Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాళ్లకు అంత దమ్ములేదులే గానీ… ఐపీసీకి ఎప్పుడు అతీతమైపోయారు సార్..?

November 8, 2021 by M S R

ఒక ముఖ్యమంత్రి, ఆ భాషా సంస్కారం గురించి కాసేపు వదిలేద్దాం… దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… లొట్టపీసు ధర్మపురి అర్వింద్‌కూ నీకూ తేడా ఏమున్నట్టు అని కూడా మనం అడగనక్కర్లేదు…! పుసుక్కున ఏదో ప్రశ్నడిగిన జర్నలిస్టు మీద జ్ఞానముందా అని ఎప్పటిలాగే గయ్యుమన్నాడు… జ్ఞానం పెంచుకోవడం కోసం మాత్రమే తమరి ప్రెస్‌మీట్లకు వస్తుంటాం అని కూడా చెప్పనక్కర్లేదు, మీడియా సంస్థలే వణికిపోతుంటే ఆఫ్టరాల్ రిపోర్టర్లెంత..? అదీ కాసేపు వదిలేయండి… వరి మీద ఏదో చెప్పాడు, పెట్రో ధరల మీద ఏదో చెప్పాడు… ఆ విషయాల్నీ, నిజాల్ని, అబద్ధాల్ని, ఆ చర్చను కూడా కాసేపు లీవ్ ఇట్… దేశంలో అగ్గిపెట్టడం ఏందో కూడా ఛోడ్ దేవ్… అక్కడ అరుణాచల్‌లో చైనావాడు దంచుతున్నడట, ఊళ్లకూళ్లు కడుతున్నడట, అక్కడ తోకముడిచినమట… వావ్, ఆ అద్భుతమైన రాజనీతిజ్ఞత, అఖండమైన విజ్ఞత గురించి కూడా లోలోపల కుమిలిపోతూ మనమే మరిచిపోదాం… ఆ ప్రెస్‌మీట్ అంశాలు చాలా వరకూ అసలు విననేలేదనీ, చూడనేలేదని, చదవనేలేదని అనుకోవడం బెటర్… ఫాఫం, ఏదో హుజూరాబాద్ ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో ఏవేవో అని ఉంటాడులే అనుకుందాం… నిజంగానే అది మామూలు షాక్ కాదు కదా… కానీ..?

kcr

జైలుకు పంపుతరా..? బలుపా..? అంత అహంకారమా..? కళ్లు నెత్తికొచ్చాయా..? నన్ను ముట్టి చూడు, టచ్ చేసి చూడు, ఇక్కడ బతికి బట్టకట్టి తిరుగుతం అనుకుంటున్నరా..? చేతులు ముడుచుకుని కూర్చున్నమా..? అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తం…… ఈ మాటలు విచిత్రంగా ధ్వనించినయ్… ఆ భాష తీరు వదిలేసేయండి, బండి సంజయ్‌ను తిట్టాడని అనుకోవాలా..? బండి సంజయ్ భాషకు తగినట్టే మాట్లాడాడులే పర్లేదు అనుకోవాలా..? లేక పరోక్షంగా మోడీకి సవాల్ విసురుతున్నడా..? నీకు చేతనైతదా అని అడిగినట్టు అనుకోవాలా..? దేశంలో అగ్గిపెడతా అనడం, అరుణాచల్‌లో తోకముడుచుడు, ఇక ఊరుకోను, మెడలు విరుస్తాననడం, ఢిల్లీలో ధర్నాలు చేస్తామనడం గట్రా అమిత్ షాకు ఛాలెంజ్ విసరడమా..?

Ads

పెట్రో మీద కేంద్రం అడ్డగోలుగా సెస్ వేసింది, జనాన్ని దోచేస్తుంది … కరెక్ట్… అవన్నీ రద్దు చేయాలి… గుడ్… పంజాబ్ లో మొత్తం పంట ఎట్లా కొంటున్నవ్..? గుడ్ పాయింట్… రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి duty గాకుండా సెస్ పెంచారు… Exactly… అందర్నీ కలుపుకొని పోరాడతా… రైట్…. కానీ అదేదో హుందాగా question చేయచ్చు కదా… నీ రేంజ్ వేరు మహాశయా… మర్చిపోతే ఎట్లా..?

అబ్బే, ఆయన ఇట్లా మస్తు మాట్లాడతడు, వాళ్లు పిలవగానే ఢిల్లీ పోయి, అన్నీ సెటిల్ చేసుకుని వచ్చేస్తాడు, రోజులతరబడీ మళ్లీ జనం ఎదుటకు రాడు, ఈ ప్రెస్‌మీట్ కూడా వాళ్లను అడిగే పెట్టి ఉంటాడు అని తేలికగా తీసిపారేసేవాళ్లు కూడా ఉన్నారు… కానీ రాజకీయంగా అప్పుడప్పుడూ బీజేపీ మీద విసుర్లు విసిరినా సరే, కేసీయార్ టోన్ బీజేపీ మీద ఈ రేంజులో ఎప్పుడూ ధ్వనించలేదు… అటు జగన్ విడుదల చేసిన పత్రిక ప్రకటన, ఇటు ఈయన ప్రెస్‌మీట్ అంత తేలికగా, పెరిఫెరల్‌‌గా చూడలేం… సాధారణంగా తన ప్రెస్‌మీట్‌లో ఎప్పుడూ కాంగ్రెస్‌ను బూతులు తిట్టే సీఎం ఈసారి ఆ పార్టీని అస్సలు పట్టించుకోలేదు… (కాంగ్రెస్‌తో దోస్తీ కుదర్చడానికి కేవీపీ రాజకీయాలు ఏవో ఫలిస్తున్నాయనే బ్లాంకెట్ స్టేట్‌మెంట్ కూడా ఇప్పుడు అనవసరం… అదంత తేలిక కాదు…)

touch

జైలుకు పంపించడం అనేది బీజేపీ పెద్దలకు చేతకాదు, ఏవో రాష్ట్ర అధ్యక్షుడితో బీరాలు పలికిస్తారు అని అందరికీ తెలిసిందే… నిజంగా వాళ్ల దగ్గర కేసీయార్ అవినీతి మీద ఆధారాలుంటే ఎందుకు ఊరుకుంటున్నట్టు మరి..? అక్కడ మమత బజారులో నిలబెట్టి ఒక్కొక్కరినీ చీరుతా అన్నట్టుగా విరుచుకుపడుతుంటేనే ఇన్నేళ్లుగా ఆమెను ఏమీ చేయలేకపోయారు..? పైగా ఒక్కొక్కరే మళ్లీ ఆమె కాళ్ల మీద పడిపోయి, తిరిగి పార్టీలో చేరిపోతున్నారు… మీ అంతుచూస్తాం అని అచ్చం ఇప్పటి కేసీయార్‌లాగే మొన్నటి ఎన్నికల ముందు చంద్రబాబు కూడా బెదిరించాడు… సవాళ్లు విసిరాడు, కాంగ్రెస్‌తో కలిశాడు, సాయం చేశాడు, తనను ఏం చేయగలిగారు..? సో, బీజేపీ పెద్దలకు ఏదో చేతనైతదనేది ఓ భ్రమ… కానీ కేసీయార్ జైలు సంగతిని పదే పదే ఎందుకు చెబుతున్నాడు..? నిజంగా బండి సంజయ్ మాటలకు, బెదిరింపులకు సీఎం స్పందించి బదులు ఇవ్వాల్సినంత సీన్ ఉందా..?

ఒకవేళ నిజంగానే కేసీయార్ అవినీతి మీద కేంద్రంలోని పెద్దల దగ్గర ఆధారాలుంటే, కేసీయార్ జోలికి వెళ్లి, కెలకాలని అనుకుంటే… ఒకవేళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్‌తో షేర్ చేసుకుని ఉంటే… (ఒకవేళ…!!!) జైలుకు పంపించే స్థాయిలో దర్యాప్తు, విచారణ, శిక్షల ఖరారు వంటివి సాధ్యమైతే… (ఒకవేళ..!!) జరిగితే జరగొచ్చు కదా… అందులో అసాధ్యమేముంది..? జరగొద్దని ఏముంది..? దానికి చేతులు ముడుచుకుని కూర్చుంటమా, టచ్ చేసి చూడు, బలుపా, జైలుకు పంపిస్తే ఇక బీజేపీ వాళ్లు బతికి బట్టకట్టి బయట తిరిగే చాన్స్ ఉండదా..? ఇదేం బెదిరింపు..? కేసీయార్ ఐపీసీలకు అతీతుడా..? లాలూ, జయలలిత, చౌతాలా… వాళ్ళూ ఒకప్పుడు రాజ్యాలు ఏలిన వాళ్ళే… మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా అచ్చం ఇలాగే మాట్లాడాడు… కావాలంటే పాత క్లిప్పింగులు ఓసారి తిరగేయండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions