదేమీ లేదు… కృష్ణంరాజు బిడ్డ ప్రసీద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది… థాంక్యూ పద్మా ఆంటీ అని రాసుకుంది… నిజంగా ప్రభాస్ గానీ, కృష్ణంరాజు గానీ ఈ ఇండస్ట్రీ వాతావరణంలో కాస్త డిఫరెంటుగా కనిపిస్తారు… ఒక్కసారి పైన ట్వీట్‌లోని ఫోటోలు చూడండి, కృష్ణంరాజు భార్య తన పనిమనిషికి బొట్టుపెడుతున్న దృశ్యం కంటికి ఇంపుగా ఉంది… సహజంగానే సోషల్ మీడియాలో మీరు ఏ విశేషం పోస్ట్ చేసినా సరే, వెంటనే చీల్చి చెండాడటానికి, పీకిపీకి పెంట చేయడానికి ప్రయత్నించే నెటిజన్లు ఉంటారు కదా… 25 ఏళ్లు పనిచేస్తే ఆమెకు వచ్చిందేమిటట… ఆమె లైఫ్ సెటిల్ చేయాలి కదా, అలా చేస్తే అభినందించే వాళ్లం కదా అంటూ నీతిబోధలు… చాలా ఇళ్లల్లో పనిమనుషుల్ని అసలు మనుషులుగానే చూడరు, అలాంటిది ఓ చిన్న అకేషన్ సెలబ్రేట్ చేసి… ‘‘అమ్మా, పాతికేళ్లు మాకు సర్వీస్ చేశావు, థాంక్సమ్మా’’ అని చెప్పగలిగే సంస్కారం ఎంతమందిలో ఉంటుంది..? మిగతా అంశాల చర్చలోకి వెళ్లడం లేదు… ఈ సత్కార వార్త పట్ల మాత్రం భేష్ కృష్ణంరాజూ… ఈ విషయంలో నువ్వు ‘రాజువే’… రియల్ సెలబ్రిటీవి…!!
Share this Article