అదేమిటో గానీ… రాధాకృష్ణ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు అలా మౌల్డ్ అయిపోయారేమో… ఏది రాసినా సరే, వైసీపీ మీద ద్వేషం, తెలుగుదేశం మీద ప్రేమ ఆటోమేటిక్‌గా అక్షరాల వరదలాగా తన్నుకొస్తాయి… ఆ రాతలో పడి, కొన్నిసార్లు తాము అసలు ఏం రాస్తున్నారో కూడా తమకే సమజ్ కానంత గందరగోళంలో పడి కొట్టుకుపోతుంటారు… ఇతరత్రా విషయాలు, తన టెంపర్‌మెంట్ అంశంలో ఆర్కే ఈజ్ వోకే… కానీ మరీ ఈమధ్య కొన్ని కథనాలయితే మరీ వైసీపీ మీద విషమే… సరే, పాత్రికేయ రాజకీయాల్లో ఇవన్నీ కామన్, ఇవ్వాళ్రేపు పాత్రికేయ ప్రమాణాలూ మన్నూమశానం ఏమున్నాయిలే అనుకుని రాజీపడినా… అసలు లాజిక్కులు లేని కథనాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి…
సరే, వర్తమానానికొస్తే బద్వేలు ఉపఎన్నిక… మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టకూడదనే స్పూర్తికి నిజంగానే కట్టుబడిందా, లేక ఎలాగూ ఓడిపోయే సీటుకు ఈ సాకు వెనుక దాక్కుండిపోతే సరి అనుకుందా తెలియదు గానీ తెలుగుదేశం పోటీలో లేదు… మీ తెలుగుదేశమే పోటీలో లేదు కదా, మరి ఆ కవరేజీలో ప్లెయిన్‌గా ఉండొచ్చు కదా… నో, వైసీపీని వెకిలి చేయాలి…
Ads
ఈ వార్త చూడండి… వైసీపీ వాళ్లు లక్ష మెజారిటీ అనుకున్నారట… కానీ అది దాటలేదట… జస్ట్, 90 వేల దగ్గరే ఆగిపోయిందట మెజారిటీ, దాంతో అధికార పార్టీలో ఆనందం కనిపించడం లేదట… ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందుకు వచ్చి బాణాసంచా కాల్చి, అందరికీ స్వీట్లు పంచితే తప్ప ఈ పత్రికకు ఆ ఆనందం కనిపించదేమో…! ప్రధాన ప్రతిపక్షం ఉందా లేదా అనేది రికార్డులకు అక్కరలేదు… ఒక ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిని రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిందనే వివరాలే అధికారికంగా రికార్డ్ అవుతాయి… రాధాకృష్ణకో, చంద్రబాబుకో నచ్చినా నచ్చకపోయినా సరే… ఆ గణాంకాలు అయితే మారవు కదా…
పైగా మరో జోక్ ఏమిటంటే..? కాంగ్రెస్ వోటు బ్యాంక్ పుంజుకున్నదట… అసలు మొత్తం పోలైన వోట్లలో 6235 వోట్లు కాంగ్రెస్‌కు వస్తే అది పుంజుకోవడమా… హహహ… వైసీపీకి పడిన లక్ష వోట్లలో 90 వేలు దొంగ వోట్లే అని తులసిరెడ్డో ఇంకెవరో అన్నట్టు గుర్తు… ఫాఫం, ఆంధ్రజ్యోతి వార్త కూడా అంతకు భిన్నంగా ఏమీ లేదు… ఇంకా నయం, లక్ష వోట్ల మెజారిటీ రాకపోవడంతో జగన్ ఆ ఉపఎన్నికల పార్టీ బాధ్యులను తిట్టాడు, ఒకరిద్దరు అప్పుడే రాజీనామాలకు సిద్ధపడుతున్నారు, వైసీపీలో సంక్షోభం స్టార్టయిపోతోంది అని ఎడమచేత్తో నాలుగు ముక్కలు రాసిపారేయలేదు… సంతోషం..!
Share this Article