‘‘సీఎంకు బీపీ లేస్తే ఇక కేడర్ అంతా కర్రలు పుచ్చుకుని బజార్న పడి విధ్వంసకాండకు పూనుకోవాలా..? ఎవడో ఓ మూర్ఖనాయకుడు తనకు అలవాటైన ఉన్మాదభాషలో సీఎంను తిడితే, ఇక కేడర్ ఎవడు దొరికితే వాడిని బాదేయాలా..? దాన్ని సీఎం సమర్థిస్తాడా..? ఇదేం రాజధర్మం..? రేప్పొద్దున రాజకీయ ప్రేరేపిత దాడులు ఏం జరిగినా బీపీ అనేది ఓ సమర్థన అవుతుందా..?’’ అని గట్టిగా అడగగలిగిన గొంతు ఇప్పుడు ఏపీలో లేదు… ఎంతటి తీవ్ర ఒత్తిళ్లున్నా సరే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ధైర్యంగానే నిలబడి అడుగుతున్నాడు… దీనికి కారణం తన తెలుగుదేశం అనుకూల రాజకీయ ధోరణి కావచ్చు, ఐనాసరే ఈరోజుకూ తన టెంపర్‌మెంట్ కోల్పోలేదు… ఉండాలి, మరి ఎవరూ లేకపోతే ఎలా..? తను ఎప్పట్లాగే రాసుకొచ్చిన కొత్తపలుకులో ఎప్పట్లాగే బోషిడికే బూతుపురాణాన్ని తెలుగుదేశం కోణంలోనే విశ్లేషిస్తూ పోయాడు కానీ ఆ బూతు పద ప్రయోగాన్ని ఖండించాడు… అదేసమయంలో ఇదే భాష మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఏమైనా శుద్ధపూసలా అని కూడా ప్రశ్నించాడు… ప్రత్యేకించి ద్వారంపూడి, కొడాలి, వంశీ తదితరుల భాష ఎలా ఉందో గుర్తుచేశాడు… (మరీ వంశీ నిన్న మాట్లాడిన మాటలు అత్యంత అభ్యంతకరం…) సీఎం బీపీ సమర్థన ఎంత అభ్యంతరకరమో సరైన వాదనకు దిగాడు… అయితే..?
చంద్రబాబు ధోరణిని కూడా రాధాకృష్ణ ప్రశ్నించి ఉంటే బాగుండేది… (అఫ్‌కోర్స్, తన రాజకీయ అనుకూలతల కారణంగా రాయలేడు)… ఎంతసేపూ వైసీపీ నేతల భాషను ప్రస్తావిస్తాడు తప్ప, మా పట్టాభి వాడిన పదం తప్పే అని ఎందుకు చంద్రబాబు అంగీకరించలేదు, ఎంత హుందాగా ఉండేది..? ఇన్నేళ్ల పొలిటికల్ సీనియారిటీ ఉండీ ఆ రాజకీయ సంస్కారం ఏది..? పైగా వెంటనే ఈ పరిణామాల్ని రాజకీయం చేయడం స్టార్ట్ చేశాడు… అన్నింటికీ మించి అసలు బోషిడికే అనేది తిట్టు కాదనేలా టీడీపీ నేతలు మాట్లాడసాగారు… వైసీపీ కేడర్ కర్రలు తీసుకుని విధ్వంసానికి తెగబడటం ఎలా నీచంగా ఉందో, చంద్రబాబు ధోరణీ అలాగే ఉంది కదా… ఇదుగో ఇవి కూడా రాధాకృష్ణ ప్రస్తావించి ఉంటే బాగుండేది… పైగా షర్మిలకు బీపీ వస్తే..? విజయమ్మకు బీపీ వస్తే..? వివేకా బిడ్డకు బీపీ వస్తే..? అంటూ విపరీత వింత ప్రశ్నల్ని సంధించి, మళ్లీ తనకు అలవాటైన వితండ బాష్యాలు, వాదాల్లోకి వెళ్లిపోయాడు… ఒక తప్పుకు రెండు శిక్షలు అనే వాదన అస్సలు బాగాలేదు… ఆల్‌రెడీ తన్నారు కదా, పోలీసు కేసు ఎందుకనే వాదనే అబ్సర్డ్…
Ads
ఇప్పటితో ఆగిందా, లేదు… వీళ్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్తారు, ఏదో కంప్లయింట్ చేస్తారు, చర్చ సాగుతూనే ఉంటుంది, వైసీపీ వాళ్లు ఎన్నికల కమిషన్‌ను కలుస్తారు… ఇది మరో ప్రచారం, చర్చ… మొత్తానికి పట్టాభి అనే మూర్ఖనేత వాచాలత కారణంగా బోషిడికే అనే తీవ్ర అభ్యంతకరమైన తిట్టు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది… సరే, ఈ నీచ, దిగజారుడు రాజకీయాల్లో ఎవరి తప్పు ఎంతో తవ్వడం మానేస్తే… ఆర్కే వ్యాసం ద్వారా కొన్ని కొత్త జ్ఞానగుళికలు తెలిశాయి… అవేమిటంటే..?
- వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొనే జబర్దస్త్ షోలో ఓ కమెడియన్ ఇంకొకరిని బోసడికే అని పిలిస్తే, అది చూసి రోజా విరగబడి నవ్వింది…
- ఓసారి గాయని జానకి ఏదో సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశించి మాదచ్చోద్ అన్నది…
- లొంగిపోవడానికి అంగీకరించని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆఫీసులపై కూడా దాడులు చేసే ఆలోచనలో ఉన్నారు వైసీపీవాళ్లు…
- సీఎంను అలా తిట్టడం ఏమిటీ అని అభ్యంతరపెడుతున్న కేటీయార్ మరి మైనంపల్లి హన్మంతరావు బండి సంజయ్ మీద వాడిన భాష మాటేమిటి..? ఎందుకు వెనకేసుకొచ్చినట్టు..?
- ఏపీ ఎంత నాశనమైతే తెలంగాణ అంత బాగుపడుతుందని కేసీయార్ అండ్ కో నమ్ముతున్నారు… తమకు నచ్చనివాళ్ల కార్యాలయాలపై వైసీపీ హైదరాబాదులో దాడులు చేసినా సరే కేసీయార్ సహకారం ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు…. (ఇవన్నీ శ్రీమాన్ ఆర్కే గారి వ్యాసరత్నాకరంలోనివే…)
Share this Article