ఈమధ్య ఎవరో రాంగోపాలవర్మను అడిగారుట… బిగ్‌బాస్‌లో అరియానా పర్ఫామెన్స్ చూస్తారా అని… ఆ షో చూడను, నాకు ఐడియా లేదు, కానీ అరియానాను మాత్రం వదలను, వచ్చే ఏదో ఓ సినిమాలో హీరోయిన్ తనే అన్నాడట… నిజానికి ఓసారి ఇంటర్వ్యూ కోసం వెళ్తే, నిన్ను బికినీలో చూడాలని ఉంది అని హఠాత్తుగా ఓ అశ్లీలపు, అసభ్యపు కామెంట్ విసిరాడు వర్మ… సరే, వర్మ అంటేనే మెంటల్ కదా… దానికి ఆమె ఓసారి షాకై, తరువాత కూల్‌గా థాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అనేసింది… ఆమధ్య ఇదంతా రచ్చ రచ్చ…
బిగ్‌బాస్ ముంబై క్రియేటివ్ టీంలో ఓ పెద్దమనిషి వర్మకు తెలుసు… సీన్ కట్ చేస్తే… ఆమె బిగ్‌బాస్ కంటెస్టెంటు… అయితే కేవలం ఎంట్రీకి వర్మ పాస్ ఉపయోగపడిందేమో గానీ… దాదాపు చివరి వారం దాకా ఎవరెవరో ఎగిరిపోయారు గానీ అరియానా నిలబడింది… షోను అర్థం చేసుకుని, దానికి తగ్గట్టు తనకు తాను మౌల్డ్ చేసుకుంది… అదీ కారణం… ఆమె ఎందుకు ఇక్కడి దాకా రాగలిగిందో ఈ ఒక్కరోజు ఎపిసోడ్ చూస్తే చాలు… ఆటను ఆమె ఎంత కమాండింగ్‌గా ఆడుతుందో చెప్పటానికి…
Ads
ఈ రెండు రోజుల తన ఆటతీరు ఆమెను మిగతా కంటెస్టెంట్లకన్నా పైవరుసలో నిలబెట్టాయి… నిన్న సొహెయిల్ రాజు వేషం వేసుకుని, మొదట్లో కాస్త ఎంటర్టెయిన్ చేసినా, తరువాత హారిక రాణి వేషంలో ఉన్నప్పుడు అంతా తిక్క తిక్క చేసి, వీలయినంత బ్యాడ్ మూటగట్టుకున్నాడు… అఖిల్ కోసం త్యాగం, ఫ్రెండ్షిప్, స్పిరిట్, మ్యాన్ విత్ హార్ట్ గట్రా పాజిటివ్ అంశాలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి…
అసలు ఈ వారమే అత్యంత కీలకం షోలో… అందరూ నామినేషన్లలో ఉన్నట్టే అఖిల్ తప్ప… ఎవరికివారు మీరే మీ ఆటతీరుతో ప్రేక్షకుల వోట్లు సంపాదించుకొండి… మీ ధోరణే మీకు రక్ష… లేదా అదే శిక్ష అని చెప్పాడు బిగ్‌బాస్… అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడాలి… అదుగో అక్కడ సొహెయిల్ ఫెయిల్ అవుతున్నాడు… అది ఈరోజు కూడా కొనసాగింది… మరింత బ్యాడ్ అయ్యేలా…
రాజు, రాణి వేషాల తరువాత… ఓపికకు పరీక్ష అంటూ మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్… అంటే ఎవరయితే అన్ని ఉద్వేగాలను కంట్రోల్ చేసుకుని, ఓపికను ప్రదర్శించగలరో.., అంటే కోపం, భయం, నవ్వు, ఏడుపు వంటివి అదుపు చేసుకుంటూ… సంయమనాన్ని ప్రదర్శించగలరో వాళ్లు తోపులు… సరే, అరియానా ఓ స్టేజ్ మీద స్టూల్ మీద కూర్చుంది… ఆమెను బెదరగొట్టడానికి లేదా కంట్రోల్ తప్పేలా చేయడానికి, ఎమోషన్‌కు గురిచేయడానికి అందరూ ప్రయత్నించారు…
అఖిల్ ఇప్పుడు ఏ ఆటలోనూ భాగస్వామి కాడు, అవసరం లేదు… మిగతావాళ్లలో హారిక, సొహెయిల్ ఆమెను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు… ఇక్కడే సొహెయిల్ అదుపు కోల్పోయాడు… మిగతావాళ్లకు పెద్దగా ఏమీ పట్టలేదు, మరి తనకే ఎందుకు..? ఆమెను వెక్కిరించి, ఆమె ఇష్టపడే కప్పు పగులగొట్టి, ఆమె డ్రెస్ ప్లస్ కుక్క బొమ్మ తీసుకొచ్చి టెంప్ట్ చేయడానికి, తనపై కోపంతో అరిచేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు… అరియానా ఫరమ్గా మొహంలో ఏ ఫీల్ లేకుండా భలే తమాయించుకుంది… మంచి మార్కులు కొట్టేసింది… అఖిల్ బ్యాడ్ జడ్జి కాబట్టి తక్కువ మార్కులేశాడు… అది వేరే సంగతి… అరియానా అభిజిత్ బాయ్ ఫ్రెండ్ గా కూడా బాగా చేసింది… ఒక స్టేజిలో మోనాల్ ని క్షమించింది… మొత్తానికి గుడ్…
గోల్డ్ మైక్ ద్వారా ప్రేక్షకులకు సాయం చేయాల్సిందిగా అప్పీల్ చేసుకుంది… మిగతావాళ్ళు ఇలా అప్పీల్ చేసుకోవడానికి ఏకగ్రీవంగా ఆమెకి చాయిస్ ఇచ్చారు… తనని మరొక మెట్టు ఎక్కించాలంటూ ఆమె చేసిన అప్పీల్ కూడా హుందాగా బాగుంది…
అరియానాను ఎమోషన్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో తెలివిగా అభిజిత్, మోనాల్ దూరదూరంగానే ఉన్నారు… హారిక సొహెయిల్కు సాయం చేసింది కానీ తను ప్రత్యక్షంగా అరియానాను కెలకలేదు… ఎటొచ్చీ బ్యాడ్ అయిపోయింది సొహెయిల్… నిజానికి ఇలాంటి టాస్కులే ఈ ఫినాలే రేసులో కంటెస్టెంట్లకు కీలకం అవుతాయి… ప్రేక్షకులు అంచనాలు వేస్తారు… సొహెయిల్ కాస్త తమాయించుకుంటే హారిక లేదా మోనాల్ ఈవారం ఎలిమినేట్ అయిపోయేవారు… కానీ వాళ్లకు నేనెందుకు చాన్స్ ఇస్తాను అన్నట్టుగా సొహెయిల్ చెడగొట్టుకుంటున్నాడు… చేజేతులా…!
అఖిల్ ఎలాగూ పోటీలో లేడు కాబట్టి తన ఫ్యాన్స్ కూడా సొహెయిల్కు వోట్లేయడమే ఇక తనకు రక్ష… లేకపోతే ఎలిమినేషన్ దిశలో హారికతో పోటీపడాల్సిందే… మోనాల్‌ను కాపాడేందుకు బిగ్‌బాస్ ఎప్పుడూ రెడీగానే ఉంటాడు కాబట్టి…! అభిజిత్ వోట్లకు ఎలాగూ ఢోకా లేదు కాబట్టి…!!
అన్నట్టు… అఖిల్, మోనాల్ లవ్ మళ్లీ ట్రాకు ఎక్కింది… ఈలోపు ఎందుకో ఎమోషనల్ గా ప్యానిక్ అయిపోయి, అందరూ తనను దూరం పెట్టేస్తున్నారు, తను ఈ ఆటకు, హౌస్‌లో ఉండటానికి అనర్హురాలిని అంటూ వెక్కుతూ ఏడుపు మొదలెట్టింది… అరియానా, హారిక ఒక దశలో ఠారెత్తిపోయారు… అసలు ఆమె బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు… ఎప్పుడూ ఏదో ఓ ఏడుపు… Confession రూంలో బిగ్ బాస్ ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి, ఊరడించి, పంపాడు…
కొసమెరుపు :: అరియానా స్ట్రాంగ్‌గా ఉంటూ, సొహెయిల్ బ్యాడ్ చేసుకుంటున్నాడని అనుకున్నాం కదా… రేపటి ఆట ప్రొమోలోనూ అదే కనిపించింది… అరియానా ఫెయింటై ఏడుస్తూ పడిపోయింది… సొహెయిల్కు మరింత బ్యాడ్…. ఎస్, బ్యాడ్ లక్…!!
Share this Article