Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాతాళలోకం నిజంగానే ఉన్నట్టుందట సుమా… తాజా రీసెర్చులు చెబుతున్నయ్…

October 31, 2021 by M S R

ఈ విశ్వంలో ఎన్ని లోకాలున్నయ్… మన పురాణాల మేరకు ఆలోచిస్తే పద్నాలుగు… ఊర్ద్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు… అధోలోకాలు అంటే నీచమైనవి అని కాదు, దిగువన ఉండేవి అని..! ఊర్ధ్వంలో ఉండేవి

  1. భూలోకం
  2. భువర్లోకం
  3. సువర్లోకం
  4. మహర్లోకం
  5. జనలోకం
  6. తపోలోకం
  7. సత్యలోకం

మరి అధోలోకంలో…

  1. అతలం
  2. వితలం
  3. సుతలం
  4. రసాతలం
  5. మహాతలం
  6. తలాతలం
  7. పాతాళం

ఛట్, ఇవన్నీ పుక్కిటి పురాణాలు… ఊర్ధ్వంలో ఏముంది..? అంతరిక్షం, ఖగోళం… చిక్కటి చీకటి, శూన్యం… భూమికి దిగువన ఏముంది..? తవ్వేకొద్దీ నీరు, లావాను పోలిన వేడి ద్రవం, విపరీతమైన వేడి… ఇక లోకాలేమున్నయ్..? ఈ సౌర కుటుంబంలో భూమి ఒక్కటే… ఇంకేమీ లేదు అనేవాళ్లు బోలెడు మంది… కాదు, కాదు, మన వాళ్లు మనకు దిగువన ఉన్న అమెరికాను (భూగోళంలో మనం పైన ఉంటే అమెరికా కింద ఉంటుంది కదా…)  పాతాళంలాగా భావించి పురాణాల్లో పొందుపరిచారు అనే సమర్థకులూ బోలెడు మంది… అయితే నిజంగానే భూమిలోపల మనకు తెలియని మరోలోకం ఉందీ అంటున్నాయి కొన్ని పరిశోధనలు…

Ads

earth core

Journal Physics of the Earth and Planetary Interiors అనే ఓ పత్రిక ఉందిలెండి… అందులో ఓ థియరీ పబ్లిష్ చేశారు రీసెంటుగా… Hawaii Institute of Geophysics and Planetology లో geophysicist Rhett Butler మరియు అతని టీం భూమికి సంబంధించిన అయిదు విభిన్న లొకేషన్లలో కొన్ని ప్రయోగాలు చేశారు… పెద్ద పెద్ద భూకంపాల్ని విశ్లేషించారు… ఓ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు, వాటి మీద The University of Bristol కు చెందిన సిస్మాలజిస్ట్ Jessica Irving కొన్ని ఫైండింగ్స్ జతచేశారు… ఇన్నాళ్లూ మనం అనుకునేదేమిటి..? భూమి లోపల ఉన్నదంతా ఓ ఘనపదార్థం… కానీ పలు భూకంపాలను పరిశీలించినప్పుడు… ఫలితాలు భిన్నంగా కనిపించాయట… భూమి లోపల ప్లేట్స్ కదలికల వల్ల ఏర్పడే ప్రకంపనలు కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లోకి వెళ్లేసరికి భిన్నంగా కనిపిస్తున్నయ్… అంటే సాలిడ్ స్టేట్ గాకుండా డొల్ల ప్రదేశాలు ఏవో ఉన్నట్టు తెలుస్తోంది అంటున్నయ్ ఆ పరిశోధనలు… మరి ఆ ప్రదేశాల్లో ఏముంది..? ఆ వేడిలో అసలు జీవం బతికే అవకాశమే లేదు కదా..? అసలు జీవం ఉనికికే చాన్స్ లేదు కదా అంటారా..? అక్కడ కూడా వాతావరణం ఉందనేది ఈ రీసెర్చర్ల డౌటనుమానం… ఏమో… ఏమైనా ఉందేమో… అణుయుద్ధం ప్రబలితే ఆ లోపలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి ఉంటుందా..? అది కూడా రీసెర్చ్ చేసి పెట్టేయడం బెటరేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions