మోషన్ పోస్టర్ అంటారు… సినిమా గురించి సంక్షిప్త పరిచయం అన్నమాట… సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ ఓ ఊరి పెద్దగా కనిపించడం, రోకలి తాకగానే రోలు పగిలిపోవడం…. హహహ… సుమా… పోస్టర్‌లోనే ఇంత నవ్వించావంటే… ఎస్, ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వు ఇంకా నవ్వులు పూయించడం గ్యారంటీ… అసలు టీవీ తెర మీద, ఫంక్షన్లలో నిన్ను చూడగానే నవ్వొస్తుంది… నీ స్పాంటేనిటీ, నీ పంచులు, నీ నవ్వులు ఆహ్లాదాన్ని ఇస్తాయి… నవ్విస్తాయి… క్యాష్ గానీ, మరో టీవీ ప్రోగ్రాం గానీ, నువ్వు ఎంత సీరియస్‌గా కనిపించినా సరే, నవ్వొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా… ఓ ఖాన్ దాదాగా బ్రహ్మానందం, ఓ పెదరాయుడిగా ఆలీని చూడగానే నవ్వు రాదా..? సేమ్ అన్నమాట… అందుకే రోలు ఫోటో పగిలిపోయింది… సారీ, ఇరగదీసింది తరహాలో పగలదీసిందిపో అనాలేమో…
అసలు ఓ తెలుగు హీరోకన్నా నువ్వేం తక్కువ..? ఏదో మొగడు సినిమాల్లో నటిస్తే బాగుండదు అని హెచ్చరించాడు కాబట్టి, అబ్బే ఆ సినిమా వాతావరణం నాకు పడదబ్బా, అందుకే సినిమాలు చేయను అని చెబుతూ కవరింగ్ ఇచ్చేస్తున్నవ్… కానీ ఓ తెలుగు హీరోకన్నా నీ రేంజ్ ఎక్కువే, రెవిన్యూ ఎక్కువే, అభిమానులూ ఎక్కువే… సినిమాలో హీరో ఎంట్రీ గానీ, ప్రోమోలు గానీ ఎలా ఉంటయ్..? హీరో చేయి అలా విదిలిస్తాడో లేదో అలా పదీఇరవై మంది దుక్కల్లాంటి రౌడీగాళ్లు అంతరిక్షంలో ఎగిరిపోతుంటారు… ఆ రేంజ్‌కు ఏమీ తక్కువ లేదు ఇది కూడా… నువ్వు దంచేెసెయ్ సుమా… నీకు ఇండస్ట్రీలో తిరుగేముంది..? చూసేస్తాం, నవ్వొస్తున్నా సరే, నీ పెదరాయుడు పాత్రను చూసేస్తాం… స్టార్ మ్యూజిక్కులు, క్యాషులు గట్రా చూడటం లేదా ఏం..? అవునూ, అప్పట్లో మీ ఆయన వద్దన్నాడు, ఇప్పుడు వోకే వోకే గోఎహెడ్ అన్నాడా..? అసలు పర్మిషనే అడగలేదా..?
Ads
పెదరాయుడు పేరు పుంలింగం… స్త్రీలింగం పేరు తోచలేదు… పెద్ద రాయి అని పెడితే రాయిరప్ప అనే అర్థాలొస్తయ్… రాయక్క, రాయమ్మ అని పెట్టలేక… బొబ్బిలి బ్రహ్మన్న తరహాలో బొబ్బిలి బ్రహ్మిణి లేదా బ్రహ్మి అని పెడితే మరీ బ్రహ్మానందానికి ఆడపేరులా వినిపించే ప్రమాదముంది… అలాగే రచ్చబండ, బతుకుజట్కాబండి వంటి మరీ నవ్వొచ్చే పేర్లు నీ రేంజ్‌కేమో సూట్ కావు… అందుకని ఇలా జయమ్మ పంచాయితీ అని పెట్టేశారన్నమాట… జయక్క అని పెడితే ఇంకాస్త పంచ్ ఉండేది… నువ్వు పంచాయితీ పెట్టుకున్నావా..? పంచాయితీలు తెంపుతుంటావా..? అది పంచాయితీయా..? పంచాయతీయా..? సినిమా చూస్తే తెలుస్తుందన్నమాట… చెట్టుకు వేలాడదీసిన మనుషులు, కొందరు తీవ్రవాదులు గట్రా లుక్కయితే అదిరింది… తీరా నీ రోలురోకలి, నీ చూపు చూడగానే మళ్లీ నవ్వొచ్చేసింది… సినిమా చూస్తుంటే ఇంకెంత నవ్వొస్తుందో… హహహ… పగలగొట్టెయ్యక్కా… ఈసారి అఖండ తరహాలో అఖండి అని బాలయ్య రేంజులో ప్లాన్ చేయిద్దాం… జై జయక్కా…!! పదీఇరవయ్యేళ్లు లేటయితే అయ్యింది.., సినిమాల్లోకి రాను అనుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ఇరగ్గొట్టేయడమే…!!
Share this Article