కల్పన… ఇప్పుడున్న మన సౌతిండియన్ ప్లేబాక్ సింగర్లలో మంచి విద్వత్తు ఉన్న గాయని… ఆమె పాట వింటుంటే, తెర మీద చూస్తుంటే ప్లజెంటుగా ఉంటుంది… ఏ పాటపాడినా సరే ఓ రేంజులో పర్ఫామ్ చేయగలదు తను… కానీ తన కూతురికి సంబంధించిన ఏదో మానసిక బాధలో ఉండిపోయి, ఈమధ్య కనిపించడం లేదు… అప్పుడప్పుడూ స్వరాభిషేకం వంటి ప్రోగ్రాముల్లో ఒకటీరెండుసార్లు కనిపించినా సరే, ఆమెలో ఆ పాత జోష్ లేదు… కానీ ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్ తెర మీద కనిపించింది… కంటెస్టెంట్లను ఉద్దేశించి సరదాగా పాడిన పేరడీ పాటలతో అలరించింది… పాత కల్పన కనిపించింది… గుడ్ టు సీ ఓల్డ్ కల్పన అగెయిన్… ఆమె స్వరం ఆగిపోవద్దనీ, మరింత హుషారును తెచ్చుకుని సాగిపోవాలనీ కోరుకుందాం… ఇక బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ షో విషయానికి వస్తే…
గత బిగ్‌బాస్ షోలతో పోలిస్తే ఈ అయిదో సీజన్ చాలా డల్‌గా ఉంది… రేటింగ్స్ మరీ ఘోరంగా ఉంటున్నయ్… చివరకు నాగార్జున హోస్ట్ చేసే వీకెండ్ షోలకు కూడా రేటింగ్స్ రావడం లేదు… జనం కూడా క్రమేపీ పట్టించుకోవడం మానేశారు… దాంతో బిగ్‌బాస్ టీం ఒక్కసారిగా కళ్లుతెరిచింది… ఈ దీపావళి స్పెషల్ షోను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది… ఏకంగా నాలుగు గంటల మారథాన్ షో… బాగుంది కూడా… ఈ యాభై రోజుల్లో బిగ్‌బాస్ కాస్త చూడబుల్ షో అంటే ఈరోజే… కంటెస్టెంట్లతో విపరీతంగా ఆటలు ఆడించారు, డాన్సులు చేయించారు… విచిత్రంగా, అందరూ బాగా పర్ఫామ్ చేశారు… ఇవేకాదు, బోలెడుమంది గెస్టులను తీసుకొచ్చారు, పనిలోపనిగా రెండుమూడు సినిమాలకు ప్రమోషన్లతో మొత్తం షో కలర్ఫుల్గా సాగిపోయింది… ఫుల్లీ ఎంటర్‌టెయినింగ్… అయితే..?
Ads
సుమ ఎపిసోడ్ లెంత్ ఎక్కువైపోయి కాస్త బోర్ అనిపించింది… నిజానికి ఆమె స్పాంటేనిటీ, హ్యూమర్, పంచులు ఏ షోనైనా రక్తికట్టిస్తయ్… కానీ బిగ్‌బాస్ స్క్రిప్ట్ ప్రకారం కంటెస్టెంట్ల మీద పంచులు వేయడంతో ఆమె ఫ్లో ఒరిజినల్‌గా లేదు… ఓవరాల్‌గా వోకే… కానీ సుమ రేంజ్ ఎపిసోడ్ అయితే కాదు… అరియానా, సొహెయిల్, అవినాష్, బాబా భాస్కర్ వచ్చారు, వెళ్లారు… జస్ట్ ఓ పలకరింపు… కాసేపు టైంపాస్… అవినాష్ ఓవరాక్షన్ సరేసరి… వీళ్లే కాదు, శ్రియ, మోనాల్ గుజ్జర్, అవికా గోర్లూ వచ్చారు, వెళ్లారు… మంచిరోజులు వచ్చాయ్ ప్రమోషన్ కోసం వచ్చిన దర్శకుడు మారుతి, నటుడు సంతోష్, హీరోయిన్ మెహరిన్ కాసేపు టైం స్పెండ్ చేశారు గానీ మెహరిన్ మరీ డల్‌గా ఉండిపోయింది… తెలుగు రాకపోవడం, సరిగ్గా అర్థం గాకపోవడంతో కావచ్చు… విజయ్ దేవరకొండ, తమ్ముడు ఆనంద్‌తోపాటు వచ్చాడు… ఆ కాసేపు సరదాగానే సాగింది… తన సినిమా లైగర్, తమ్ముడి సినిమా పుష్పక విమానాన్ని కాస్త ప్రమోట్ చేసుకున్నారు… స్థూలంగా చూస్తే షో బాగుంది… అనుకున్నట్టుగానే, ముందు చెప్పుకున్నట్టుగానే లోబో వెళ్లిపోయాడు… ఒకవేళ వచ్చే వారం గనుక సిరి ఎలిమినేషన్ జాబితాలో లేకపోతే సరి… ఉంటే మాత్రం మెడ మీద ఎవిక్షన్ కత్తి వేలాడబోతున్నట్టే లెక్కేసుకోవాలి…!!
Share this Article