నిజానికి పైపైన చూస్తే ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య తప్పేమీ ఉన్నట్టు అనిపించదు… కానీ మరో కోణంలో చూస్తే తన తప్పులూ కొన్ని కనిపిస్తయ్… అదేనండీ… హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌజులో పోలీసులు పేకాట దందాను బ్రేక్ చేసి, 30 మందిని అరెస్టు చేశారనీ, అందులో రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు ఉన్నారనే వార్త… ఇక్కడ కొన్ని అంశాలు ప్లెయిన్‌గా చెప్పుకోవాలి… హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టుల్లో, ఫామ్ హౌజుల్లో డ్రగ్ పార్టీలు, రేవ్ పార్టీలు, పేకాట పార్టీలు సాగుతున్నాయనే విమర్శలు ఇప్పుడు కొత్తేమీ కాదు… అంతెందుకు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పబ్బుల్లో డ్రగ్ దందా తెలియందేమీ కాదు… విచ్చలవిడి ‘సంభోగ వ్యాపారం’ ప్లస్ మత్తు వ్యాపారం మీద బోలెడు వార్తలు… చివరకు ఒకనాటి హీరో తరుణ్, నటుడు నవదీప్ వంటి కేరక్టర్ల మీద బోలెడు ఆరోపణలు ఉండనే ఉన్నాయి…
ఏ గోవాకో, ఏ థాయ్‌లాండ్‌కో పోవాలంటే రకరకాల కోవిడ్ ఆంక్షలు, ఖర్చులు… సో, చుట్టుపక్కలే ఆ వాతావరణం క్రియేటైపోతోంది… అసలే ఏపీ, తెలంగాణల్లో గంజాయి, డ్రగ్స్ దందా ఇప్పుడు రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది… తెలంగాణ సీఎం ప్రత్యేకంగా సమీక్ష పెట్టి మరీ ఆ మత్తు దందా మీద ఉక్కుపాదం పెట్టాలని ఆదేశిస్తున్నాడు… ఎక్కడెక్కడో పట్టుబడిన డ్రగ్స్‌కు ఏపీ చిరునామాల లింకులూ బయటపడుతున్నయ్… ఈ స్థితిలో హీరో నాగశౌర్య ఏం తప్పు చేసినట్టు..? నిజంగా తప్పేనా..? ఇదీ ప్రశ్న…
Ads
విషయం ఏమిటంటే… హీరో నాగశౌర్య హైదరాబాద్ శివారులో, మంచిరేవుల వద్ద గ్రీన్‌లాండ్స్ వెంచర్‌లో రమణ అనే వ్యక్తికి చెందిన ఓ ఫామ్ హౌజును లీజుకు తీసుకున్నాడు… అయిదేళ్ల లీజు, తీసుకున్నది ఓ హీరో కాబట్టి సదరు ఫామ్ హౌజ్ ఓనర్ ఎవరో ధీమాగా ఉన్నట్టున్నాడు… తనకు డబ్బులొస్తే చాలు… అలా లీజుకు తీసుకున్న ఫామ్ హౌజును నాగశౌర్య ఖాళీగా ఉంచడు కదా, సినిమా-టీవీల షూటింగులకు, పార్టీలకు ఇస్తుంటాడు… తప్పదు, అదొక వ్యాపారం… దీపావళి, పండుగ జోష్, జనం కరోనా అనంతరం సెలబ్రేషన్స్ మీద కక్కుర్తి… పైగా నాయకులు, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, కంట్రాక్టర్లు అంటేనే డబ్బు బలుపు కదా… (బలుపు అనే పదం సరిపోదా..? సరే…) ఎవడో సుమంత్ చౌదరి పేరిట నాగశౌర్య దగ్గర నాలుగు రోజులకు బుక్ చేసుకున్నాడు… ఈ వార్త చూడండి… (
అసలే రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలు, నానా చెత్తా యవ్వారాలు… ఈ స్థితిలో నాగశౌర్య కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఉండాల్సింది… ఎవడో ఒకడు నాలుగు రోజులు గుత్తాకు తీసుకుంటున్నాడూ అంటేనే అనుమానించాలి… ఏ తలకుమాసిన యవ్వారమో జరిగితే తన నెత్తికి ఎక్కడ చుట్టుకుంటుందీ అనే సోయి ఉండాలి… అదేమీ లేనట్టుంది… అలా బుక్ చేసుకున్నవాడెవడో గానీ ఈ గోవా బ్యాచులను సమీకరించాడు… పేకాట, మందు మన్నూమశానం ఆర్గనైజ్ చేశాడు… ఇంకేముంది, పోలీసులు కమ్ముకున్నారు… 6.7 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, 30 మందిని అదుపులోకి తీసుకున్నారు… వాళ్లంతా లబోదిబో… నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇలాంటి యవ్వారాలకు అడ్డుకట్ట వేయాలంటే పట్టుబడిన ప్రతి ఒక్కటి పేరునూ వెల్లడించాలి… అవి ఇతరులకు పాఠం కావాలి… మరి ఇక్కడ నాగశౌర్య తప్పేమిటి..? ఇదొక చిక్కు ప్రశ్న… షూటింగులకు గాకుండా నాలుగైదు రోజులు బుక్ చేసుకున్నారెవరో అంటేనే అనుమానించాలి… అసలే రోజులు బాగాలేవు… తెలిసీ, నాదేం పోయిందిలే అనుకున్నాడా..? కానీ ఇకపై ఎప్పుడూ తనపై పోలీస్ నిఘా ఉంటుందనే సోయి లోపించినట్టుంది పాపం హీరోగారికి…!! దిగుదిగుదిగు నాగశౌర్యా, దివ్యాసుందర నాగో నాగన్నా…!!!!
Share this Article