‘‘15 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్…’’ ఒక్కసారి ఊహించండి… చైనా నిర్మించిన కొత్త సూర్యుడు వెలువరించే ఉష్ణోగ్రత ఇది… ఇది ఒరిజినల్ సూర్యుడి మధ్యభాగంలో ఉన్న వేడికన్నా పది రెట్లు ఎక్కువ……. ఆగండాగండి… ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా… కాస్త సరళంగా చెప్పుకుందాం… చైనా ఏదైనా చేయగలదు… కృత్రిమ ద్వీపాలు సృష్టించగలదు… చంద్రుడి మీద మట్టి తీసుకురాగలదు… ఆమధ్య కృత్రిమ చంద్రుడిని బిగించే పని మొదలుపెట్టింది… అంటే అంతరిక్షంలోని ఓ భారీ ఉపగ్రహాన్ని పంపించేసి, దానికి భారీ సౌరపలకలు బిగించేసి, రాత్రివేళల్లో సౌరకాంతిని తన నగరాల మీదకు పరావర్తనం చేసుకుంటుంది… వావ్…
అలాంటిదే చైనా ఓ కృత్రిమ సూర్యుడిని కూడా నిర్మించింది… నాలుగు రోజుల క్రితం దాన్ని యాక్టివేట్ కూడా చేసింది… ఆ వేడి క్రమేపీ పుంజుకుని ఇక కోట్ల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉత్పత్తి కావడమే… చైనా కదా… ఏదైనా చేయగలదు… ఒక కరోనాను పుట్టించగలదు… ఓ సూర్యుడిని పుట్టించగలదు… విషయానికొస్తే… నిజానికి కృత్రిమ సూర్యుడు అనే పదం వాడటం తప్పు… ఇది ఓ అణు రియాక్టర్… దాని పేరు HL-2M Tokamak reactor… మరి ఎందుకు సూర్యుడు అంటున్నారంటే..?
Ads
మామూలుగా ప్రపంచమంతా వాడే అణు రియాక్టర్లలో Fission అంటే అణువిచ్ఛిత్తి… తద్వారా వేడి… దాన్నుంచి పవర్… కానీ సూర్యుడిలో వేడికి Fusion,,, అణుసంలీనం కారణం… తద్వారా వేడి… చైనా నిర్మించిన ఈ భారీ రియాక్టర్లో కూడా సేమ్ సూర్యుడిలోలాగే ఫ్యూజన్… అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ సూర్యుడు అని వ్యవహరిస్తున్నారు… అదీ కథ…
అయితే ఇది కూడా వెలుగునిస్తుందా..? ఇవ్వదు..! వేడిని ఇస్తుంది… పవర్ జనరేట్ చేసుకోవాలి… సాధారణ, సంప్రదాయిక రియాక్టర్లలో న్యూక్లియర్ వేస్ట్ అధికం… ఇప్పటి చైనా ఆధునిక రియాక్టర్ వల్ల వేడి ఎక్కువ, వేస్ట్ తక్కువ… అమితమైన కరెంటు… అదే రాబోయే రోజుల్లో చైనా ఇంధనం… ఇది సక్సెసయితే చైనా ఎకానమీయే ఊహించనంత పుంజుకుంటుంది…
ఇదంతా సరే… మరి మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి..? అవి కూడా ఇలాంటి ప్రయోగాలకు పూనుకుంటున్నాయి… ఫ్రాన్స్ ఆల్రెడీ ఇదే పనిలో ఉంది… చైనా ప్రయోగం సక్సెసయితే ఇక అణుపరిజ్ఞానం ఉన్న ప్రతి దేశమూ ఈ పనే చేస్తుంది… అఫ్కోర్స్, మనకూ ఆ పరిజ్ఞానం ఉంది… రష్యా, అమెరికా వంటి దేశాలూ ఇదే పనిలో పడతాయి… ఎందుకంటే… క్లీన్ పవర్, చీప్ పవర్, రిలయబుల్ పవర్… భారీ థర్మల్, భారీ సోలార్ ప్లాంట్లకన్నా మేలు కదా…
కానీ భద్రత ఒక్కటే సందేహం… ఎందుకంటే..? ప్రపంచంలో అనేక దేశాలు రేడియేషన్, ప్రమాదాల భయంతో ప్లాంట్లు మూసేస్తున్నాయి… జరగరానిది ఏదైనా జరిగితే ఎలా..? ఇంత భారీ రియాక్టర్ పరిస్థితి ఏమిటి..? ఆఁ ఏముందీ..? చైనాకు అవేమీ పెద్దగా పట్టవు… కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం కావడం లేదా..? ఈ రియాక్టర్‌కు ఏమైనా జరిగితే ప్రపంచమంతా భరించాల్సిందే… అవి విస్ఫోటనాలు కావచ్చు, అణుధార్మికత వ్యాప్తి కావచ్చు… ఇంకేదైనా కావచ్చు…! వెదర్ మోడిఫికేషన్లు సహా చైనా ఇంకా చాలా చేయబోతున్నది… చైనా అడుగు- ప్రపంచం వణుకు… అంతే…!!
Share this Article